Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
వాస్తు ప్రకారం.. తాబేలు బొమ్మను ఇంట్లో అక్కడ పెడితే.. శుభ ఫలితాలొస్తాయంట...!
తాబేలును ఇంట్లో ఉంచుకుంటే ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయా లేదా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పురాణాల ప్రకారం.. తాబేలును విష్ణుమూరి యొక్క కుర్మావతారంగా భావిస్తారు. ఈ అవతారంలో వచ్చిన మహావిష్ణువు ఎన్నో అద్భుతాలు చేశారని చాలా మంది నమ్ముతారు.

మన రాష్ట్రంలో తాబేలుకు సంబంధించిన ప్రత్యేకమైన దేవాలయం ఉంది. ఇదిలా ఉండగా.. వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ తాబేలును ఇంటిలో ఉంచుకోవడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.

అయితే ఈ తాబేలును ఇంట్లో ఉంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. లేదంటే మీకు ఆర్థిక పరంగా.. ఆరోగ్య పరంగా ఇంట్లో సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ సందర్భంగా తాబేలు బొమ్మను మీ ఇంట్లో ఏ దిశలో ఉంచాలి.. ఎక్కడ ఉంచితే సానుకూల ఫలితాలొస్తాయి.. ఇందులో ఉన్న వాస్తవాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

తాబేలు ఇంట్లోకి వస్తే..
వాస్తు శాస్త్రం ప్రకారం, తాబేలు ఇంట్లోకి వస్తే.. వాస్తు దోషాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. చైనీస్ ఫెంగ్ షుయ్ ప్రకారం తాబేలు తన ఐదు అవయవాలు( తల, నాలుగు కాళ్లను) ఎలా లోపలికి లాక్కుని.. శత్రువుల నుండి తనను తాను కాపాడుకుంటుందో.. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం.. తాబేలు సిరి సంపదలకు సంకేతంగా చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

ఏ దిశలో అంటే..
మీ ఇంట్లో లోహంతో తయారు చేసిన తాబేలును.. నీటితో నింపిన పాత్రలో ఉంచి... మీ ఇంట్లో ఉత్తర దిశలో ఉంచాలి. మీ బెడ్ రూమ్ ఉత్తర దిశలో ఉంటే.. నీరు లేని పాత్రలో లోహంతో తయారు చేసిన తాబేలు బొమ్మను ఉంచొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే మీ ఇంట్లో ఆదాయం పెరుగుతుందట. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుందట. ఇతరుల నుండి మీ మీద పడే దిష్టి, అసూయ ప్రభావాలు తొలగిపోతాయట.

వాస్తు దోషాలు పోవాలంటే..
ఫెంగ్ షుయ్ నిపుణుల ప్రకారం, తాబేలు లాంటి కూర్మావతారం వంటి శంఖం, కామధేనువు, కల్పవ్రుక్షం, శమంతకమణి, ఐరావతం వంటివి వాస్తు దోషాలను తొలగిస్తాయట. అలాగే స్పటికంతో తయారు చేసిన తాబేలును మీ ఇంట్లో ఉత్తరవైపున ఉంచితే సమస్యలు తొలగిపోయి.. ఆనందంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.

అశాంతిగా ఉంటే..
మీ ఇంట్లో అస్తమానం అశాంతి, ఇతర సమస్యలతో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే.. తాబేళ్లను తూర్పు దిశలో ఉంచాలి. వీటిని మీ ఇంట్లోని గదులలో ఉంచడం వల్ల మీ ఇంట్లో శాంతి వచ్చే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లోని కుటుంబసభ్యులతో సామరస్యం వస్తుంది. అయితే తాబేలు బొమ్మను ఎల్లప్పుడూ నీటిలో మాత్రమే ఉంచాలి. అలాగే వాటి మధ్య కొన్ని రంగు రాళ్లను కూడా జోడించొచ్చు. ఇది మీకు ప్రశాంతతను తీసుకొస్తుంది. అంతేకాదు మీకు దీర్ఘాయువును తీసుకొస్తుంది. మీ ఇంట్లో ఆర్థిక సమస్యలను తొలగించేందుకు తోడ్పడుతుంది. మీరు కూడా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతుంటే.. తాబేలు బొమ్మను మీ ఇంట్లో పెట్టి చూడండి.. మంచి ఫలితాలను పొందండి.



Click it and Unblock the Notifications