Venus Transit in Virgo: కన్యరాశిలో శుక్రుడి రవాణా.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...!

2021లో ఆగస్టు 11వ తేదీన కన్య రాశిలోకి శుక్రుడు సంచారంతో ఏ రాశులపై ఎలాంటి ప్రభావమో చూడండి.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శుక్రుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. వైదిక జ్యోతిష్యం ప్రకారం శుక్రుడిని ఓ శుభగ్రహంగా పరిగణిస్తారు.
వృషభరాశి, తులరాశికి అధిపతిగా శుక్రుడు వ్యవహరిస్తాడు. శుక్రుడి అనుగ్రహం ఉంటే ఆనందం, శారీరక ఆనందం, వైవాహిక జీవితంలో సంతోషంతో ఇతర వాటికి కారణంగా భావిస్తారు.

Venus Transit in Virgo On 11 August 2021 Effects on Zodiac Signs in Telugu

అలాంటి శుక్రుడు తన స్థానం నుండి మరో స్థానానికి మారినప్పుడు ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 11వ తేదీన కన్యరాశిలోకి శుక్రుడు ఆగమనం చేయనున్నాడు. ఇదే రాశిలో సెప్టెంబర్ 6వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు.

Venus Transit in Virgo On 11 August 2021 Effects on Zodiac Signs in Telugu

ప్రస్తుతం శుక్రుడు సింహ రాశిలో సంచారం చేస్తున్నాడు. అనంతరం తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ నేపథ్యంలో 12 రాశులలోని కొన్ని రాశులపై ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. మరికొన్ని రాశుల ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా శుక్రుడి సంచారంతో ఏ రాశి వారికి అనుకూల ఫలితాలు రానున్నాయి.. ఏ రాశి వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..

మేష రాశి..

శుక్రుడు కన్యరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు రావచ్చు. మీకు కుటుంబ వాతావరణంలో కొంత ఇబ్బందులు రావొచ్చు. వ్యాపారులు కొన్ని చట్టపరమైన లేదా కోర్టు కేసులలో చిక్కుకోవచ్చు. మరోవైపు మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి. మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈ కాలం కష్టంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో నిమ్మనీళ్లు తాగండి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఈ కాలంలో విద్యపై ఏకాగ్రత సాధించలేకపోతారు. మీ ప్రేమ జీవితంలోనూ అభిప్రాయ భేదాలు వస్తాయి. మీ ఇద్దరి మధ్య అపార్థాలు పెరిగిపోతాయి. వ్యాపారులు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు వినూత్న ఆలోచనలను అమలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ సమస్యలు తొలగిపోవడానికి ప్రతిరోజూ 108 సార్లు ‘ఓం శుక్రాయ నమః' అని జపించాలి.

మిధున రాశి..

మిధున రాశి..

శుక్రుడు కన్యరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు కుటుంబపెద్దల ఆస్తులను పొందొచ్చు. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరందరూ ఒకరినొకరిని గౌరవించుకుంటారు. మీరు ఇతరులకు సహాయం చేస్తారు. ఈ సమయంలో మీ ప్రేమ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఏదైనా దీర్ఘకాలిక సమస్యలకు మీరు పరిష్కారం కనుగొంటారు. అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. మీ ఉద్యోగంలో కూడా పురోగతి ఉంటుంది. మరిన్ని సానుకూల ఫలితాల కోసం మీ గదికి దక్షిణ భాగంలో రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ధరించాలి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

కన్యరాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు ఏదైనా అప్పు తీసుకుంటే దాన్ని తిరిగి చెల్లించేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. మరోవైపు వ్యాపారులు ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవచ్చు. ఉద్యోగులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. ప్రతికూల ఫలితాల నివారణకు మీరు శుక్రవారం రోజున పార్వతీ దేవికి పాలు, అన్నం, చక్కెరను నైవేద్యంగా సమర్పించాలి.

సింహ రాశి..

సింహ రాశి..

