For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2022లో తొలి వారంలో శుక్రుడు ధనస్సులోకి అస్తమించనున్నాడు... ఈ ప్రభావం 12 రాశులపై ఎలా ఉంటుందంటే...!

2022 జనవరి 4వ తేదీన శుక్రుడు ధనస్సు రాశి నుండి అస్తమించడం వల్ల రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలేంటో చూసెయ్యండి.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవగ్రహాలలో శుక్రుడిని ఎంతో ప్రాముఖ్యత ఉన్న గ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడి అనుగ్రహం ఉంటే ప్రేమ, వైవాహిక జీవితం, విలాసవంతమైన జీవితం గడపొచ్చని భావిస్తారు.

Venus Combust in Sagittarius on 4th January 2022 Effets on Zodiac Signs in Telugu

అలాంటి శుక్ర గ్రహం సూర్య భగవానుడి దగ్గరికి చేరుకుంది. 2022లో జనవరి నాలుగో తేదీన ధనస్సు రాశిలో అస్తమించనుంది. ఒక నిర్దిష్ట 10 డిగ్రీల లోపల ఒక గ్రహం సూర్యుడితో కలిసినప్పుడు అస్తమించే దృగ్విషయం సంభవిస్తుంది. ధనస్సు రాశిలో శుక్రుడు సంచారం చేయడం వల్ల ఉద్యోగులకు కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు.

Venus Combust in Sagittarius on 4th January 2022 Effets on Zodiac Signs in Telugu

జనవరి 4 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనస్సు రాశిలో శుక్రుడు అస్తమించే సంఘటన జరగనుంది. ఈ సందర్భంగా 12 రాశి చక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఏయే రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.. ఏయే రాశుల వారికి ప్రతికూల ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

January 2022 Horoscope: జనవరి నెలలో మీ జాతకం ఎలా ఉందో చూసెయ్యండి...January 2022 Horoscope: జనవరి నెలలో మీ జాతకం ఎలా ఉందో చూసెయ్యండి...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారికి శుక్రుని సంచారం వల్ల ఈ సమయంలో అహంకారం పెరగొచ్చు. ఉద్యోగులు ఆఫీసులో సీనియర్లతో సంతోషంగా ఉండలేరు. వ్యాపారులకు తమ భాగస్వాములతో సమస్యలు ఉండొచ్చు. ఈ కాలంలో ఎలాంటి లాభాన్ని పొందలేరు. మరోవైపు మీ వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులుంటాయి. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు.

పరిహారం : శుక్రవారం రోజున శుక్రుని యాగం చేయాలి.

వృషభరాశి..

వృషభరాశి..

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉండొచ్చు. అయితే ఏకాగ్రత సమస్యల కారణంగా మీరు మీ పనులను పూర్తి చేయలేరు. మీ సహోద్యోగులు కూడా మీకు కొన్ని సమస్యలను స్రుష్టించొచ్చు. వ్యాపారవేత్తలు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు కొన్ని వైద్య ఖర్చులు ఉంటాయి. ఈ కాలంలో మీరు మీ భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించలేకపోవచ్చు. ఆరోగ్య పరంగా ఈ కాలంలో గొంతు సంబంధిత సమస్యలు, జీర్ణాశయం, కీళ్ల నొప్పి వంటి ఇబ్బందులు ఉండొచ్చు.

పరిహారం : ‘ఓం శుక్రాయై నమః' అనే మంత్రాన్ిన రోజుకు 24 సార్లు జపించండి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ కాలంలో ఈ రాశి ఉద్యోగులకు ఆఫీసులో సీనియర్లు మరియు సహోద్యోగుల నుండి అభినందనలు లభిస్తాయి. మీ పనితీరును అందరు మెచ్చుకుంటారు. వ్యాపారవేత్తలు లాభాన్ని పొందుతారు. మీరు మీ తెలివితేటలు మరియు నైపుణ్యాలకు విలువ ఇవ్వగలరు. ఈ కాలంలో మీరు ఆర్థిక పరంగా బలంగా ఉంటారు. మీరు పొదుపు కూడా చేయొచ్చు. మీ భాగస్వామితో అనుబంధం ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఈ క్షణం ఆనందిస్తారు.

