Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Viral : ఈగను చంపాలనుకున్నాడు... కానీ ఇంటినే కాల్చుకున్నాడు... ఎలాగో మీరే చూడండి...!
ఈగను చంపేందుకు ప్రయత్నించి, తన ఇంటిని కాల్చుకున్నాడో వ్యక్తి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో చాలా మందికి 'ఈగ' సినిమా గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈగ సినిమాను అస్సలు మరచిపోలేరు. ఒక చిన్న ఈగ అంత భయంకరమైన విలన్ ను ఎలా చంపుతుంది. అంతేకాదు తన కొంపకే తనే నిప్పు పెట్టుకునేలా చేస్తుంది లేదా తెలివిగా తనవైపునకు ఎలా తిప్పుకుంటుందో కూడా చూపించాడు మన దర్శకుడు రాజమౌళి.

అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నాననుకుంటున్నారా? ఎందుకంటే ఇలాంటి సంఘటనే నిజ జీవితంలో కూడా జరిగింది. ఇటీవలే ఓ వ్యక్తి చిన్న ఈగను చంపేందుకు ప్రయత్నించి, ఏకంగా తన కొంపకే నిప్పు పెట్టుకున్నాడు. అయితే ఈగను చంపే ప్రయత్నంలో ఆ వ్యక్తి బతుకు జీవుడా అంటూ కొనఊపిరితో బయటపడ్డాడు. అయితే ఈ ప్రయత్నంలో ఈగ చనిపోయిందా? అసలు ఈ సంఘటన ఎప్పుడు, ఎలా జరిగిందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

హాట్ టాపిక్...
మన తెలుగు సినిమాలో విలన్ సుధీప్ ఈగను చంపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్ని ప్రయత్నాలు చేస్తాడు. పట్టున కొడితే టప్పున చచ్చే ఈగ గురించి ఎన్నోవ్యూహాలు, ప్రతి వ్యూహాలు, పకడ్బందీ రక్షణ చర్యలు చేపడతాడు. అయినా అతనిపై పగబట్టిన ఈగ.. తనను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. అయితే అచ్చం అలాంటి సంఘటనే నిజ జీవితంలో కూడా చోటు చేసుకుంది. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఓ తాతయ్యను ఇరిటేట్ చేసిన ఈగ..
ఫ్రాన్స్ దేశంలోని పార్కౌల్-చెనౌడ్ అనే గ్రామంలో 80 ఏళ్ల తాతయ్య నివాసం ఉంటున్నాడు. అతను ప్రతిరోజూ భోజనం చేసే సమయంలో ఓ ఈగ తన దగ్గరికి వచ్చింది. ఎన్నిసార్లు దాన్ని తరిమినప్పటికీ.. అది అక్కడి నుండి వెళ్లకుండా ఆ తాతను బాగా ఇరిటేట్ చేసింది. అతని చుట్టూనే తిరగడం మొదలెట్టింది.

ఎలక్ట్రిక్ బ్యాటుతో..
దీంతో ఆ తాతయ్యకు చాలా కోపం వచ్చింది. దాన్ని ఎలాగైనా చంపాలని ఎలక్ట్రిక్ బ్యాట్ తీసుకున్నాడు. దాంతో ఒక దెబ్బకు దాన్ని మట్టుబెట్టాలనుకున్నాడు. అలా దాన్ని వెంటాడుతూ అనుకోకుండా వంటింట్లోకి వెళ్లాడు. అప్పటికే వంటింట్లో లీకవుతున్న గ్యాస్ విషయాన్ని మాత్రం గమనించలేకపోయాడు.

సిలిండర్ పేలుడు..
అప్పటికే ఈగపై పీకలదాకా కోపం పెంచుకున్న ఆ ముసలాయన పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా తన ప్రతాపాన్ని చూపిద్దామనుకున్నాడు. వెంటనే ఎలక్ట్రిక్ బ్యాటును ఆన్ చేశాడు. అంతే ఒక్కసారిగా దాని నుండి వెలువరిన నిప్పురవ్వలు, లీకైన గ్యాసుతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఆ ఇంట్లో మంటలు చెలరేగాయి.

లక్కీగా సేఫ్..
ఈ సమయంలో అతని వంటగది పైకప్పు మొత్తం కూలిపోయింది. ఇంట్లో మిగిలిన కొంత భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ సంఘటనలో ఆ పెద్దాయనకు కూడా కొన్ని స్వల్పమైన గాయాలయ్యాయి. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడని బిబిసి వివరించింది.

ఈగ చచ్చిందా?
ఆ పెద్దాయన చేసిన ప్రయత్నంలో ఈగ చచ్చిందా, లేదా అనే ప్రశ్నను మాత్రం అడగకండి. ఎందుకంటే ఆ విషయాన్ని ఆ తాతయ్య గమనించలేదట పాపం. కాకపోతే పెద్ద ప్రమాదం నుండి స్వల్పగాయాలతో బయటపడటం అందరూ సంతోషించదగ్గ విషయం. అనంతరం మరో ఇంట్లోకి వారి కుటుంబసభ్యులు మారిపోయారు. ఆ ఇంటిని మరమ్మతులు చేసే పనిలో నిమగ్నమయ్యారు.



Click it and Unblock the Notifications