For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2020 రాశిఫలాలు : ఈ రాశి చక్రాల వారికి ఉద్యోగం గ్యారంటీ.. విద్యలో కూడా అదృష్టం కలసి వస్తుంది..

2020 ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. ఈ నేపథ్యంలో మనం ఇది వరకే కొత్త సంవత్సరంలో మన భవిష్యత్తు, ఆరోగ్యం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు విద్యా, ఉద్యోగ జాతకం గురించి తెలుసుకుందాం.

|

హిందువులలో అనేక మంది వేదాలను, పురాణాలను, జ్యోతిష శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. వీటి ఆధారంగా తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందే ఊహించుకుంటారు. అందుకు తగ్గట్టు కార్యాచరణను ప్రారంభిస్తారు. మరికొద్ది రోజుల్లో 2019కి గుడ్ బై చెప్పబోతున్నాం.

Vidya and Udyoga

అలాగే 2020 ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. ఈ నేపథ్యంలో మనం ఇది వరకే కొత్త సంవత్సరంలో మన భవిష్యత్తు, ఆరోగ్యం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు విద్యా, ఉద్యోగ జాతకం గురించి తెలుసుకుందాం. అందుకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఈ స్టోరీలో చూడండి...

మేష రాశి (మార్చి 20 నుండి ఏప్రిల్ 18 వరకు)

మేష రాశి (మార్చి 20 నుండి ఏప్రిల్ 18 వరకు)

ఈ రాశి వారికి కెరీర్ పరంగా 2020 సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే, ఈ సంవత్సరం మీరు ఒక మంచి కంపెనీలో ఉన్నత స్థానాన్ని పొందవచ్చు. అయితే మీరు విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. విద్యారంగంలో కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తుంటే, ఈ సంవత్సరం విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది.

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ రాశి వారికి కెరీర్ పరంగా 2020 సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సరం మీ జీవితంలో పెద్ద మార్పు ఉండొచ్చు. అయితే అంతా ఆందోళన పడే విషయం ఏదీ ఉండదు. అయితే ఫలితం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. మీకు ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశం ఉంది. మీరు సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఈ సంవత్సరం మంచి లాభాలను పొందే అవకాశం ఉంది.అయితే సంవత్సరం మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఉంటారు. కానీ మీరు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఈ ఏడాది విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మనసును విద్యపై కేంద్రీకరించి చదవడంతో అన్ని అడ్డంకులను మీరు దాటేస్తారు. మీరు మంచి పనితీరును కూడా కనబరుస్తారు.

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు):

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు):

ఈ రాశి వారికి 2020 సంవత్సరం కెరీర్ పరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కొత్త సంవత్సరంలో ఎంత కష్టపడి పనిచేసినా అందుకు తగ్గ ఫలితాలను పొందలేరు. కానీ మీరు ధైర్యం మరియు సహనంతో పని చేయాలి. మీరు ప్రయత్నిస్తూనే ఉంటారు. భాగస్వామ్యంలో ఉండే వ్యాపారవేత్తలకు సంవత్సరం మధ్యకాలంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు విజయం సాధించాలనుకుంటే మీరు మరింత కష్టపడాలి. ఈ సంవత్సరం మీరు కోరుకున్న కళాశాలలో ప్రవేశం పొందే అవకాశం ఉంది.

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు):

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు):

ఈ రాశి వారికి గత సంవత్సరం అసంపూర్తిగా మిగిలిపోయిన కొన్ని పనులు 2020 కొత్త సంవత్సరంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మీకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా కొత్త పనిని కూడా ప్రారంభించవచ్చు. కొత్త సంవత్సరంలో ఉద్యోగులు కోరుకున్న చోట బదిలీ అయ్యేదుకు బలమైన అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు ఈ సంవత్సరం అనేక పర్యటనలు చేయాల్సి ఉంటుంది. ఈ పర్యటనలు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా ముఖ్యమైనది. మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే, శ్రద్ధగా అధ్యయనం చేసి, మీ లక్ష్యం గురించి ఆలోచించాలి. అలాగే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది.

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారికి 2020 సంవత్సరంలో కెరీర్ పరంగా ఉత్తమంగా ఉంటుంది. ప్రారంభ నెలల్లో మీకు చాలా మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ తో పాటు ఆదాయం కూడు పెరిగే అవకాశం ఉంది. మీ పనితీరును ఎంతో మంది మెచ్చుకుంటారు. నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం కొత్త ఉద్యోగాలను పొందవచ్చు. ఈ సంవత్సరం వ్యాపారులకు చాలా భయంకరంగా ఉంటుంది. అయితే మీకు అనేక మంచి అవకాశాలు లభిస్తాయి. మీ వ్యాపారం కూడా పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, ఏదైనా కొత్త పని కూడా ఈ సంవత్సరంలో ప్రారంభించవచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. మీరు అన్ని ప్రయత్నాలలో విజయం సాధించడంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కన్య రాశి (ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారికి 2020 కొత్త సంవత్సరం గొప్పగా ఉంటుంది. మీ కెరీర్ పురోగమన దిశలో వెళ్తుంది. కొన్ని మార్పులు కూడా ఉంటాయి. మీరు కొత్త కంపెనీలోనూ చేరవచ్చు. అక్కడ మీకు మంచి స్థానం మరియు మంచి వేతనం లభిస్తుంది. అలాగే కొందరు ట్రాన్స్ ఫర్ కూడా కావచ్చు. మీరు మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ సంవత్సరం వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మంచి రాబడిని సైతం సాధిస్తారు. ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ స్టడీస్ పూర్తి చేసి ఉంటే ఈ ఏడాదే కొత్త ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంది.

