Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయా? పీరియడ్స్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మే 2026 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రిసెప్షన్: తారల సందడితో హోరెత్తుతున్న వేదిక.. ఫోటోలు వైరల్! -
వైశాఖ పౌర్ణమి వేళ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
కరకరలాడే క్యాబేజీ టిక్కీలు..క్యాబేజీ వద్దు అన్నవాళ్లే ప్లేట్లు ఖాళీ చేస్తారు -
ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయిందా? అయితే పడేయకుండా ఇలా రుచికరమైన బ్రెడ్ ఉప్మా చేసేయండి! -
ఎండల దెబ్బకు మారుతున్న పెళ్లిళ్ల ముహూర్తాలు.. అసలు ఏం జరుగుతోంది? -
చంద్రుని రాశి మార్పు: వృశ్చికంలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం! -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇవి తప్పనిసరి! -
వృషభం, తుల, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ లాభాలు! - శుక్రవారం, 01 మే 2026
మిధునంలోకి శుక్రుడి సంచారం.. ఈ 7 రాశులకు ఆర్థిక ప్రయోజనాలు... మీ రాశి కూడా ఉందేమో చూడండి...!
2021లో శుక్రుడు మిధునంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలుంటాయట. మీ రాశి ఉందేమో చూడండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క గ్రహం ప్రతి నెల తన స్థానాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరంలో మే 28వ తేదీన రాత్రి 11:44 గంటలకు శుక్రుడు వృషభరాశి నుండి మిధున రాశిలోకి అడుగు పెట్టనున్నాడు.

ఇదే రాశిలో 2021, జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ఏడు నిమిషాల వరకు నివాసం ఉండనున్నాడు. ఆ తర్వాత కర్కాటక రాశిలోకి రవాణా చేయనున్నాడు. ఆ తర్వాత కర్కాటక రాశిలోకి రవాణా చేయనున్నాడు. శుక్రుని అనుగ్రహం ఉంటే వైవాహిక జీవితం, కళా రంగంలో, సంగీతం, వినోద రంగంలో ప్రయోజనాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు.

ఈ నేపథ్యంలో శుక్రుడి రవాణా వల్ల ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది. ఈ సందర్భంలో కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగున్నాయి. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో.. మీకు ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడే తెలుసుకోండి...

మేష రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ కాలంలో మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. మీ కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం బాగుంటుంది. మీ పని రంగంలో మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగులకు సీనియర్ల నుండి మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో మీరు చాలా ఉత్సాహంగా పని చేస్తారు. దీంతో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులకు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఓపికగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈ సమయం మంచిగా ఉంటుంది.

వృషభ రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి సంచారం వల్ల అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ప్రతి పనిలో మీ ప్రియమైన వారికి మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో మీరు లావాదేవీలు చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొత్త వాహనం లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేయొచ్చు. ఉద్యోగులు మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో ఎవ్వరినీ నమ్మకండి. మీ ప్రేమ జీవితంలో సమయం అనుకూలంగా ఉంటుంది.

మిధున రాశి..
శుక్రుడు వృషభరాశి నుండి ఈ రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశిపై సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో మీరు సమాజంలో గౌరవం పొందుతారు. విద్యార్థులు ఈ సమయంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. మీరు ఉన్నత విద్య కోసం ఎదురుచూస్తుంటే, కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు మరియు వ్యాపారవేత్తలకు ఈ కాలంలో మంచి ప్రయోజనాలు వస్తాయి. విద్యార్థులు ఈ సమయంలో సరైన ఫలితాలను పొందుతారు. ఒంటరిగా ఉండే వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఈ సమయం మీకు చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ సమయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

సింహ రాశి..
ఈ రాశి వారు శుక్రడు సంచారం సమయంలో కొంత కష్టపడితే, మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. మరోవైపు ఆర్థిక పరంగా చాలా మెరుగ్గా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండటం మరచిపోవద్దు.

కన్య రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ సమయంలో మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు మంచి పురోగతి లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మీరు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో అంతా మంచిగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య సంబంధం మరింత బలంగా ఉంటుంది. మీరు ఈ కాలంలో మతపరమైన పనులలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

తుల రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి సంచారం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు మరియు వ్యాపారులకు ఈ సమయం మంచిగా ఉంటుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. పెండింగ్ పనులను కూడా పూర్తి చేసేస్తారు. వ్యాపారులకు ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒంటరిగా ఉండే వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. ఉద్యోగులు ఈ కాలంలో పురోగతి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు వ్యాపారులు ఈ సమయంలో అనేక ప్రయోజనాలను పొందుతారు. కొత్తగా వివాహం చేసుకున్న వారి మధ్య సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆర్థిక పరంగా అంతా మంచిగా ఉంటుంది. మీరు ఊహించిన విధంగా ఫలితాలను పొందుతారు.



Click it and Unblock the Notifications