Latest Updates
-
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.!
Venus Transit in Cancer on June 22 2021:కర్కాటకంలోకి శుక్రుడి సంచారం.. ఈ 5 రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు
కర్కాటకంలోకి శుక్రుడి సంచారం వల్ల ఈ రాశులకు ఎలాంటి ప్రయోజనాలు కలగున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క గ్రహం ప్రతి నెల తన స్థానాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరంలో జూన్ 22వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2:07 గంటల మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు.

ఇదే రాశిలో 2021, జులై 17వ తేదీ శనివారం ఉదయం 9:12 గంటల వరకు నివాసం ఉండనున్నాడు. ఆ తర్వాత సింహ రాశిలోకి సంచారం చేయనున్నాడు. శుక్రుని అనుగ్రహం ఉంటే వైవాహిక జీవితం, కళా రంగంలో, సంగీతం, వినోద రంగంలో ప్రయోజనాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు.

ఈ నేపథ్యంలో శుక్రుడి రవాణా వల్ల ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది. అయితే శుక్రుడు కర్కాటకంలోకి ప్రవేశించే సమయంలో ఈ ఐదు రాశుల వారికి ప్రత్యేక ఫలితాలు ఉంటాయట. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి..
శుక్రుడు మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చాలా బాగా పని చేస్తారు. అయితే మీరు ఈ సమయంలో ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు మరియు నిరుద్యోగులకు ఈ కాలంలో కెరీర్ పరంగా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు ఈ సమయం మంచి ప్రయోజనాలు పొందుతారు. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి..
ఈ రాశి వారు శుక్రుడి సంచారం వల్ల కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఈ సమయంలో మీరు కొన్ని కొత్త పనులు చేస్తారు. శుక్రుడి రవాణా సమయంలో మీ తెలివి, శక్తి సామర్థ్యాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులు ఈ సమయంలో అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు. ఆరోగ్య పరంగా ఈ కాలంలో ఎలాంటి సమస్యలు ఉండవు. అంతేకాదు మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం పొందొచ్చు.

మిధున రాశి..
శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. విదేశాలలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు వ్యాపారవేత్తలకు మంచి లాభాలు పెరగొచ్చు. ఈ కాలంలో విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వ్యాపారులకు కూడా ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. మీ ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది.

సింహ రాశి..
కర్కాటక రాశిలోకి శుక్రుడు ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. మీరు ఊహించిన విధంగా లాభాలు రావొచ్చు. దీంతో పాటు మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఉద్యోగులకు కోరుకున్న చోటకు బదిలీ కూడా రావొచ్చు. మీకు కార్యాలయంలో పనిభారం కూడా తగ్గుతుంది. విద్యార్థులకు సమస్యలన్నీ తగ్గిపోతాయి. మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారులకు అద్భుతమైన ప్రయోజనాలు దక్కనున్నాయి. ఉద్యోగులకు ఊహించిన ఫలితాలు వస్తాయి. మీకు సహోద్యోగుల నుండి సహకారం లభిస్తుంది. అలాగే సీనియర్ల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీ ఉన్నతాధికారులు మీ పనితీరును కూడా మెచ్చుకుంటారు. ఈ కాలంలో మీకు ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు.



Click it and Unblock the Notifications