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో కెరీర్ పరంగా చాలా కష్టపడాలి. ప్రారంభంలో మీకు ఎక్కువ పనిభారం ఉంటుంది. అందుకే మీరు కష్టపడి పని చేయాలి. అప్పటి నుండే మీకు అనుకూల వాతావరణం ప్రారంభమవుతుంది. మీరు మంచి జ్ఞానంతో పనిచేస్తే, మీరు మంచి విజయాన్ని పొందవచ్చు. వ్యాపారవేత్తలు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ సంవత్సరం వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే మీరు ఊహించిన ఫలితాలను పొందలేకపోవచ్చు. ఈ సంవత్సరం మొత్తంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సోమరితనం వల్ల విద్యార్థులు బాధపడతారు. అయితే మీరు ఎంత కష్టపడితే అన్ని అడ్డంకులను అధిగమించి విజయాన్ని సాధిస్తారు.

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి కొత్త సంవత్సరం 2020లో అనుకూలంగా ఉంటుంది. సరైన సమయంలో కష్టపడి పనిచేయడంతో వీరు సరైన ఫలితాలను పొందుతారు. సంవత్సరం ప్రారంభంలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. ఈ సంవత్సరంలో ఉద్యోగులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ కృషికి తగ్గట్టు మీరు ఫలితాలను పొందడం లేదని మీరు భావిస్తారు. మీ ప్రస్తుత ఉద్యోగంలో మీరు సంతృప్తి పొందకపోవచ్చు. ఈ సంవత్సరం వ్యాపారులకు మంచి సంవత్సరంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ కాలంలో మీరు కొన్ని రిస్కులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా మంచిది. సాంకేతిక రంగంలో మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.

ధనస్సు రాశి (నవంబర్ 21 నుండి డిసెంబర్ 20 వరకు):

ధనస్సు రాశి (నవంబర్ 21 నుండి డిసెంబర్ 20 వరకు):

ఈ రాశి వారికి కెరీర్ పరంగా 2020 సంవత్సరంలో అంతా మంచిగా ఉంటుంది. ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటిలోనూ మంచి ఫలితాలను పొందే అవకాశాలున్నాయి. కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు విదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది. మొత్తం మీద, మీరు ఈ సంవత్సరం మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారులు కూడా లాభం పొందడానికి అనేక అవకాశాలు పొందుతారు. మీరు ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతారు, అలాగే మీ వ్యాపారం మరింత పెరుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

మకర రాశి (డిసెంబర్ 21 నుండి జనవరి 19 వరకు):

మకర రాశి (డిసెంబర్ 21 నుండి జనవరి 19 వరకు):

ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో నెమ్మదిగా పురోగమనాన్ని పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొత్త సంవత్సరంలో మీరు చాలా బిజీగా ఉండొచ్చు. మీ కృషికి సరైన ఫలితాలు రాకపోవడం వల్ల కొంత నిరాశకు గురైనప్పటికీ, మీ బలమైన విశ్వాసం మరియు ధైర్యంతో ముందుకు సాగుతారు. మీరు వ్యాపారం చేస్తే, ఈ కాలంలో మీ నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోవడం మంచిది. వ్యాపారంలో రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఈ సంవత్సరం విద్యార్థులకు మంచిగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలో చాలా మంచి మార్కులు పొందవచ్చు.

కుంభ రాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభ రాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి వారికి కొత్త సంవత్సరంలో అంత ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఒడిదుడుకుల పరిస్థితి అలాగే ఉంటుంది. ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. మీరు ఉద్యోగం మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే తొందరపడకుండా ఉండండి. కార్యాలయంలో, మీరు మీ ఉద్యోగాన్ని విడిచిపెట్టమని బలవంతం చేసే కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా తెలివిగా పనిచేయాలి. మీరు కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి. ఎందుకంటే నష్టపోయే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగా లేదు. మీ విద్యలో చాలా అడ్డంకులు ఉండవచ్చు.

మీన రాశి (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు):

మీన రాశి (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు):

ఈ రాశి వారికి కొత్త సంవత్సరంలో కెరీర్ పరంగా వేగమైన పురోగతి ఉంటుంది. మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. మీ నిర్ణయాలు సరైనవిగా నిరూపించబడతాయి. మీకు పూర్తి ప్రయోజనం కూడా లభిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తే, మీ పనితీరు ప్రశంసనీయం అవుతుంది. మీ సీనియర్లు కూడా మీ పనితో ఎక్కువగా సంతృప్తి చెందుతారు. మీ ఆదాయం ఈ సంవత్సరం పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ సంవత్సరం వ్యాపారులకు ఎంతో మేలు చేస్తుంది. మీరు చాలా పెద్ద లాభాలను పొందవచ్చు. ఈ సంవత్సరం మీరు మీ ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం విద్యార్థులకు విజయాలు లభిస్తాయి. ఇంజనీరింగ్ మరియు లా చదివే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది.

English summary

Vidya and Udyoga Rashiphalalu 2020 | Career Horoscope in Telugu

How will your career be in the year 2020? Will you get good results in a job or business? Will the students get success this year? Read the horoscope related to your education and career and know all about it.
Desktop Bottom Promotion