For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Venus Transit in Leo On 17 July 2021: సింహరాశిలోకి శుక్రుడి సంచారం.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...!

2021లో జులై 17వ తేదీన శుక్రుడు సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా రాశి చక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ఈ నెలలో నాలుగు గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకోనున్నాయి. ఇప్పటికే బుధుడు తన స్థానాన్ని మార్చుకున్నాడు. సూర్యుడు కూడా 16వ తేదీన కర్కాటకరాశిలోకి రవాణా చేయనున్నాడు.

Venus Transit in Leo On 17 July 2021, Effects on Zodiac Signs in Telugu

ఆ మరుసటి రోజే అంటే శనివారం రోజున జులై 17వ తేదీ ఉదయం 9:23 గంటలకు శుక్రుడు కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో సుమారు 23 రోజుల పాటు ఆగస్టు 11వ తేదీ రాత్రి 11:32 గంటల వరకు నివాసం ఉండనున్నాడు. ఆ తర్వాత కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు.

Venus Transit in Leo On 17 July 2021, Effects on Zodiac Signs in Telugu

శుక్రుడు బలంగా ఉంటే, వైవాహిక జీవితం, అందం, ఆనందం, విలాసవంతం తదితర వాటికి కారణమైన గ్రహంగా పరిగణించబడుతుంది. శుక్రుడు సింహరాశిలోకి సంచారం చేసే సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఏ రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది.. ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సింహంలోకి శుక్రుడి సంచారం.. ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనం... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!సింహంలోకి శుక్రుడి సంచారం.. ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనం... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!

మేష రాశి..

మేష రాశి..

శుక్రుడు సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు చాలా విషయంలో మెరుగ్గా ఉంటుంది. అంతేకాదు మీరు ప్రజలకు సహాయం చేయడంలో ముందుంటారు. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈ కాలంలో విద్యార్థులు తమ అధ్యయనాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగులకు ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు పనిలో విజయంతో పాటు గౌరవం, మర్యాదలు లభిస్తాయి. కొత్త జంటలకు పిల్లల గురించి ఓ శుభవార్త వినిపిస్తుంది. మీరు ప్రేమ వివాహం చేయాలనుకుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి..

వృషభ రాశి..

శుక్రుడు సింహ రాశిలోకి రవాణా చేసే సమయంలో ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ఇల్లు లేదా వాహనం కొనాలని చూస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంస్థలలో సేవ లేదా పౌరసత్వం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి శుక్రుని సంచారం వల్ల ఊహించని ఫలితాలు వస్తాయి. మీకు ధైర్యం కూడా పెరుగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ సీనియర్ కుటుంబ సభ్యులు మరియు సోదరులతో విభేదాలు తలెత్తడానికి అనుమతించొద్దు. ఉద్యోగులకు ప్రమోషన్ మరియు గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు ఈ సమయం మంచిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో మంచిగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన పనులు కూడా విజయవంతమవుతాయి.

సూర్యుడు కర్కాటకంలోకి సంచారం... ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే...సూర్యుడు కర్కాటకంలోకి సంచారం... ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు వెళ్లిపోవడం వల్ల కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వ్యాపారులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఏ పని అయినా చాలా కష్టపడి పూర్తి చేయాల్సి ఉంటుంది. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమలో ఉన్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ పెళ్లి దాకా ప్రయాణించొచ్చు. వివాహం చేసుకోవాలనుకునే వారికి మంచి ప్రతిపాదనలు వస్తాయి. ఈ సమయంలో మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఉద్యోగం చేసే వారికి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అంతేకాకుండా పెట్టుబడికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.

సింహ రాశి...

సింహ రాశి...

ఈ రాశి వారిలోకి శుక్రుడి రవాణా వల్ల అనుకూల ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తే లేదా కొత్త ఒప్పందంపై సంతకం చేయాల్సి వస్తే, గ్రహాల రవాణా చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన చర్చలు విజయవంతమవుతాయి. వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఆస్తికి సంబంధించిన పనులు పూర్తవుతాయి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీ శక్తి, సామర్థ్యాలు బాగా పెరుగుతాయి. మీరు స్నేహితులతో సమయాన్ని గడిపేందుకు వెళ్తారు. ఈ సమయాన్ని చాలా సరదాగా గడుపుతారు. విద్యార్థులు ఈ సమయంలో కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. మరోవైపు ఉద్యోగం చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఆహారం, పానీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మీ వైవాహిక జీవితంలో అంతా మంచిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. ప్రేమకు సంబంధించిన మీ నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి.