పరిహారం : గురువారం రోజున వృద్ధ బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారి ఆశీస్సులు తీసుకోవాలి.

Planets Transit in january 2022:జనవరిలో 4 గ్రహాల రవాణాతో ఈ రాశులకు అద్భుత ఫలితాలు...!Planets Transit in january 2022:జనవరిలో 4 గ్రహాల రవాణాతో ఈ రాశులకు అద్భుత ఫలితాలు...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో కొన్ని అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కోవచ్చు. అయితే మీరు కష్టపడితే వాటిని అధిగమించగలరు. మరోవైపు వ్యాపారులకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు ఆశించినంతగా ఫలితాలు ఉండకపోవచ్చు. ఈ కాలంలో మీ ఖర్చులు కూడా పెరగొచ్చు. మీ భాగస్వామితో సంబంధాన్ని మెరుగుపరిచుకునే ప్రయత్నం చేస్తారు.

పరిహారం : శనివారం రోజున కాకులకు ఆహారం దానం చేయొచ్చు.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ కాలంలో మీ పిల్లల జీవితంలో ఆటంకాలు ఉండొచ్చు. మీరు ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఇది మీ బడ్జెట్ ను కూడా ప్రభావితం చేస్తుంది. మీరు తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ పిల్లలు అలర్జీలకు గురయ్యే అవకాశం ఉన్నందున వారి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయొచ్చు.

పరిహారం : మీరు రోజూ దుర్గా చాలీసాను జపించాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో కొత్త స్నేహితులను కలిసే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో తమ పనికి గుర్తింపు లభిస్తుంది. ఈ కాలంలో మీరు పదోన్నతి పొందొచ్చు. మరోవైపు వ్యాపారులు మంచి లాభాలు పొందొచ్చు. మీరు ఊహించినంత డబ్బు సంపాదిస్తారు. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య బంధం బాగుంటుంది. ఇది కాలక్రమేణా మెరుగుపడుతుంది. ఆరోగ్య పరంగా ఈ కాలంలో మంచిగా ఉంటుంది.

పరిహారం : మీరు ప్రతిరోజూ విష్ణు సహస్రనామం జపించాలి.

2022లో ఈ రాశుల వారు ప్రేమలో సక్సెస్ సాధిస్తారట... ఇక్కడ మీ రాశి ఉందేమో చూసెయ్యండి...!2022లో ఈ రాశుల వారు ప్రేమలో సక్సెస్ సాధిస్తారట... ఇక్కడ మీ రాశి ఉందేమో చూసెయ్యండి...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో స్నేహితుల నుండి కొంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్లొచ్చు. మీరు కొన్ని ఉద్యోగావకాశాలు పొందుతారు. మీ యజమానితో మీకు కొంత సమస్య ఉండొచ్చు. మీరు మీ వ్యాపార భాగస్వామితో సమస్యలను ఎదుర్కోవచ్చు. వ్యాపారులు ఈ కాలంలో కొన్ని లాభాలను పొందొచ్చు. మీరు మీ వ్యాపార భాగస్వామితో కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మీకు మీ జీవిత భాగస్వామితో కూడా వాగ్వాదం ఉండొచ్చు. ఇది మీ సంబంధంలో సామరస్యాన్ని తగ్గిస్తుంది.

పరిహారం : మంగళ, శుక్రవారాల్లో ఆలయంలో దుర్గామాతను పూజించాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో సమయం ప్రతికూలంగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉండకపోవచ్చు. మీరు మీ కార్యాలయంలో మీ గడువును చేరుకోలేరు. మీకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులు ఆశించిన ఫలితాలను పొందలేరు. మీరు ఎక్కువ నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీ ఖర్చులు పెరగొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు మీ బడ్జెట్ బ్యాలెన్స్ చేయలేరు. మీ భాగస్వామితో అనుబంధంలో మధురం ఉంటుంది. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు కంటికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు.

