Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Planets Retrograde :ఒకే రాశిలో శుక్రుడు, గురుడి సంచారం... ఈ రాశుల వారు జర భద్రం...!
శుక్రుడు, గురుడు అభిముఖంగా కలిసినప్పుడు ఈ రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందట.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జులై మాసంలో 17వ తేదీన అంటే శనివారం నాడు శుక్రుడు సింహరాశిలోకి సంచారం చేశాడు. ఇదే రాశిలో సుమారు నెల రోజుల పాటు ఉండనున్నాడు.

అయితే సూర్యుని రాశి అయిన ఈ సింహ రాశిలో ఇప్పటికే గురుడు నివాసం ఉంటున్నాడు. అయితే శుక్రుడు శత్రువు సంకేతంలో ప్రయాణం చేయడం వల్ల గురుడు, శుక్రుడు ఒకరికొకరు ఎదురెదురుగా కలుస్తారు.

సాధారణంగా గురుడు, శుక్రుడు మంచి గ్రహాలే. కానీ ఇద్దరికి వైరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశులలోని కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం పడుతుందట. ఈ సందర్భంగా ఏయే రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సింహ రాశిలో శుక్రుడు, గురుడు సంచారం చేయడంతో పాటు ఎదురెదురుగా కలవడం వల్ల ఈ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో సమాజంలో మీ గౌరవం కూడా తగ్గొచ్చు. ఉద్యోగులు మరియు వ్యాపారులు ఈ సమయంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు అనుభవం ఉన్న వారి సలహాలను తీసుకోవాలి. వారి నిర్ణయం మీకు సరైనది అనిపిస్తేనే ముందడుగు వేయాలి. లేదంటే మీరు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తితో వివాదాలు, వాదనలు ఉండొచ్చు. ఈ సమయంలో మీరు మీ ఖర్చులను నియంత్రించాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ సమయంలో మీరు శత్రువుల నుండి చాలా దూరంగా ఉండాలి.

కర్కాటక రాశి..
శుక్రుడు, గురుడు సింహరాశిలో ఎదరెదురుగా కలవడం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో శుభ ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీరు చేసే పనులను చాలా తెలివిగా చేయాలి. ఎలాంటి పనులనైనా సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. ఏ పనులను మధ్యలో వదిలేయకండి. మరోవైపు వ్యాపారులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు ఎవరితో వాదనకు దిగొచ్చు. ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. మరోవైపు రాజకీయ నాయకులకు ఈ సమయం కొంత అనుకూలంగా ఉంటుంది. మీరు పనులకు సంబంధించి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కన్య రాశి..
ఈ రాశి వారు శుక్రుడు, గురుడి కలయిక వల్ల ప్రతికూల ఫలితాలు రాకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన పనులను ఈ కాలంలో వాయిదా వేసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. లేకపోతే మీ సంబంధాలలో దూరం పెరుగుతుంది. గురుడు, శుక్రుడు మంచి గ్రహాలే అయినప్పటికీ, ఈ కాలంలో మీ ఆదాయాన్ని తగ్గించొచ్చు. మీ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు, వ్యాపారులు ఈ సమయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. రిస్క్ ఉన్న పనులను ఈ కాలంలో చేయకండి. ఎందుకంటే మీరు ఎక్కువగా నష్టపోవచ్చు.

మకర రాశి..
శుక్రుడు, గురుడు రెండు గ్రహాలకు శత్రుత్వం కారణంగా ఈ రాశి వారికి అశుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేస్తూ.. భవిష్యత్తులో పొందబోయే ప్రయోజనాల గురించి ఆలోచించాలి. మరోవైపు ఈ కాలంలో మీ శత్రువులు మీకు హాని కలిగించే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా ఆలోచనాత్మకంగా చేయండి. ప్రతి చిన్న పనిని జాగ్రత్తగా చేయాలి. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడపండి. వాదనలకు, తగాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. లేదంటే మీరు మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

మీన రాశి..
శుక్రుడు, గురుడు ఒకరినొకరు ముఖాముఖిగా కలిసినప్పుడు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు జర్నీకి దూరంగా ఉండటం మంచిది. ఎలాంటి పనులనైనా సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. పెండింగులో ఏ పనిని పెట్టొద్దు. పెట్టుబడుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటులో ఏ నిర్ణయం తీసుకోవద్దు. అదేవిధంగా ఆరోగ్యంపై కూడా మీరు శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే ఈ సమయం అలాంటి ఆలోచనను వాయిదా వేసుకోవాలి. విద్యార్థులు ఈ కాలంలో విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో ఉండే వారికి ఈ సమయం అనుకూలంగా ఉండదు.



Click it and Unblock the Notifications