Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
Vastu Tips: ఆ దిక్కుల్లో చెప్పులు పెడితే ప్రాణగండం..!
ఆ దిక్కుల్లో చెప్పులు పెడితే ప్రాణగండం..!
మనలో చాలా మంది వాస్తును అనుసరిస్తూ ఉంటాం. వాస్తు ప్రకారం కొన్ని జరగకపోతే ఆ తర్వాత వచ్చే నష్టాలను భరించలేము. అందుకే ఏది జరిగినా వాస్తు ప్రకారం జరగాలని పెద్దలు చెబుతుంటారు. ఇక భారత దేశంలో హైందవ మతం మెజార్టీగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ వాస్తును ఫాలో అయ్యేవారు చాలా ఎక్కువ. ఇంటి నిర్మాణంలో ముఖ్యంగా వాస్తును పాటిస్తారు. అంతేకాదు ఇంట్లో ఉంచే వస్తువులు ఎక్కడ ఉంటే కుటుంబంలో మేలు జరుగుతుందో వాస్తు వివరంగా బోధిస్తుంది. ఇంట్లో వాస్తు సంబంధిత నియమాలు పాటించకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి.

వాస్తు దోషంతో అన్నీ అనర్థాలే జరుగుతాయి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా కుటుంబంలో శాంతి సమాధానం లోపించి గొడవలు ప్రారంభమవుతాయి. ఈ రోజు మనం నిత్యం ధరించే చెప్పులు లేదా పాదరక్షలు ఇంట్లో ఎక్కడ ఉంచాలి,ఎలా ఉంచాలి ఎలాంటి దిశలో ఉంచాలి అనేదానిపై చూద్దాం.

చెప్పులు ఉంచాల్సిన చోట ఉంచకుంటే..?
చెప్పులు, బూట్లు నిత్యం మనం ధరించి తిరుగుతాం. అయితే ఇంట్లో పాదరక్షలు సరైన దిశలో ఉంచకపోతే అనర్థాలు తప్పవని వాస్తు శాస్త్రం ఘోషిస్తోంది. ఉంచాల్సిన ప్రదేశంలో ఉంచకుంటే అనర్థాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయట.ఇంట్లో చెప్పులు లేదా బూట్లు ఎప్పుడూ తలకిందులుగా ఉంచరాదు. శని పాదాలకు సంబంధించిందని విశ్వసిస్తారు. పాదరక్షలు సరిగ్గా ఉంచకపోతే అశుభ ప్రభావం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

బూట్లు, చెప్పులు ఏదిశలో ఉంచాలి..?
శని ఇంట్లోకి ప్రవేశించకూడదంటే మనం ధరించే పాదరక్ష పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వాటిని ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఉంచరాదు. పాదరక్షలు ఎప్పుడూ పడమర వైపు మాత్రమే ఉంచాలని వాస్తు ఘోషిస్తోంది.ఇక ఇంట్లో విరిగిన చెప్పులు లేదా బూట్లు ఉంటే వాటిని దూరంగా విసిరేయాలి. అలాంటి పాదరక్షలు ఇంట్లో ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ లేదా నెగిటివ్ వైబ్స్ ఇంటిని చుట్టుముడుతాయి.

షూ ర్యాక్ ఏ దిక్కున ఉండేలా చూసుకోవాలి..?
వాస్తు ప్రకారం ఇంట్లో బూట్లు చెప్పులు ఉంచేందుకు వినియోగించే ర్యాక్ వంటగది గోడకు లేదా పూజ గదికి ఆనుకుని ఉండకూడదు. ఇలా ఉంచితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ర్యాక్ తయారు చేసేముందు అది తూర్పు ఉత్తరం, ఆగ్నేయం లేదా ఈశాన్య దిక్కుల్లో తయారు చేయకూడదనే విషయం గుర్తుంచుకోవాలి. నైరుతి, వాయువ్య దిశలు షూ ర్యాక్ తయారు చేసేందుకు ఉత్తమమైనవని వాస్తు చెబుతోంది.



Click it and Unblock the Notifications
