For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Venus Transit in Cancer on 22 June 2021:కర్కాటకంలో శుక్రుడి ఎంట్రీ.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే..

2021లో జూన్ 22న శుక్రుడు కర్కాటకంలోకి ప్రవేశించే సమయంలో రాశులపై పడే ప్రభావం, పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవగ్రహాల్లో శుక్రుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శుక్రుడి అనుగ్రహం వల్ల వైవాహిక జీవితంలో ప్రేమ, సంతోషం, ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని భావిస్తారు. శుక్రుడి రవాణా జలతత్వాన్ని కలిగి ఉంటుంది.

Venus Transit in Cancer on 22 June 2021, Effects on Zodiac Signs in Telugu

ఈ సంకేతం చంద్రుని చిహ్నంలో ఉంటుంది. శుక్రుడి ప్రభావం వల్ల రైతులకు కూడా ప్రయోజనాలు చేకూరతాయి. అంతటి విశిష్టత కలిగిన శుక్రుడు జూన్ 22వ తేదీన మధ్యాహ్నం 2:40 నిమిషాలకు మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి ఆగమనం చేయనున్నాడు.

Venus Transit in Cancer on 22 June 2021, Effects on Zodiac Signs in Telugu

ఇదే రాశిలో జులై 17వ తేదీ వరకు సంచారం చేయనున్నాడు. అనంతరం సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వ్యక్తుల జీవితాల్లో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ సందర్భంగా ఏయే రాశిపై ఎలాంటి మార్పు సంభవిస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Venus Transit in Cancer on June 22 2021:కర్కాటకంలోకి శుక్రుడి సంచారం.. ఈ 5 రాశులకు ప్రత్యేక ప్రయోజనాలుVenus Transit in Cancer on June 22 2021:కర్కాటకంలోకి శుక్రుడి సంచారం.. ఈ 5 రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు

మేష రాశి..

మేష రాశి..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశి నుండి రెండు, ఏడో పాదాలకు శుక్రుడిని యజమానిగా పరిగణిస్తారు. ఈ సమయంలో మేష రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. మీ ప్రేమ జీవితంలో ప్రత్యేకంగా ఉంటుంది. మీరు కుటుంబంతో కూడా ఆనందంగా గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలు కూడా మెరుగవుతాయి.

పరిహారం : ప్రతి శుక్రవారం రోజున పార్వతీదేవికి బియ్యం సమర్పించాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల ప్రేమ విషయంలో మంచి ఫలితాలు రావొచ్చు. అంతేకాదు రొమాంటిక్ జీవితంలోనూ సానుకూల ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్య పరంగా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు మీ శక్తి, సామర్థ్యాలను కూడా పెంచుకుంటారు.

పరిహారం : శుక్ర యంత్రాన్ని ధరిస్తే ప్రత్యేక ఫలితాలొస్తాయి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి 5, 12 పాదాలకు శుక్రుడిని యజమానిగా భావిస్తారు. ఈ సమయంలో శుక్రుడు రెండో స్థానంలో ప్రవేశిస్తుందని నమ్ముతారు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు దక్కొచ్చు. మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరొచ్చు. మీ వైవాహిక జీవితం చాలా సాఫీగా సంతోషంగా సాగిపోతుంది. వివాహం కాని వారికి కుటుంబ సభ్యులు వివాహ ప్రతిపాదన ముందు ఉంచొచ్చు.

పరిహారం : ప్రతి శుక్రవారం సరస్వతీ దేవికి తెల్లని పువ్వులు సమర్పిస్తే శుభ ఫలితాలొస్తాయి.

వాస్తుశాస్త్రం ప్రకారం.. లాఫింగ్ బుద్ధను మీ ఇంట్లో అక్కడ ఉంచితే శుభఫలితాలొస్తాయని తెలుసా...వాస్తుశాస్త్రం ప్రకారం.. లాఫింగ్ బుద్ధను మీ ఇంట్లో అక్కడ ఉంచితే శుభఫలితాలొస్తాయని తెలుసా...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

మిధున రాశి నుండి ఈ రాశిలోకి శుక్రుడు సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామితో కూడా కొంత తగాదాలు ఏర్పడొచ్చు. అయితే క్రమంగా ఇవి తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరంగా ఈ సమయంలో మీరు తెలివిగా ఖర్చు చేయాలి. మీ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది.

