For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Venus Transit in Libra On 06 September 2021:తులరాశిలోకి శుక్రుడి సంచారం... 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!

శుక్రుడు తులరాశిలోకి ప్రవేశించే సమయంలో ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలలో శుక్ర గ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జాతకంలో ఎవరిపై అయితే శుక్ర గ్రహ ప్రభావం ఉంటుందో వారి జీవితం ఆనందంగా.. హాయిగా సంతోషంగా ఉంటుందని పండితులు చెబుతుంటారు.

Venus Transit in Libra On 06 September 2021 Effects on Zodiac Signs in Telugu

వృషభరాశి, తులరాశులకు అధిపతి అయిన శుక్రుడు 2021, సెప్టెంబర్ 6తేదీన సోమవారం అర్ధారత్రి 12:39 గంటల సమయంలో కన్య రాశి నుండి తుల రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈరోజు నుండి ఇదే రాశిలో అక్టోబర్ రెండో తేదీ ఉదయం 9:35 గంటల వరకు నివాసం ఉండనున్నాడు. శుక్రుడు తన సొంతరాశిలో ఉండటం వల్ల 12 రాశిచక్రాల వారిపై తీవ్ర ప్రభావం ఉంటుంది.

Venus Transit in Libra On 06 September 2021 Effects on Zodiac Signs in Telugu

శుక్రుడు ఆనందం, సంతోషంతో పాటు పునరుత్పత్తికి కూడా కారకంగా పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో శుక్రుడి సంచారాన్ని అన్ని రాశుల వారికి చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. శుక్రుడు కన్య రాశిని వదిలి.. తులరాశిలోకి ప్రవేశించే సమయంలో ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.. ఏయే రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది.. ఎవరెవరు ప్రయోజనాలు పొందుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Monthly Horoscope: సెప్టెంబర్ మాసంలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...Monthly Horoscope: సెప్టెంబర్ మాసంలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

మేషరాశి..

మేషరాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఏడో పాదం గుండా ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు మంచిగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో శుభప్రదంగా ఉంటుంది. పెళ్లికాని వారు వివాహ అవకాశాలను పొందొచ్చు. వ్యాపారులు పెద్ద పెట్టుడులు పెట్టొచ్చు. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధాలు కూడా మెరుగ్గా ఉంటాయి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి నుండి ఆరో స్థానం నుండి శుక్రుడు సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో వృషభరాశి వారు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మీ శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఆఫీసులో మీ పట్ల గౌరవం, మర్యాద పెరుగుతాయి. మరోవైపు మీ జీవిత భాగస్వామితో వివాదాలను తగ్గించుకోవాలి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి ఐదో పాదం నుండి శుక్రుడు రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శుభఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మీ కెరీర్ గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచిస్తుంటే.. సానుకూల అవకాశాలు ఉంటాయి. ఈ కాలంలో మీరు విదేశీ ప్రయాణం కూడా చేయొచ్చు.

జీవితం గురించి ఏ రాశి వారు ఏం గ్రహిస్తారంటే...!జీవితం గురించి ఏ రాశి వారు ఏం గ్రహిస్తారంటే...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు నాలుగో స్థానం నుండి సంచరించనున్నాడు. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి ఆనందం పెరుగుతుంది. మీ సొంత ఇంటి కల, కొత్త వాహనం కొనుగోలు చేయొచ్చు. ఉద్యోగులు ఈ కాలంలో బాస్ తో సన్నిహితంగా ఉండాలి. మీరు లక్ష్యం మేరకు పని చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు మూడో స్థానంలో రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులు ఈ కాలంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అనుభవం ఉన్న వారి సలహాను తీసుకోవాలి. మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి..

కన్య రాశి..

