For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Venus Retrograde In Capricorn:మకరంలోకి శుక్రుడి తిరోగమనం.. 2022లో ఈ రాశుల వారికి ఆర్థిక ఫలాలు..!

2021లో డిసెంబర్ 19వ తేదీన శుక్రుడు మకరంలోకి తిరోగమనం సమయంలో 2022 కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు రానున్నాయట.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవగ్రహాలలో శుక్రుడికి ఎంతో విశిష్టత ఉంది. శుక్రుడిని ప్రేమతో సంబంధం కలిగి ఉండే గ్రహంగా పరిగణిస్తారు. అలాగే ఎవరి జాతకంలో అయితే శుక్రుడి అనుగ్రహం ఉంటుందో వారికి ఆర్థిక పరంగా.. అందం విషయంలో సానుకూల ఫలితాలొస్తాయట.

Venus Retrograde In Capricorn On 19 December 2021, These Zodiac Signs Will Improve On the New Year 2022

ఈ నేపథ్యంలో శుక్రుడు 2021 సంవత్సరంలో డిసెంబర్ 19వ తేదీన అంటే ఆదివారం నాడు సాయంత్రం 4:32 గంటలకు మకర రాశిలోకి తిరోగమనం చెందాడు.ఇదే రాశిలో జనవరి 29వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు.
Venus Retrograde In Capricorn On 19 December 2021, These Zodiac Signs Will Improve On the New Year 2022

ఈ నేపథ్యంలో ద్వాదశ రాశి చక్రాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ప్రేమ జీవితంలో మంచిగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. అయితే శుక్రుడి తిరోగమనం వల్ల 2022 సంవత్సరంలో కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయట. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

Venus Retrograde In Capricorn:మకరంలో శుక్రుడి తిరోగమనం.. రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలు...Venus Retrograde In Capricorn:మకరంలో శుక్రుడి తిరోగమనం.. రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలు...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు పదో స్థానం నుండి తిరోగమనం చెందనున్నాడు. ఈ కాలంలో మీరు ఆర్థిక పరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. మీ మాటలతో ఇతరులను సులభంగా ఆకట్టుకోవచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వస్తాయి. కొత్తగా ఉద్యోగం పొందాలనుకునే వారు కూడా శుక్రుడి తిరోగమనం వల్ల కొన్ని శుభవార్తలు వింటారు. ఈ సమయంలో మీ కల నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

పరిహారం : శుక్రుడి అనుగ్రహం పొందడానికి శుక్రవారం రోజున పెరుగు దానం చేయాలి లేదా పెరుగును తరచుగా తీసుకోవాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఐదో స్థానం నుండి తిరోగమనం చెందనున్నాడు. ఈ కాలంలో కన్య రాశి వారు ఆశించిన ఫలితాలను పొందొచ్చు. ముఖ్యంగా మీరు ఆర్థిక పరమైన విషయాల్లో అద్భుతమైన విజయాలను పొందొచ్చు. దీని వల్ల ఈ సమయంలో మీకు చాలా మంచి అనుభూతి పొందొచ్చు. విద్యార్థులకు ఈ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల ప్రయోజనాలు పొందొచ్చు. మరోవైపు మీ ప్రేమ జీవితంలో కూడా విజయం సాధిస్తారు.

పరిహారం : శుక్రుని నుండి శుభ ఫలితాలను పొందడానికి గోమాతను ఆరాధించండి.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు నాలుగో స్థానం తిరోగమనం చెందనున్నాడు. తుల రాశి వారు కూడా ఈ సమయంలో ఆర్థిక పరమైన విషయాల్లో చాలా బలంగా ఉంటారు. ఈ కాలంలో మీరు ఏవైనా రుణాలు తీసుకుంటే.. వాటిని అత్యంత త్వరగా చెల్లిస్తారు. అయితే మీరు సోమరితనం వల్ల ఆలస్యం చేస్తే.. మీకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ కాలంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని ఆశిస్తుంటే, మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఈ కాలంలో విద్యార్థులకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్య చదువుకోవాలనుకునే మీ కోరిక నెరవేరొచ్చు.

పరిహారం : శుక్రగ్రహం యొక్క మంచి ప్రభావాలను పొందడానికి శుక్ర మంత్రాన్ని పఠించాలి.

2022లో మకర రాశి వారి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి...2022లో మకర రాశి వారి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి...

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు రెండో స్థానం నుండి తిరోగమనం చేయునన్నాడు. ఈ సమయంలో.. ధనస్సు రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పూర్వీకుల ఆస్తుల ద్వారా కూడా ప్రయోజనాలు పొందొచ్చు. మీ కుటుంబ సభ్యులతో కలిసి తమ వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేసుకున్న వారు విజయం సాధించొచ్చు. ఈ కాలంలో మీ ఆస్తికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం లభించొచ్చు.

పరిహారం : శుక్రుని శుభ ఫలితాల కోసం, ఏదైనా ఆలయంలో ఆవు నెయ్యిని దానంగా ఇవ్వాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు పదకొండో స్థానం నుండి తిరోగమనం చెందనున్నాడు. ఈ కాలంలో మీరు అనేక లాభాలను పొందొచ్చు. ముఖ్యంగా నష్టాలు వచ్చే స్థానంలోనూ మీ నైపుణ్యంతో లాభాలను సాధిస్తారు. మరోవైపు ఈ సమయంలో ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఈ కాలంలో మంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రయాణాల నుండి కూడా శుభ ఫలితాలను పొందుతారు. ఫ్యాషన్ రంగం, మీడియా లేదా సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్న ఈ రాశి వ్యక్తులు ఆర్థిక పురోగతిని సాధించొచ్చు. మీ కుటుంబ జీవితంలో పెద్ద తోబుట్టువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మరోవైపు మీరు ఈ కాలంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.

పరిహారం : శుక్రుని శుభ ఫలితాలు పొందాలంటే.. ఆలయంలో దూది, పెరుగు దానం చేయాలి.

FAQ's
  • శుక్రుడు మకరంలోకి తిరోగమనం వల్ల ఎన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు?

    జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శుక్ర గ్రహం ప్రత్యేకమైనది. ఈ గ్రహం 2021 సంవత్సరంలో డిసెంబర్ 19వ తేదీన అంటే ఆదివారం నాడు సాయంత్రం 4:32 గంటలకు మకర రాశిలోకి తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో మేష రాశి, కన్య రాశి, తుల రాశి, ధనస్సు రాశి, మీన రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు దక్కనున్నాయి.

  • శుక్రుడు మకరంలోకి ఎప్పుడు తిరోగమనం చెందనున్నాడు?

    జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శుక్ర గ్రహం ప్రత్యేకమైనది. ఈ గ్రహం 2021 సంవత్సరంలో డిసెంబర్ 19వ తేదీన అంటే ఆదివారం నాడు సాయంత్రం 4:32 గంటలకు మకర రాశిలోకి తిరోగమనం చెందనున్నాడు.

English summary

Venus Retrograde In Capricorn On 19 December 2021, These Zodiac Signs Will Improve On the New Year 2022

Here we are talking about the venus retrograde in capricorn on 19 december 2021, these zodiac signs will improve on the new year 2022. Have a look
Desktop Bottom Promotion