Sun Transit in Cancer:కర్కాటకంలో సూర్యుడి రవాణా.. ఈ రాశులకు ప్రత్యేక ఫలితాలు.. మీ రాశి ఉందేమో చూడండి...Sun Transit in Cancer:కర్కాటకంలో సూర్యుడి రవాణా.. ఈ రాశులకు ప్రత్యేక ఫలితాలు.. మీ రాశి ఉందేమో చూడండి...

తుల రాశి..

తుల రాశి..

శుక్రుడు సింహ రాశిలోకి ప్రయాణించే సమయంలో ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుండి సహకారం లభిస్తుంది. మీరు మీరు ఊహించిన ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభిస్తుంది. మీరు ఈ కాలంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించిన ఆందోళన నుండి మీకు ఉపశమనం లభిస్తుంది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

సింహ రాశిలోకి శుక్రుడు ప్రవేశించే సమయంలో ఈ రాశి వారిలో వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే లేదా కొత్త ఒప్పందంపై సంతకం చేయాలనుకుంటే.. సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

సింహ రాశిలోకి శుక్రుడు ప్రవేశించే సమయంలో ధనస్సు రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ఆధ్యాత్మికత, మతంపై ఆసక్తి పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా ధైర్యంగా చేస్తారు. అంతేకాదు పూర్తి ఆత్మవిశ్వాసంతో చేస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా మంచిగా ఉంటుంది. వ్యాపారులకు ఈ కాలంలో ఊహించిన విధంగా లాభాలు పెరుగుతాయి. అంతేకాదు మీరు ఈ కాలంలో ఎక్కువ ఖర్చులు చేస్తారు. అయితే ఖర్చులకు తగ్గ ఆదాయం లభిస్తుంది. దీంతో మీరు వెనుకడుగు అనేదే వేయరు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి. మీ కోరికలు నెరవేరుతాయి. తల్లిదండ్రుల నుండి మీకు మద్దతు లభిస్తుంది.

మకర రాశి..

మకర రాశి..

శుక్రుడి రవాణా వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు కోర్టుకు సంబంధించిన కోర్టు కేసులను కూడా బయట పరిష్కరించుకోవడం మంచిది. విద్యార్థులకు ఈ సమయం కఠినంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించేందుకు మీరు తీవ్రంగా ప్రయత్నించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

శుక్రుడి సంచారం వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఇతర దేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న వారికి సానుకూల ఫలితాలు రావొచ్చు. మరికొందరు ఈ కాలంలో అక్కడే స్థిరపడేందుకు ఇష్టపడతారు. అంతేకాదు విరాళం ఇవ్వడానికి కూడా ముందు వరుసలో ఉంటారు. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా హుషారుగా పాల్గొంటారు. కుటుంబసభ్యులతో కూడా ఆనందంగా గడుపుతారు. ఏదైనా సమస్యలు ఎదురైతే.. వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు ఈ కాలంలో మంచి ఫలితాలు వస్తాయి. మీ కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. ఈ సమయంలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ప్రేమ వివాహం చేయాలనుకుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

మీన రాశి..

మీన రాశి..

శుక్రుడు సింహ రాశిలోకి రవాణా చేసే సమయంలో ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారులు ఈ సమయంలో ఊహించిన లాభాలు రాకపోవచ్చు. ఈ కాలంలో మీరు శత్రువులు బాగా పెరుగుతారు. మీరు తగాదాలు మరియు వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఆదాయంపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి.

English summary

Venus Transit in Leo On 17 July 2021, Effects on Zodiac Signs in Telugu

Venus Transit in Leo Effects on Zodiac Signs in Telugu : The Venus Transit in Leo will take place on 17 July 2021. Learn about remedies to perform in Telugu.
Story first published:Saturday, July 17, 2021, 12:33 [IST]
Desktop Bottom Promotion