For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Venus Transit in Aries on 10 April: శుక్రుడు మేషంలోకి ఎంట్రీ వల్ల ఈ రాశులకు గొప్ప ప్రయోజనం...!

మేషరాశిలోకి శుక్రుడు ప్రవేశించే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావమేంటో తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శుక్రుడు మన జీవితంపై చాలా ఎక్కువ ప్రభావం చూపుతాడు. శుక్రుని అనుగ్రహం ఉంటే మన జీవితంలో ఆనందం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో సానుకూలంగా ఉంటుంది.

Venus Transit in Aries on 10 April 2021 Effects on Zodiac Signs in Telugu

అలాంటి శుక్రుడు ఏప్రిల్ 10వ తేదీన ఉదయం 6:14 గంటలకు మీన రాశి నుండి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇక్కడే మే 4వ తేదీ మధ్యాహ్నం 1:09 గంటల వరకు సంచారం చేయనున్నాడు.

Venus Transit in Aries on 10 April 2021 Effects on Zodiac Signs in Telugu

ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడనుంది. ఈ సందర్భంగా ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఏ రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది.. ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Ugadi Rashi Phalalu 2021: ఉగాది నుండి వృషభరాశి వారికి ఎలా ఉంటుందంటే...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశిలోకి శుక్రుడి రవాణా వల్ల చాలా సానుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. మీ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి విశ్వాసం పెరుగుతుంది. ప్రజలలో కూడా మీ ఆదరణ పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో అంతా మంచిగా ఉంటుంది. మీ వ్యాపారంలో లాభాలను పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల చాలా మిశ్రమంగా ఉంటుంది. మీకు ఆర్థిక పరంగా కూడా ప్రతికూలంగా ఉంటుంది. మీ ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. మీరు మీ బడ్జెట్ ను బ్యాలెన్స్ తప్పిపోయేలా ఆనందం కోసం షాపింగ్ చేయొచ్చు. మరోవైపు మీ ఇంట్లో ఏదైనా పవిత్రమైన కార్యం చేయొచ్చు. మీ రొమాంటిక్ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఆరోగ్య పరంగా అజాగ్రత్తగా ఉండకూడదు.

మిధున రాశి..

మిధున రాశి..

శుక్రుడు మేషరాశిలోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల ఈ రాశి వారికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. మీ ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ భాగస్వామితో మీ రిలేషన్ మరింత బలంగా మారుతుంది. మీరు బడ్జెట్ ప్రకారం, ఖర్చు చేస్తారు. మీ పనికి సంబంధించిన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు ఈ కాలంలో ఉన్నతాధికారులతో మంచి సంబంధాన్ని కొనసాగించండి. విద్యార్థులకు ఈ కాలం మంచిగా ఉంటుంది.

మీ రాశిని బట్టి ప్రేమలో మీరెందుకు వెనుక పడతారో చూసెయ్యండి...!మీ రాశిని బట్టి ప్రేమలో మీరెందుకు వెనుక పడతారో చూసెయ్యండి...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

మేషరాశిలోకి శుక్రుడి రవాణా వల్ల ఈ రాశి వారికి పనికి సంబంధించి మంచి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో కలిసి వేగంగా పనులు చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ ఇంటి కుటుంబం యొక్క వాతావరణం చాలా మంచిగా ఉంటుంది. మీ రొమాంటిక్ జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీతోనే ఉంటారు.

సింహ రాశి..

సింహ రాశి..

శుక్రుడు మేషరాశిలోకి ఆగమనం చేసే సమయంలో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ కుటుంబసభ్యులతో కలిసి ఓ యాత్రకు వెళ్లొచ్చు. మీరు మతపరమైన ప్రయాణాలు చేయొచ్చు. మీరు చేసే చాలా ప్రయత్నాల్లో కచ్చితంగా ప్రయోజనం పొందుతారు. వ్యాపారులకు ఈ కాలంలో చాలా మంచిగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

కన్య రాశి..

కన్య రాశి..

మేషరాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ప్రారంభంలో మంచిగా ఉంటుంది. మీరు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు పొందొచ్చు. మీ తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరోవైపు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ లక్ష్యాన్ని చేరుకునే సమయంలో ఎవరైనా మీ ఫోకస్ ను డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.

ఏప్రిల్ మాసంలో పుట్టిన వారికి ప్రత్యేక లక్షణాలుంటాయని తెలుసా...ఏప్రిల్ మాసంలో పుట్టిన వారికి ప్రత్యేక లక్షణాలుంటాయని తెలుసా...

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారిని శుక్రుడి రవాణా బాగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మీ వివాహ జీవితంలో చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ భాగస్వామితో సంబంధాలు బాగా పెరుగుతాయి. మీరు ఈ సమయాన్ని బాగా ఆనందిస్తారు. మీరు మీ సంబంధంలో నిజాయితీని కొనసాగించాలి. మరోవైపు వ్యాపారులకు ఈ కాలంలో మంచి ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించే సమయంలో, ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈ కాలంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీ వైవాహిక జీవితంలో కొంత ఉద్రిక్తంగా ఉంటుంది. మరోవైపు వ్యాపారులకు మరియు ఉద్యోగుకు కొన్ని మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ కాలంలో విద్యార్థులు చాలా మంచి ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

మేషరాశిలోకి శుక్రుడి రవాణా ఈ రాశిలోని పిల్లలకు ఆనందాన్ని ఇస్తుంది. మీ రొమాంటిక్ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ కాలంలో ఎవరైనా మీ జీవితంలోకి వస్తే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది.

మకర రాశి..

మకర రాశి..

మేషరాశిలోకి శుక్రుడి సంచారం వల్ల ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాన్ని కొనసాగిస్తారు. మీ ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు కుటుంబంతో గడిపేందుకు తగినంత సమయం లభిస్తుంది. ఈ కాలంలో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కుంభ రాశి..

కుంభ రాశి..

మేషరాశిలోకి శుక్రుడి ప్రయాణం వల్ల ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు పనికి సంబంధించి చాలా మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో స్థిరత్వం ఉంటుంది. మీకు చాలా గొప్పగా ఉంటుంది.

మీన రాశి..

మీన రాశి..

శుక్రుడి రవాణా వల్ల ఈ రాశి వారికి చాలా మంచిగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగు పడుతుంది. మరోవైపు మీ వైవాహిక జీవితం కూడా బలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు ఏదైనా శుభకార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు నిర్లక్ష్యంగా ఉండటం మానుకోండి.

English summary

Venus Transit in Aries on 10 April 2021 Effects on Zodiac Signs in Telugu

Here we are talking about the venus transit in aries on april 2021 effects on zodiac signs in Telugu. Read on
Desktop Bottom Promotion