Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ధనస్సులోకి శుక్రుడి సంచారం... ఈ రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు...!
2022 సంవత్సరంలో జనవరి 29న శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలేంటో తెలుసుకోండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శుక్రుడు శృంగారం, అభిరుచి, తెలివితేటలు మరియు ప్రతిభకు ప్రతీకగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో అయితే శుక్రుడి అనుగ్రహం ఉంటుందో వారికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి.

అదే సమయంలో శుక్రుడి అనుగ్రహం లేకపోతే ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా 2022 సంవత్సరంలో శుక్రుడు తన స్థానం నుండి మరో స్థానానికి మారనున్నాడు. జనవరి 29వ తేదీన అంటే శనివారం నాడు మధ్యాహ్నం 2:55 గంటలకు తిరోగమన చలనాన్ని ముగించుకుని.. సాధారణ స్థితికి రానున్నాడు.

అదే సమయంలో ధనస్సు రాశిలోకి నేరుగా సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో రాశిచక్రాలపై కొంత ప్రభావం కచ్చితంగా పడుతుంది. ఈ సందర్భంగా శుక్రుడు నేరుగా ప్రయాణించడం వల్ల ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.. ఏ రాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి.. ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల అనుకూల ఫలితాలు రావొచ్చు. ఈ సమయంలో మీరు అనేక ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు మంచి లాభాలు పొందగలరు. ఈ కాలంలో మీరు మతపరమైన పనుల వైపు మొగ్గు చూపుతారు. మీరు మీ సోదరులు మరియు సోదరీమణుల మద్దతు కూడా పొందుతారు. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉన్న నమ్మకం మీ సంబంధాన్ని మరింత దగ్గర చేస్తుంది.
పరిహారం : ఈ కాలంలో లక్ష్మీదేవికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.

వృషభరాశి..
ధనస్సులోకి శుక్రుడి సంచారం వల్ల ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఇదివరకే మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే.. మీ సమస్య మరింత పెరగొచ్చు. మీరు ఈ కాలంలో అనుకోని ప్రయాణం చేయొచ్చు. ఈ ప్రయాణం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఇంట్లో వండిన పదార్థాలను మాత్రమే తినాలి. వీలైనంత మేరకు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. మీరు ఫిట్ గా ఉండటం ముఖ్యం.
పరిహారం : మీకు దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లి నేతి దీపాన్ని వెలిగిస్తే శుభ ఫలితాలొస్తాయి.

మిధున రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల అనుకూల ఫలితాలు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ కాలంలో అవివాహితులు పెళ్లి చేసుకోవచ్చు. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో సామరస్యాన్ని కొనసాగిస్తారు. మీరు మీ భాగస్వామితో ఎలాంటి వివాదాలకైనా దూరంగా ఉండాలి. ఈ కాలంలో మీరు ప్రతికూల ఆలోచనల బారిన పడకుండా ఉండాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
పరిహారం : వినాయకుడిని క్రమం తప్పకుండా పూజించాలి. లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారిలో వ్యాపారులకు శుక్రుడి రవాణా వల్ల మంచి లాభాలు రావొచ్చు. ఈ కాలంలో విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరోవైపు మీరు ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు. మీరు కోరుకున్న ఆదాయం వస్తుంది. అయితే కొన్ని చిన్న సవాళ్లను ఎదుర్కోవచ్చు.
పరిహారం : శివునికి బియ్యంతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించాలి.

సింహ రాశి..
ధనస్సులోకి శుక్రుడి సంచారంతో ఈ రాశి వారికి శుభ ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు వారి రంగంలో పదోన్నతి లభించొచ్చు. మీరు మీ భాగస్వామితో ఏదైనా వ్యాపారంలో నిమగ్నమై ఉంటే, వారితో మీ సంబంధం మెరుగ్గా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు ఆశించిన ఫలితాలను పొందుతారు. మీరు ఎంత కష్టపడితే అంత మంచి విజయం దక్కుతుంది. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీకు మంచి అవకాశాలు లభిస్తాయి.
పరిహారం : రాగిపాత్రలో కొద్దిగా బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి, ఆ తర్వాత ఎండలో ఉంచి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి.

