Latest Updates
-
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026 -
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.?
Shukra Gochar 2022:మీనంలోకి శుక్రుని ఎంట్రీ.. ఏ రాశుల వారికి శుభ ఫలితాలంటే...!
2022లో ఏప్రిల్ 27న శుక్రుడు మీనంలోకి సంచారం చేసే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావం, రాశి చక్రాలు పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో ఒకరైన శుక్రుడు ఐశ్వర్యానికి, సిరి సంపదలకు ప్రతీకగా పరిగణిస్తారు.

ఎంతో విశిష్టత కలిగిన శుక్రుడు 2022లో ఏప్రిల్ 27వ తేదీన అంటే బుధవారం రోజున సాయంత్రం 6:16 గంటలకు కుంభ రాశి నుండి నిష్క్రమించి.. మీన రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఇదే రాశిలో మే 23వ తేదీ వరకు రాత్రి 8:24 గంటల వరకు సంచారం చేయనున్నాడు.

అనంతరం మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇలా శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించడం.. ఇప్పటికే ఈ రాశిలో గురుడు నివాసం ఉండటంతో.. దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కారణంగా ద్వాదశ రాశుల జీవితాలపై కచ్చితంగా ప్రభావం పడుతుంది.

12 రాశుల వారికి ఊహించని మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా శుక్రుని సంచారంతో ఏయే రాశి వారిపై ఎలాంటి ఫలితాలు పడనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు పన్నెండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మేష రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మీరు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయొచ్చు. అయితే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఇల్లు లేదా వాహనాన్ని విక్రయించాలనుకుంటే, గ్రహం యొక్క రవాణా అనుకూలంగా ఉంటుంది. విదేశీ కంపెనీలలో సేవ లేదా పౌరసత్వం కోసం చేసిన ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి.

వృషభ రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 11వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా శుభ ఫలితాలొస్తాయి. వ్యాపారులకు పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులకు మంచి సహకారం లభించే అవకాశం ఉంది. పిల్లల బాధ్యత నెరవేరుతుంది. కొత్తగా పెళ్లయిన వారికి సంతానం కలిగే అవకాశం కూడా ఉంది. మీరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే, దానికి గ్రహాలు అనుకూలంగా ఉంటాయి.

మిధున రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 10వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. శుక్రుడు, గురుడి కలయిక వల్ల ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు, గౌరవం పెరుగుతాయి. మీ సామాజిక బాధ్యత, పదవి ప్రతిష్ట కూడా పెరుగుతుంది. మీ ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు శుక్రుని సంచారం వేళ ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకుంటారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. పోటీలో పాల్గొనే విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ నిర్ణయాలకు ప్రశంసలు లభిస్తాయి. మతపరమైన ట్రస్టులు మరియు అనాధ శరణాలయాలు తదితర వాటిలో చురుగ్గా పాల్గొంటారు.

సింహ రాశి..
ఈ రాశి వారు శుక్రుని రవాణా సమయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. సమాజంలో మీ స్థానం మరియు ప్రతిష్ట పెరుగుతుంది. ఈ కాలంలో మీరు ప్రయాణాలు మరియు విలాస వస్తువుల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. మీ ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి. మీ బకాయిలన్నీ తిరిగి పొందుతారు.

కన్య రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు ఏడో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో మీ కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహించొచ్చు. పెళ్లికి సంబంధించిన చర్చలు కూడా సఫలమవుతాయి. ఈ సమయం ప్రేమ వివాహానికి అనుకూలంగా ఉంటుంది. మీరు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఏ రకమైన వ్యాపార టెండర్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, గ్రహ సంచారాలు మంచి ఫలితాలను ఇస్తాయి.

తుల రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు ఆరో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీకు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీరు విలాస వస్తువుల కొనుగోలుపై ఎక్కువ ఖర్చులు చేయొచ్చు. మీకు రావాల్సిన డబ్బు సకాలంలో దొరక్కపోవచ్చు. మీరు రహస్య శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు ఐదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మీ వ్యూహాలన్నీ చక్కగా పని చేస్తాయి. కొత్తగా పెళ్లైన వారికి సంతానం కలిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో తీవ్రత ఉంటుంది. వివాహం చేసుకోవాలనుకునే వారికి గ్రహ సంచారాలు అనుకూలంగా ఉంటాయి.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు నాలుగో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు శుభ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కోరుకున్న చోట బదిలీ రావొచ్చు. మీరు ఇల్లు లేదా వాహనం కొనాలనుకుంటే ఈ కాలంలో సమయం అనుకూలంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేసే వారి ప్రణాళికలు అమలవుతాయి.

మకర రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు మూడో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో మకర రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, కొత్త ఒప్పందంపై సంతకం చేయాలనుకున్నా సమయం అనుకూలంగా ఉంటుంది. మతం మరియు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. మీ కుటుంబంలోని సీనియర్లు మరియు తమ్ముళ్లతో విభేదాలు పెరగనివ్వొద్దు.

కుంభ రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు రెండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీరు ఆకస్మిక ధనాన్ని పొందుతారు. అయితే ఆరోగ్య పరమైన విషయాలపై జాగ్రత్తగా ఉండాలి. మహిళలు ఈ కాలంలో గొప్ప విజయాలను సాధిస్తారు. మీ ప్రసంగ నైపుణ్యాల బలంతో, మీరు క్లిష్ట పరిస్థితులను కూడా సులభంగా నియంత్రించగలుగుతారు.

మీన రాశి..
ఇదే రాశిలోకి శుక్రుడు సంచారం చేయనున్నాడు. గురుడు కూడా ఇదే రాశిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. మీకు సామాజిక హోదా పెరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పని చేసే వారికి సానుకూల వాతావరణం ఉంటుంది. మీ కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. వివాహ చర్చలు కూడా విజయవంతమవుతాయి. పోటీలో పాల్గొనే విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో ఒకరైన శుక్రుడు ఐశ్వర్యానికి, సిరి సంపదలకు ప్రతీకగా పరిగణిస్తారు. ఎంతో విశిష్టత కలిగిన శుక్రుడు 2022లో ఏప్రిల్ 27వ తేదీన అంటే బుధవారం రోజున సాయంత్రం 6:16 గంటలకు కుంభ రాశి నుండి నిష్క్రమించి.. మీన రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఇదే రాశిలో మే 23వ తేదీ వరకు రాత్రి 8:24 గంటల వరకు సంచారం చేయనున్నాడు. అనంతరం మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు.



Click it and Unblock the Notifications