For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Venus Retrograde In Capricorn:మకరంలో శుక్రుడి తిరోగమనం.. రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలు...

2021 సంవత్సరంలో డిసెంబర్ 19న శుక్రుడు మకరంలోకి తిరోగమనం చెందనున్నాడు. ఈ సందర్భంగా రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలేంటో తెలుసుకోండి.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవగ్రహాలలో శుక్రుడికి ఎంతో విశిష్టత ఉంది. శుక్రుడిని ప్రేమతో సంబంధం కలిగి ఉండే గ్రహంగా పరిగణిస్తారు. అలాగే ఎవరి జాతకంలో అయితే శుక్రుడి అనుగ్రహం ఉంటుందో వారికి ఆర్థిక పరంగా.. అందం విషయంలో సానుకూల ఫలితాలొస్తాయట.

Venus Retrograde In Capricorn On 19 December 2021 Effects on Zodiac Signs in Telugu

ఈ నేపథ్యంలో శుక్రుడు 2021 సంవత్సరంలో డిసెంబర్ 19వ తేదీన అంటే ఆదివారం నాడు సాయంత్రం 4:32 గంటలకు మకర రాశిలోకి తిరోగమనం చెందనున్నాడు. ఇదే రాశిలో జనవరి 29వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశి చక్రాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది.

Venus Retrograde In Capricorn On 19 December 2021 Effects on Zodiac Signs in Telugu

ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ప్రేమ జీవితంలో మంచిగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా శుక్రుడి తిరోగమనం వల్ల ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఈ సమయంలో శుక్రుడి అనుగ్రహం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మీ పుట్టిన తేదీని బట్టి.. 2022లో మీ జీతం పెరుగుతుందా లేదా తెలుసుకోండిలా...మీ పుట్టిన తేదీని బట్టి.. 2022లో మీ జీతం పెరుగుతుందా లేదా తెలుసుకోండిలా...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు పదో స్థానం నుండి తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో మీకు శుభప్రదంగా ఉంటుంది. మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు శుభ ఫలితాలు రావొచ్చు. ఆర్థిక పరంగా మీ ప్రయత్నాలన్నీ బలోపేతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బు సంపాదించడంలో మీరు విజయం సాధిస్తారు. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలో వివాదాల పరిస్థితిని నివారించాలి.

పరిహారం : శుక్రుడి అనుగ్రహం పొందడానికి శుక్రవారం రోజున పెరుగు దానం చేయాలి లేదా పెరుగును తరచుగా తీసుకోవాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు తొమ్మిదో పాదం గుండా తిరోగమనం చేయనున్నాడు. ఈ కాలంలో మీ అదృష్టం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే మీరు పురోగతి కోసం కష్టపడాల్సి ఉంటుంది. పనికిరాని వాటిపై డబ్బు ఖర్చు చేయడం మానుకోండి. ఈ కాలంలో ప్రయాణం వ్యాపారానికి లాభిస్తుంది. మీ మేధో సామర్థ్యం అద్భుతంగా ఉంటుంది.

పరిహారం : శుక్రుని శుభ ఫలితాల కోసం మీరు తెల్లని లేదా గులాబీ రంగు దుస్తులను ధరించాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఎనిమిదో స్థానం గుండా తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో మిధున రాశి వారికి ఆరోగ్య పరంగా ఒడిదుడుకులు ఎదురుకావొచ్చు. దీనికి అదనంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కొన్ని మార్పులు ఉండొచ్చు. అది వారి ప్రవర్తనను ప్రభావితం చేయొచ్చు. అలాగే డిసెంబర్ 30వ తేదీ వరకు ఎవరి వద్దా రుణం తీసుకోకుండా ఉండాలి.

పరిహారం : శుక్రుని అనుగ్రహం కోసం ప్రతిరోజూ ఆలయంలో ప్రార్థన చేయండి. అలాగే జొన్నలను దానం చేయండి.

మీకు అలాంటి కలలొస్తే.. త్వరగా కోటీశ్వరులవుతారట...!మీకు అలాంటి కలలొస్తే.. త్వరగా కోటీశ్వరులవుతారట...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఏడో స్థానం నుండి తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో మీకు తల్లిదండ్రుల నుండి అనేక విషయాల్లో మద్దతు లభిస్తుంది. మరోవైపు మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమను కొనసాగించండి మరియు తండ్రి ఆస్తిని కాపాడుకోండి. ఈ కాలంలో మీరు డిసెంబర్ 30 వరకు అనేక ముఖ్యమైన పర్యటనలు చేయాల్సి రావచ్చు.

పరిహారం : శుక్రగ్రహం యొక్క చెడు ప్రభావాలను నివారించడానికి, శుక్రవారం రోజున ఆలయానికి కంచు పాత్రలను దానం చేయండి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఆరో స్థానం నుండి తిరోగమనం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. శుక్రుని తిరోగమన సంచారం మీ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. అయితే మీ పిల్లల విషయంలో ఆనందం రావాలంటే, మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అలాగే, డిసెంబర్ 30లోపు మీ ఉద్యోగాలలో ఒకదాన్ని పూర్తి చేసి, మరొకటి ప్రారంభించండి.