కన్య రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల అద్భుతమైన ఫలితాలు రావొచ్చు. అయితే మీరు ఆర్థిక పరమైన నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనాలని చూస్తుంటే.. మీ ఖర్చులు పెరగొచ్చు. కాబట్టి మీ బడ్జెట్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి. మీరు కొత్త మార్గాల్లో కూడా పురోగమిస్తారు. డబ్బును సంపాదిస్తారు.
పరిహారం : మీరు ఆలయానికి వెళ్లి లక్ష్మీదేవికి ఎండుద్రాక్షను సమర్పిస్తే శుభ ఫలితాలు వస్తాయి.

తుల రాశి..
శుక్రుడు ధనస్సు రాశిలోకి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో వీలైనంత మేరకు ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి. వేయించిన వస్తువులకు దూరంగా ఉండాలి. ఈ కాలంలో మీ ప్రయాణం మానుకోవాలి. మీ శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించేందుకు నిరంతరం ప్రయత్నిస్తారు. ఈ కాలంలో మీరు కష్టపడి పని చేయాలి. మీరు ఆశించిన ఫలితాన్ని పొందుతారు.
పరిహారం : మీరు చిన్నారుకులకు బహుమతులు ఇవ్వాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవచ్చు. అయితే మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ అవసరాలకు తగ్గట్టు బడ్జెట్ నిర్ణయించుకోవాలి. వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
పరిహారం : మీరు ఎల్లప్పుడూ మీ పర్సులో లేదా జేబులో ఎర్రటి రుమాలు ఉంచుకోవాలి.

ధనస్సు రాశి..
ఇదే రాశిలోకి శుక్రుడు నేరుగా ప్రయాణించడం వల్ల ధనస్సు రాశి వారు సానుకూల ఫలితాలను పొందుతారు. అయితే మీకు ఆర్థిక సమస్యలు ఎదురుకావొచ్చు. అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రం ఈ కాలంలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మీరు మీ కుటుంబానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను వింటారు. మీరు పూర్వీకుల ఆస్తిని కూడా పొందొచ్చు. ఈ కాలంలో మీరు పాత స్నేహితుడిని కూడా కలుసుకోవచ్చు. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది.
పరిహారం : పచ్చని వస్తువులను దానం చేస్తే శుభ ఫలితాలొస్తాయి. అలాగే వినాయకునికి క్రమం తప్పకుండా గరికను సమర్పించండి.

మకర రాశి..
ఈ రాశి వారు శుక్రుడి రవాణా కారణంగా మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగులు కార్యాలయంలో తమ పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ శత్రువులు మీ పనికి ఆటంకం కలిగించొచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ జీవితంలో విజయం సాధించొచ్చు. అవివాహితులకు పెళ్లి చేసుకునేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : మా కాత్యాయనిని క్రమం తప్పకుండా పూజించాలి మరియు ఆ దేవి మంత్రాలను జపించాలి.

కుంభ రాశి..
ఈ రాశి వారు శుక్రుడు ధనస్సులోకి ప్రవేశించడం వల్ల ఆనందంగా గడుపుతారు. అయితే ఈ కాలంలో మీరు పెద్ద పెట్టుబడులు పెట్టకండి. ఇది నష్టాలకు దారితీస్తుంది. మీరు మీ కార్యాలయంలో పని చేయడానికి ఇష్టపడతారు. ఇది మీకు అనుకూలమైన సమయం. మీ ఇంట్లో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరగొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది.
పరిహారం : రోజూ నల్ల నువ్వులను నీటిలో కలిపి తలస్నానం చేస్తే శుభ ఫలితాలు రావొచ్చు.

మీన రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి రవాణా కారణంగా శుభప్రదమైన ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం లభించొచ్చు. మీరు కొత్త ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు. ఈ ప్రయాణం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమికులు పెళ్లి వరకు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. మీ సంబంధంలో మాధుర్యం లభిస్తుంది.
పరిహారం : ఈ కాలంలో వినాయకుడిని ఆరాధిస్తే శుభఫలితాలొస్తాయి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2022 సంవత్సరంలో శుక్రుడు తన స్థానం నుండి మరో స్థానానికి మారనున్నాడు. జనవరి 29వ తేదీన అంటే శనివారం నాడు మధ్యాహ్నం 2:55 గంటలకు తిరోగమన చలనాన్ని ముగించుకుని.. సాధారణ స్థితికి రానున్నాడు. అదే సమయంలో ధనస్సు రాశిలోకి నేరుగా సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో రాశిచక్రాలపై కొంత ప్రభావం కచ్చితంగా పడుతుంది.



Click it and Unblock the Notifications