Venus Transit in Taurus On 18 June 2022: శుక్రుడు వృషభంలోకి సంచారం.. ఈ రాశులకు ప్రయోజనం...!

2022లో జూన్ 18న వృషభంలోకి శుక్రుడు ప్రవేశించే సమయంలో ఈ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయట.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క గ్రహం ప్రతి నెల తన స్థానాన్ని మార్చుకుంటూ ఉంటుంది. గ్రహాలన్నింటిలో శుక్ర గ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది.

Venus Transit in Taurus On 18 June 2022, These Zodiac Signs Get Benefits in Telugu

ఈ నేపథ్యంలోనే 2022లో జూన్ 18వ తేదీన అంటే శనివారం రోజున శుక్రుడు మేషరాశి నుండి వృషభరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఇదే రాశిలో సుమారు నెలరోజుల పాటు అంటే జులై 18వ తేదీ వరకు సంచారం చేయనున్నాడు.

Venus Transit in Taurus On 18 June 2022, These Zodiac Signs Get Benefits in Telugu

ఆ తర్వాత తన సొంత రాశి అయిన మిధున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయట. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు రెండో స్థానం నుండి వృషభరాశిలోకి అడుగుపెట్టే సమయంలో మేష రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులు లాభాలను స్వీకరిస్తారు. మీ వ్యాపారాన్ని పెంచుకునేందుకు పెట్టుబడి కూడా పెట్టొచ్చు. మీకు కొత్త సంబంధాలు వస్తాయి. ఉద్యోగులు ఆఫీసులో తెలివిగా వ్యవహరిస్తారు. ఈ కాలంలో మీ ప్రేమ జీవితంలో మంచిగా ఉంటుంది. వివాహానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామి నుండి ప్రేమ మరియు మద్దతు పొందుతారు.

వృషభ రాశి..

వృషభ రాశి..

శుక్రుడు మేష రాశి నుండి ఈ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారుల ఆర్థిక పరిస్థితిలో అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది. మీకు అనేక మార్గాల నుండి ఆదాయం వస్తుంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు ఈ కాలంలో కొత్త ఉద్యోగం సంపాదించే అవకాశం కూడా ఉంది.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు 11వ స్థానం గుండా రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ పొందే బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారులు కూడా ఆశించిన ఫలితాలను పొందుతారు. అంతేకాదు మీరు చాలా సొమ్మును ఆదా చేస్తారు. మీ జీవితంలో సౌకర్యాలు కూడా పెరుగుతాయి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు 10వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో సింహ రాశి వారిలో నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. ఉద్యోగులు అయితే చాలా కాలంగా ట్రాన్స్ ఫర్ కోసం చూస్తున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు కూడా ఈ సమయం మంచిగానే ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ కాలంలో బలంగా ఉంటుంది. మీకు కుటుంబ పెద్దల సహాయం కూడా లభిస్తుంది. మీకు భాగస్వామ్య పనులు కూడా బాగా సాగుతాయి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు 9వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మీ ఆదాయం ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉంది. ఈ కాలంలో కొత్త పనులు ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు అనేక మార్గాల నుండి డబ్బును పొందొచ్చు. మీ పూర్వీకుల ఆస్తుల వల్ల కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఏదైనా కోర్టు కేసుల గురించి ఇబ్బందులను ఎదుర్కొంటుంటే, గొప్ప విజయాన్ని పొందొచ్చు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు 7వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారులకు అనేక లాభాలు వస్తాయి. ఈ కాలంలో మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కూడా కలవొచ్చు. మీరు తక్కువ సమయంలో ధనవంతులయ్యే అవకాశం కూడా వస్తుంది.

Story first published: Saturday, June 18, 2022, 9:44 [IST]
Desktop Bottom Promotion