Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
Venus Transit in Virgo: కన్యరాశిలో శుక్రుడి సంచారం.. ఈ రాశులకు ఆర్థిక ప్రయోజనం...!
2021లో ఆగస్టు 11వ తేదీన కన్య రాశిలోకి శుక్రుడు సంచారంతో ఈ రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశులేవో మీరే చూడండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శుక్రుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. వైదిక జ్యోతిష్యం ప్రకారం శుక్రుడిని ఓ శుభగ్రహంగా పరిగణిస్తారు.

వ్రుషభరాశి, తులరాశికి అధిపతిగా శుక్రుడు వ్యవహరిస్తాడు. శుక్రుడి అనుగ్రహం ఉంటే ఆనందం, శారీరక ఆనందం, వైవాహిక జీవితంలో సంతోషంతో ఇతర వాటికి కారణంగా భావిస్తారు.

అలాంటి శుక్రుడు తన స్థానం నుండి మరో స్థానానికి మారినప్పుడు ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 11వ తేదీన కన్యరాశిలోకి శుక్రుడు ఆగమనం చేయనున్నాడు. ఇదే రాశిలో సెప్టెంబర్ 6వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు.

ప్రస్తుతం శుక్రుడు సింహ రాశిలో సంచారం చేస్తున్నాడు. అనంతరం తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ నేపథ్యంలో 12 రాశులలోని కొన్ని రాశులపై ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. అయితే మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా శుక్రుడి సంచారంతో ఏయే రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి.. ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే చూసెయ్యండి...

మిధున రాశి..
శుక్రుడు కన్యరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు కుటుంబపెద్దల ఆస్తులను పొందొచ్చు. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరందరూ ఒకరినొకరిని గౌరవించుకుంటారు. మీరు ఇతరులకు సహాయం చేస్తారు. ఈ సమయంలో మీ ప్రేమ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఏదైనా దీర్ఘకాలిక సమస్యలకు మీరు పరిష్కారం కనుగొంటారు. అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. మీ ఉద్యోగంలో కూడా పురోగతి ఉంటుంది.

సింహ రాశి..
శుక్రుడు కన్యరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, అందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచి లాభాలు వస్తాయి. మీరు ఇతరులకు సహాయం చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. సమాజంలో కూడా మీ పట్ల గౌరవం పెరుగుతుంది. మీరు ఈ కాలంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. మీ పనిలో కూడా చురుగ్గా పాల్గొంటారు. మీ జీవిత భాగస్వామి సలహా మీకు ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది.

తుల రాశి..
శుక్రుడు అధిపతిగా ఈ రాశి వారికి శుక్రుని స్థానం మార్పు వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు మీ కుటుంబంలోని తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. అయితే మీరు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి. పాత బకాయిలను పూర్తిగా చెల్లిస్తారు. తల్లిదండ్రులతో మీ సంబంధం బలోపేతం అవుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. రాజకీయాలలో ఉండే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు రాశి..
శుక్రుడు కన్యరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంద. ఈ కాలంలో మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారులు ఊహించిన ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఈ కారణంగా మీరు ఆధ్యాత్మిక ప్రదేశలను సందర్శించవచ్చు.

కుంభ రాశి..
శుక్రుడు సింహ రాశి నుండి కన్యరాశిలోకి ఆగమనం చేయడం వల్ల ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు విదేశీయానం కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలని ఆశించి వారి కల కూడా నెరవేరుతుంది. మీకు మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితుల నుండి మద్దతు లభిస్తుంది. మీకు రహస్య శత్రువుల నుండి మంచి స్వేచ్ఛ లభిస్తుంది. అది మీ విజయానికి కారణమవుతుంది. మీ రవాణా సమయంలో ఆదాయం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.



Click it and Unblock the Notifications
