Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఇంట్లో పూజా గది ఎలా ఉండాలి, ఈ చిట్కాలు పాటిస్తే శ్రేయస్సు
ఇంట్లో పూజా గది ఎలా ఉండాలి, ఎటు వైపు ఉండాలి, ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోవాలంటే ఈ పూజ గది వాస్తు చిట్కాలు పాటించండి.
Pulse
oi-Pavan Ch
By Pavan Ch
ఇంట్లో పూజా గది ఎంతో ప్రత్యేకం. పూజా గది ఇంట్లో సానుకూల శక్తిని ఇస్తుంది. పూజ గదిని సాధ్యమైనంత వరకూ ఈశాన్యం, తూర్పు, పశ్చిమ దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. తెల్లవారుజామున సూర్యుడు ఇంటికి ఈశాన్య దిక్కులో ఉంటాడు. ఈ సమయంలో యోగ, ధ్యానం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగుతాయి. అందుకే పూజ గదిని ఏర్పాటు చేసుకోవడానికి ఈశాన్య దిక్కు ఎంతో శ్రేయస్కరం.

పూజ గదిని ఎప్పుడూ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేసుకోవాలి. బేస్‌మెంట్‌లో ఏర్పాటు చేసుకోవడం వల్ల వెలుతురు రాదు. అలాగే అందరికీ సులభంగా వెళ్లేలా పూజ గది నిర్మించుకోవాలి. పూజగది ఏర్పాటు చేసుకోవడానికి స్థలం లేకపోతే వంటింట్లోనే ఈశాన్య దిక్కున పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇంట్లో పూజా గది ఎలా ఉండాలి, ఎటు వైపు ఉండాలి, ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోవాలంటే ఈ పూజ గది వాస్తు చిట్కాలు పాటించండి.

- దేవుళ్ల ఫోటోలను, విగ్రహాలను ఉత్తరం వైపు ఉంచాలి.
- 7 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తులేని చిన్న విగ్రహాలు ప్రతిష్టించడానికి అనువైనవి.
- పూజగదికి వెంటిలేషన్ చక్కగా ఉండేలా చూసుకోవాలి.
- దేవుళ్ల ఫోటోలు గోడలకు తగలకుండా కొన్ని సెంటిమీటర్ల దూరంలో ఉండేలా, అలాగే భూమికి కొంత ఎత్తులో ఉండేలా పెట్టుకోవాలి.
- విగ్రహాలు తలుపుకు ఎదురుగా, అలాగే ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకూడదు. దీని వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహానికి భంగం కలుగుతుంది.
- పూజ కోసం రాగి వస్తువులు వాడుకోవాలి. ఇనుము వస్తువులు వాడకూడదు.
- ఈశాన్య దిశలో పూజ గది ఏర్పాటు చేసుకుంటే మంచిది.
- వంటగదిలో దేవుళ్ల ఫోటోలను పెట్టుకోవాలనుకుంటే ఈశాన్యంలో పెట్టుకోవాలి.
- పూజ గదిలో ఏర్పాటు చేసిన లైట్ రాత్రి పూట కూడా వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి.
- పూజ గదిలో తెలుపు లేదా లేత రంగులు వేసుకోవాలి. ముదురు రంగులకు దూరంగా ఉండాలి.
- దేవుళ్ల విగ్రహాలు 9 అంగుళాల కంటే ఎక్కువ, 2 అంగుళాల కంటే తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను పూజగదిలో ఉంచవచ్చు.
- విగ్రహాలు ఉంటే వాటిని కొత్త ఎత్తులో పెట్టుకునేలా ఏర్పాటు చేసుకుంటే మంచిది.
- పూజ చేసేటప్పుడు ఉత్తరం, తూర్పు అభిముఖంగా కూర్చోవాలి.
- పూజ గది మెట్ల కింద ఉండకుండా చూసుకోవాలి.
- పూజ గదికి పక్కన టాయిలెట్ లేకుండా చూసుకోవాలి.
- పూజ గదికి ఎదురుగా టాయిలెట్ లేకుండా చూసుకోవాలి.
- పూజ గదికి, బాత్రూముకు ఒకే గోడ ఉండకూడదు.
Comments
English summary
Vastu tips for puja room in house in telugu
Story first published: Wednesday, January 4, 2023, 20:52 [IST]
Other articles published on Jan 4, 2023



Click it and Unblock the Notifications