పరిహారం : మీరు రోజూ లాహిరి మంత్రాన్ని జపించాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ కాలంలో ఈ రాశి వారి ఉద్యోగులకు కార్యాలయంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, అధికారుల నుండి గుర్తింపు పొందలేరు. వ్యాపారులకు వారి భాగస్వాములతో సమస్యలు ఉండొచ్చు. మీరు కొంత నష్టాన్ని కూడా ఎదుర్కొంటారు. మరోవైపు మీ జీవిత భాగస్వామితో సంబంధం ప్రతికూలంగా ఉంటుంది. మీరు సహనంతో ప్రవర్తించాలి. ఆరోగ్య పరంగా ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : శివాలయంలో శివునికి పాలు సమర్పించాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. మీ ప్రయత్నాలకు ఎలాంటి గుర్తింపు లభించదు. ఈ పరిస్థితిని మీరు సహనంతో ఎదుర్కోవాలి. వ్యాపారులు ఈ కాలంలో ప్రత్యేక ప్రయోజనాలు పొందలేరు. ఈ కాలంలో మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ కాలంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ వైవాహిక జీవితం కూడా ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఆరోగ్య పరంగా ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : పెళ్లయిన మహిళలకు 6 శుక్రవారాల పాటు పెరుగన్నం దానం చేయండి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో ఉన్నత స్థాయి విజయం మరియు ఆనందాన్ని పొందుతారు. కార్యాలయంలో మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులు మీ ప్రయత్నాలను అర్థం చేసుకుంటారు. మీ జీతం పెరుగుదల లేదా ప్రమోషన్ కి సంబంధించి కొన్ని శుభవార్తలు పొందొచ్చు. వ్యాపారులు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను పొందుతారు. మీ భాగస్వామి కూడా మీకు మద్దతు ఇస్తారు. ఈ సమయంలో మీరు ఫిట్ గా ఉంటారు. మీరు ఫిట్ నెస్ ను కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.

పరిహారం : ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించి నెయ్యి దీపం వెలిగించాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీరు కొత్త ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూడొచ్చు. వ్యాపారవేత్తలు తమ వ్యాపార భాగస్వాములతో వాటాల పంపిణీలో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున వారికి కొంత కఠినమైన ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఈ కాలంలో మీ ఖర్చులు పెరుగుతాయి. ఊహించని నష్టం సంభవించొచ్చు. దీంతో మీరు నిరాశ చెందుతారు. ఆరోగ్య పరంగా ఈ కాలంలో సమస్యలు ఉండొచ్చు.

పరిహారం : ప్రతిరోజూ దుర్గాదేవిని మరియు లక్ష్మీదేవిని పూజించాలి.

FAQ's
  • 2022 సంవత్సరంలో శుక్రుడు ఏ రాశిలో ఎప్పుడు అస్తమించనున్నాడు?

    జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవగ్రహాలలో శుక్రుడిని ఎంతో ప్రాముఖ్యత ఉన్న గ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడి అనుగ్రహం ఉంటే ప్రేమ, వైవాహిక జీవితం, విలాసవంతమైన జీవితం గడపొచ్చని భావిస్తారు. అలాంటి శుక్ర గ్రహం సూర్య భగవానుడి దగ్గరికి చేరుకుంది. 2022లో జనవరి నాలుగో తేదీన ధనస్సు రాశిలో అస్తమించనుంది. ఒక నిర్దిష్ట 10 డిగ్రీల లోపల ఒక గ్రహం సూర్యుడితో కలిసినప్పుడు అస్తమించే దృగ్విషయం సంభవిస్తుంది. ధనస్సు రాశిలో శుక్రుడు సంచారం చేయడం వల్ల ఉద్యోగులకు కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. జనవరి 4 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనస్సు రాశిలో శుక్రుడు అస్తమించే సంఘటన జరగనుంది.

English summary

Venus Combust in Sagittarius on 4th January 2022 Effets on Zodiac Signs in Telugu

Venus Combust in Sagittarius 4th January 2022 on Effects on Rashis: How Venus being in a combust state will change your life and what all remedies must be performed in Telugu
Story first published:Monday, January 3, 2022, 17:37 [IST]
Desktop Bottom Promotion