శుక్రుడు ఈ రాశి నుండి రెండో స్థానం గుండా సంచరించనున్నాడు. ఈ కాలంలో కన్య రాశి వారికి ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు మీ సామర్థ్యం మేరకు కష్టపడి పనిచేస్తేనే విజయం సాధిస్తారు. ఆస్తికి సంబంధించిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీ మాటతీరు నైపుణ్యంతో క్లిష్ట పరిస్థితులను సులభంగా నియంత్రించగలుగుతారు. కోర్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

Five Planets Transit in September 2021:5 గ్రహాల రవాణాతో ఈ రాశుల ఆర్థిక ప్రయోజనాలు...!Five Planets Transit in September 2021:5 గ్రహాల రవాణాతో ఈ రాశుల ఆర్థిక ప్రయోజనాలు...!

తుల రాశి..

తుల రాశి..

సెప్టెంబర్ ఆరో తేదీ అర్థరాత్రి సమయంలో శుక్రుడు తన సొంత రాశిచక్రంలోకి ప్రవేశించున్నాడు. ఈ సమయంలో తుల రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు సులభంగా విజయం సాధిస్తారు. మరోవైపు వైవాహిక జీవితంలో ఉండే వారికి పిల్లల గురించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. పెళ్లి కాని వారికి వివాహ సంబంధిత చర్చలు విజయవంతమవుతాయి. మీ కుటుంబంలో శుభకార్యాలకు అవకాశం ఉంటుంది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు 12వ స్థానంలో ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బడ్జెట్ ప్రకారం ఖర్చులు చేయాలి. మీ వైవాహిక జీవితంలోనూ కొంత గందరగోళం ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు పదకొండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీకు ఆర్థిక పరమైన ప్రయోజనాలు పెరుగుతాయి. ఈ సమయంలో మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ కాలంలో ఏదైనా పెద్ద పనిని ప్రారంభించాలన్నా.. వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా లేదా కొత్త ఒప్పందాలపై సంతకం చేయాలనుకున్నా నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి ఆలస్యం చేయొద్దు. మరోవైపు పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు పదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులు ఆఫీసులో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీకు పని భారం ఎక్కువ కావొచ్చు. కాబట్టి ప్రశాంతంగా మరియు ఓపికగా ఉండండి. లేకపోతే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. మీ వైవాహిక జీవితంలోనూ కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

శుక్రుడు ఈ రాశి నుండి తొమ్మిదో పాదం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి చాలా విషయాల్లో పురోగతి లభిస్తుంది. మీకు విదేశీ స్నేహితులు మరియు బంధువుల నుండి సహకారం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు కూడా విదేశాలలో చదువుకోవడానికి ప్రయత్నాలు చేయాలనుకుంటే.. మీ అవకాశాలు సానుకూలంగా ఉంటాయి. మీరు మతపరమైన ప్రదేశాలను సందర్శించొచ్చు. మీరు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో ఏదైనా టెండర్ కోసం ప్రయత్నిస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఎనిమిదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శుక్రుని ప్రభావం వల్ల ఆరోగ్య పరంగా సమస్యలను అధిగమించొచ్చు. ఉద్యోగులు మాత్రం ఈ కాలంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు.

FAQ's
  • శుక్రుడు సెప్టెంబర్ 6న ఏ రాశిలోకి ప్రవేశించనున్నాడు?

    జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రుడు 2021, సెప్టెంబర్ 6తేదీన సోమవారం అర్ధారత్రి 12:39 గంటల సమయంలో కన్య రాశి నుండి తుల రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈరోజు నుండి ఇదే రాశిలో అక్టోబర్ రెండో తేదీ ఉదయం 9:35 గంటల వరకు నివాసం ఉండనున్నాడు. అనంతరం వృశ్చికరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై కచ్చితంగా ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఏయే రాశుల వారిపై అనుకూల ప్రభావం పడుతుంది.. ఎవరెవరికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

English summary

Venus Transit in Libra On 06 September 2021 Effects on Zodiac Signs in Telugu

Shukra Rashi Parivartan in Libra September 2021: Venus Transit in Libra Effects on Zodiac Signs in Telugu : The Venus Transit in Libra will take place on 06th September 2021. Learn about remedies to perform in Telugu
Story first published:Saturday, September 4, 2021, 13:02 [IST]
Desktop Bottom Promotion