Latest Updates
-
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్! -
కుజ-గురు కలయికతో ద్విద్వాదశ యోగం..ఈ 4 రాశులకు అడుగడుగునా అదృష్టమే! -
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు! -
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే!
Shukra Gochar 2022:మీనంలోకి శుక్రుని ప్రవేశంతో.. ఈ రాశులకు అద్భుత ప్రయోజనాలు....!
2022లో ఏప్రిల్ 27న శుక్రుడు మీనరాశిలోకి సంచారం వేళ ఈ రాశులకు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయట. మీ రాశి ఉందేమో చూడండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో ఒకరైన శుక్రుడు ఐశ్వర్యానికి, సిరి సంపదలకు ప్రతీకగా పరిగణిస్తారు.

ఎంతో విశిష్టత కలిగిన శుక్రుడు 2022లో ఏప్రిల్ 27వ తేదీన అంటే బుధవారం రోజున సాయంత్రం 6:16 గంటలకు కుంభ రాశి నుండి నిష్క్రమించి.. మీన రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఇదే రాశిలో మే 23వ తేదీ వరకు రాత్రి 8:24 గంటల వరకు సంచారం చేయనున్నాడు.

అనంతరం మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇలా శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించడం.. ఇప్పటికే ఈ రాశిలో గురుడు నివాసం ఉండటంతో.. దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కారణంగా ద్వాదశ రాశుల జీవితాలపై కచ్చితంగా ప్రభావం పడుతుంది.

12 రాశుల వారికి ఊహించని మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. శుక్రుడు మీనంలోకి ప్రవేశించడంతో ద్వాదశ రాశులలో ని కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు రానున్నాయట. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి.

వృషభ రాశి..
మీనరాశిలో శుక్రుడు, గురుడి కలయిక వల్ల ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీ ఆదాయం కచ్చితంగా పెరుగుతుంది. ఈ కారణంగా మీరు బకాయిలను సకాలంలో చెల్లిస్తారు. మీ కెరీర్ లో కూడా పురోగతి సాధిస్తారు. కొత్తగా పెళ్లయిన వారికి సంతానం కలిగే అవకాశం కూడా ఉంది. శుక్ర దేవుని అనుగ్రహంతో ఈ కాలంలో దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి.

మిధున రాశి..
మీనరాశిలో శుక్రుడు, గురుడి కలయిక వల్ల ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశం వస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు, గౌరవం పెరుగుతాయి. మీకు మేనేజర్ నుండి ప్రశంసలు లభిస్తాయి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో అనుకూలంగా ఉంటుంది. మీ సామాజిక బాధ్యత, పదవి ప్రతిష్ట కూడా పెరుగుతుంది. మీ ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి.

కర్కాటక రాశి..
మీనరాశిలో శుక్రుడు, గురుడి కలయిక వల్ల ఈ రాశి వారికి విదేశీ యానం అవకాశం వస్తుంది. మీరు అక్కడికి వెళ్లి ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు. ఈ కాలంలో మీకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారు విజయం సాధించే అవకాశం ఉంది. అంతేకాదు, మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి..
మీనరాశిలో శుక్రుడు, గురుడి కలయిక వల్ల ఈ రాశి వారికి మంచి ఫలితాలు రానున్నాయి. మీరు కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతిని సాధించొచ్చు. ఈ కాలంలో మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు కోరుకున్న చోట బదిలీ రావొచ్చు. మీరు ఇల్లు లేదా వాహనం కొనాలనుకుంటే ఈ కాలంలో సమయం అనుకూలంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేసే వారి ప్రణాళికలు అమలవుతాయి.

కుంభ రాశి..
మీనరాశిలో శుక్రుడు, గురుడి కలయిక వల్ల ఈ రాశి వారికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు లక్ష్యం వైపు వేగంగా వెళ్తారు. ఈ కాలంలో మీరు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పెద్ద పెట్టుబడులు పెట్టొచ్చు. మీ ప్రసంగ నైపుణ్యాల బలంతో, మీరు క్లిష్ట పరిస్థితులను కూడా సులభంగా నియంత్రించగలుగుతారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో ఒకరైన శుక్రుడు ఐశ్వర్యానికి, సిరి సంపదలకు ప్రతీకగా పరిగణిస్తారు. ఎంతో విశిష్టత కలిగిన శుక్రుడు 2022లో ఏప్రిల్ 27వ తేదీన అంటే బుధవారం రోజున సాయంత్రం 6:16 గంటలకు కుంభ రాశి నుండి నిష్క్రమించి.. మీన రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఇదే రాశిలో మే 23వ తేదీ వరకు రాత్రి 8:24 గంటల వరకు సంచారం చేయనున్నాడు. అనంతరం మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు.



Click it and Unblock the Notifications