పరిహారం : శుక్రగ్రహం యొక్క దుష్ప్రభావాలను నివారించడానికి, శుక్రవారం రోజున శివుడిని ఆరాధించాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఐదో స్థానం నుండి తిరోగమనం చెందనున్నాడు. ఈ కాలంలో కన్య రాశి వారు ఆశించిన ఫలితాలను పొందొచ్చు. ఈ సమయంలో మీకు చాలా మంచి అనుభూతి పొందొచ్చు. విద్యార్థులకు ఈ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల ప్రయోజనాలు పొందొచ్చు. మరోవైపు మీ ప్రేమ జీవితంలో కూడా విజయం సాధిస్తారు.

పరిహారం : శుక్రుని నుండి శుభ ఫలితాలను పొందడానికి గోమాతను ఆరాధించండి.

2022లో వృశ్చిక రాశి వారి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి...2022లో వృశ్చిక రాశి వారి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి...

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు నాలుగో స్థానం తిరోగమనం చెందనున్నాడు. ఈ కాలంలో మీకు తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడొచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో కూడా మీరు విజయం సాధించొచ్చు. మీరు ఏదైనా రుణాన్ని తిరిగి చెల్లించొచ్చు. శుక్రుడు తిరోగమనం సమయంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని ఆశిస్తుంటే, మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది.

పరిహారం : శుక్రగ్రహం యొక్క మంచి ప్రభావాలను పొందడానికి శుక్ర మంత్రాన్ని పఠించాలి.

వృశ్చికరాశి..

వృశ్చికరాశి..

ఈ రాశి నుండి శుక్రుడు మూడో స్థానం తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో మీకు ప్రతికూలంగా ఉంటుంది. మీ మనస్సులో ఏదో విషయం గురించి ఆందోళన కలుగుతుంది. అలాగే, మీ మనస్సు లేదా మీ జీవిత భాగస్వామి యొక్క మనస్సు ఆందోళన చెందుతుంది. ఈలోగా ఇల్లు మారాల్సి రావచ్చు. కానీ కష్టపడి పని చేస్తే మీ పనులన్నీ పూర్తవుతాయి. మీ తల్లిదండ్రుల నుండి ఓ శుభవార్త వినిపిస్తుంది.

పరిహారం : శుక్రుని ప్రతికూల ప్రభావాల నివారణకు, శుక్రవారం రోజున దుర్గా మాతకు అలంకరణ దుస్తులను దానంగా ఇవ్వాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు రెండో స్థానం నుండి తిరోగమనం చేసే సమయంలో.. ధనస్సు రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పూర్వీకుల ఆస్తుల ద్వారా కూడా ప్రయోజనాలు పొందొచ్చు. మీ కుటుంబ సభ్యులతో కలిసి తమ వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేసుకున్న వారు విజయం సాధించొచ్చు. ఈ కాలంలో మీ ఆస్తికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం లభించొచ్చు.

పరిహారం : శుక్రుని శుభ ఫలితాల కోసం, ఏదైనా ఆలయంలో ఆవు నెయ్యిని దానంగా ఇవ్వాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశిలోకి శుక్రుడు తిరోగమనం చేయడం వల్ల మకర రాశి వారిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో వివాహితులకు సంతానం గురించి ఓ శుభవార్త వినిపిస్తుంది. పెళ్లి కాని త్వరలో వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. మీకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఈలోగా జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

పరిహారం : శుక్రవారం రోజున ఏదైనా ఆలయానికి వెళ్లి.. దేవునికి ఎర్రని పువ్వులు సమర్పిస్తే శుభ ఫలితాలు వస్తాయి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు పన్నెండో స్థానం నుండి తిరోగమనం చెందనున్నాడు. ఈ కాలంలో కొందరికి కవిత్వాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందుతారు.

పరిహారం : శుక్రవారం రోజున మహాలక్ష్మీని ఆరాధించాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు పదకండో స్థానం నుండి తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో మంచిగా ఉంటుంది. మరికొందరు ఉద్యోగులు ఈ కాలంలో మంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రయాణాల నుండి కూడా శుభ ఫలితాలను పొందుతారు. ఫ్యాషన్ రంగం, మీడియా లేదా సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్న ఈ రాశి వ్యక్తులు ఆర్థిక పురోగతిని సాధించొచ్చు. మీ కుటుంబ జీవితంలో పెద్ద తోబుట్టువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఈ కాలంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.

పరిహారం : శుక్రుని శుభ ఫలితాలు పొందాలంటే.. ఆలయంలో దూది, పెరుగు దానం చేయాలి.

FAQ's
  • శుక్రుడు మకరంలోకి ఎప్పుడు తిరోగమనం చెందనున్నాడు?

    జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శుక్ర గ్రహం ప్రత్యేకమైనది. ఈ గ్రహం 2021 సంవత్సరంలో డిసెంబర్ 19వ తేదీన అంటే ఆదివారం నాడు సాయంత్రం 4:32 గంటలకు మకర రాశిలోకి తిరోగమనం చెందనున్నాడు.

English summary

Venus Retrograde In Capricorn On 19 December 2021 Effects on Zodiac Signs in Telugu

Shukra Rashi Parivartan in Makara Rashi december 2021: Venus Retrograde In Capricorn Effects on Zodiac Signs in telugu: The Venus Retrograde In Capricorn will take place on 19 December 2021. Learn about remedies to perform in Telugu
Story first published:Saturday, December 18, 2021, 10:50 [IST]
Desktop Bottom Promotion