పరిహారం : శుక్రుని అనుగ్రహం పొందేందుకు ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపుతో నిమ్మకాయ నీరు తాగాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో 12వ స్థానం నుండి శుక్రుడి సంచారం జరుగుతుంది. ఈ సమయంలో వ్యాపారులు లాభం పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులు మంచి ప్రయోజనాలు పొందుతారు. అయితే మీ ఖర్చులు కూడా క్రమంగా పెరుగుతాయి. మీరు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

పరిహారం : మీ గదిలో గులాబీ పాత్రను దక్షిణ దిశలో ఉంచుకోవాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు 11వ స్థానం గుండా ప్రయాణించనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త వ్యక్తులను కలుస్తారు. మీరు కష్ట సమయాల్లో ఆదుకునే మిత్రులను పొందుతారు. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితులు మెరగువుతాయి. మీ వైవాహిక సంబంధం కూడా మెరుగవుతుంది. భవిష్యత్తులో సమస్యలు రాకుండా జాగ్రత్త పడతారు.

పరిహారం : ప్రతిరోజూ 108 సార్లు శుక్ర మంత్రాన్ని పఠిస్తే, మంచి ఫలితాలొస్తాయి.

<strong>ఈ వారం మీ రాశి ఫలాలు 20 నుండి జూన్ 26వ తేదీ వరకు...</strong></p><p>ఈ వారం మీ రాశి ఫలాలు 20 నుండి జూన్ 26వ తేదీ వరకు...

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు పదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి అనవసరమైన ఖర్చులు పెరగొచ్చు. ఈ కాలంలో మీకు ఆర్థిక సమస్యలు కూడా పెరుగుతాయి. మీకు పనిభారం కూడా పెరుగుతుంది. మీ రిలేషన్ షిప్ లో కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ వైవాహిక జీవితంలోనూ కొన్ని సమస్యలు వస్తాయి. మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : మీ వ్యాలెట్లో చిన్న వెండి బిల్లను ఉంచుకుంటే శుభఫలితాలు వస్తాయి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు తొమ్మిదో స్థానం గుండా సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు చేసే పని పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. ఈ రవాణా వల్ల మీరు మతపరమైన ఆచారాల పట్ల కూడా అంకితభావంతో ఉంటారు. మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమను పొందొచ్చు.

పరిహారం : ప్రతిరోజూ ఆవుకు ఏదో ఒక పదార్థం పెడితే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఎనిమిదో స్థానం గుండా ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రవాణా సమయంలో మీరు ఎవరికైనా రుణాలు ఇవ్వడం మానుకోండి. మీరు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

పరిహారం : శుక్రుని అనుగ్రహం పొందేందుకు ప్రతిరోజూ సోంపు గింజలను తీసుకోండి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఏడో పాదం గుండా ప్రయాణించనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. మీ వైవాహిక జీవితం మరింత బలంగా మారుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో పదోన్నతులు పొందొచ్చు. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు ఇటీవల పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలొస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయోజనాలు పొందుతారు.

పరిహారం : మీ ఉంగరపు వేలికి మంచి నాణ్యత గల ఓపాల్ రత్నం ధరించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఆరో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో ఎలాంటి వాదనలు పెట్టుకోకూడదు. మరోవైపు మీరు అనవసరమైన ఖర్చులు పెట్టుకోకూడదు. మీ భవిష్యత్తును ద్రుష్టిలో ఉంచుకుని చాలా ఆదా చేయడం నేర్చుకోవాలి. ఆరోగ్య పరంగా ఈ కాలంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

పరిహారం : మీ భాగస్వామికి మంచి సుగంధాలను బహుమతిగా ఇస్తే ప్రయోజనం ఉంటుంది.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఐదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీన రాశి వారికి ప్రేమ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయంలో విజయం లభిస్తుంది. వివాహం కాని వారికి ఈ సమయంలో శుభవార్తలు వినిపిస్తాయి. మీ ఆస్తికి సంబంధించిన వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరంగా లాభాలొస్తాయి.

పరిహారం : శుక్రవారం రోజున దుర్గా చాలిసాను పఠిస్తే మంచి ఫలితం వస్తుంది.

English summary

Venus Transit in Cancer on 22 June 2021, Effects on Zodiac Signs in Telugu

Venus Transit in Cancer Effects on Zodiac Signs in Telugu: The Venus Transit in Cancer will take place on 22 June 2021. Learn about remedies to perform in Telugu.
Story first published:Tuesday, June 22, 2021, 0:37 [IST]
Desktop Bottom Promotion