శుక్రుడు కన్యరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, అందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచి లాభాలు వస్తాయి. మీరు ఇతరులకు సహాయం చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. సమాజంలో కూడా మీ పట్ల గౌరవం పెరుగుతుంది. మీరు ఈ కాలంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. మీ పనిలో కూడా చురుగ్గా పాల్గొంటారు. మీ జీవిత భాగస్వామి సలహా మీకు ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం శుక్రవారం రోజున సరస్వతీ దేవిని ఆరాధించాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి శుక్రుడి ప్రయాణం వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు షాపింగ్ కు ఎక్కువ డబ్బు ఖర్చు చేయొచ్చు. అయితే మీరు ఈ సమయంలో మీరు పొదుపుపై కూడా ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే నెమ్మదిగా పరిస్థితులు చక్కబడతాయి. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు శుక్రవారం రోజున మీ కుడి చేతి ఉంగరపు వేలికి నాణ్యమైన తెల్లని నీలమణి ఉన్న వెండి ఉంగరాన్ని ధరించాలి.

తుల రాశి..

తుల రాశి..

శుక్రుడు అధిపతిగా ఈ రాశి వారికి శుక్రుని స్థానం మార్పు వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు మీ కుటుంబంలోని తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. అయితే మీరు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి. పాత బకాయిలను పూర్తిగా చెల్లిస్తారు. తల్లిదండ్రులతో మీ సంబంధం బలోపేతం అవుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. రాజకీయాలలో ఉండే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీ ఆఫీసులో చాలా కష్టంగా ఉంటుంది. మీ ఖర్చులు ఆదాయం కంటే ఎక్కువ అవుతాయి. స్నేహితులు మరియు పరిచయం ఉన్న వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత స్నేహితులతో కూడా సన్నిహితంగా కష్టంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ కాలంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కూడా ప్రశాంతత ఉండదు. వీటి నివారణకు మీ బెడ్ రూమ్ లో రోజ్ క్వార్ట్జ్ స్టోన్ ను ఉంచండి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

శుక్రుడు కన్యరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంద. ఈ కాలంలో మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారులు ఊహించిన ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఈ కారణంగా మీరు ఆధ్యాత్మిక ప్రదేశలను సందర్శించవచ్చు. మరిన్ని మంచి ఫలితాల కోసం మీరు ప్రతిరోజూ సరస్వతీ దేవి వందనం, పారాయణం చేయండి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి శుక్రుడి ప్రయాణం వల్ల ప్రతికూల ఫలితాలు రావొచ్చు. ముఖ్యంగా ఈ కాలంలో విద్యార్థులు విద్య విషయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం.. ఏకాగ్రత కుదరకపోవడం వంటివి జరుగుతాయి. మరోవైపు ఉద్యోగులకు పని మీద శ్రద్ధ ఉండదు. వ్యాపారులు తమ వ్యాపారాన్ని జాగ్రత్తగా చేయాలి. లేదంటే మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ కష్టాలు తొలగిపోయేందుకు శుక్రవారం రోజున పార్వతీదేవిని ఆరాధించండి. తెల్లని మిఠాయిలను నైవేద్యంగా సమర్పించండి.

కుంభ రాశి..

కుంభ రాశి..

శుక్రుడు సింహ రాశి నుండి కన్యరాశిలోకి ఆగమనం చేయడం వల్ల ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు విదేశీయానం కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలని ఆశించి వారి కల కూడా నెరవేరుతుంది. మీకు మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితుల నుండి మద్దతు లభిస్తుంది. మీకు రహస్య శత్రువుల నుండి మంచి స్వేచ్ఛ లభిస్తుంది. అది మీ విజయానికి కారణమవుతుంది. మీ రవాణా సమయంలో ఆదాయం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మరిన్ని మెరుగైన ఫలితాల కోసం శుక్రవారం రోజున మీ ఉంగరపు వేలికి ఒపాల్ ఉన్న వెండి ఉంగరాన్ని ధరించండి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారికి శుక్రుడి రవాణా వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ప్రేమ మరియు వివాహ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు. మీ భాగస్వామి ప్రవర్తన వల్ల మీ దినచర్య దెబ్బతింటుంది. మీ భాగస్వామితో ఎక్కువ గొడవలు వస్తాయి. మరోవైపు వ్యాపారులు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆరోగ్యంగా ఉండేందుకు యోగా చేయాలి. మెరుగైన ఫలితాల కోసం శుక్రవారం రోజున సాయంత్రం తేలికపాటి కర్పూరం తీసుకుని అమ్మవారికి హారతి ఇవ్వాలి.

Story first published: Tuesday, August 10, 2021, 14:06 [IST]
Desktop Bottom Promotion