For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Viral : ఈ విశ్వంలోనే వినాయకుడి ఫొటో ఉన్న ఏకైక ముస్లిం దేశమేదో తెలుసా?

ఇండోనేషియా కరెన్సీ నోటుపై గణేశుడి బొమ్మ ప్రింట్ అవ్వడంతో అది కాస్త వైరల్ అయ్యింది.

|

హిందూ - ముస్లింలు అన్నదమ్ముల వలె కలిసి ఉంటారు అనేందుకు ప్రత్యక్ష నిదర్శనం ఆ దేశం. అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఆ దేశంలో హిందూ దేవుళ్లను, ఆలయాలను ఆదరిస్తారు.

Viral : Lord ganesha on Rs.20000 note of indonesian currency

PC : Twitter

మన దేశంలో మాత్రమే హిందువులకు, హిందు దేవుళ్లను ఆరాధిస్తారు, మిగిలిన దేశాల్లో మన దేవుళ్లను ఆరాధించరు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. అయితే విదేశాల్లో ఉండే మన భారతీయులు మన దేవుళ్లను ఆరాధిస్తారు కదా అంటే అది మనోళ్లే. కానీ ముస్లింలు అత్యధిక ఉండే దేశంలో ఇది సాధ్యమవుతుందా? అంటే సమాధానం చెప్పడం కష్టమే.

Viral : Lord ganesha on Rs.20000 note of indonesian currency

కానీ ముస్లింలు అత్యధికంగా ఉండే ఓ దేశంలో మాత్రం హిందూ దేవుళ్లను ఆరాధించడమే, ఆలయాల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదండోయ్ వారు ఉపయోగించే కరెన్సీ నోట్ల కట్టలపై కూడా వినాయకుడి ఫొటోను ప్రింట్ చేసేంతగా గౌరవిస్తారు.

Viral : Lord ganesha on Rs.20000 note of indonesian currency

వినడానికి వింతగా.. ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చి నిజం. ఇంతకీ ఆ దేశం ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ పూర్తిగా చూసేయ్యండి మరి...

Bhadrapada Masam 2020 : భాద్రపద మాసంలో వినాయక చవితితో పాటు మరికొన్ని ముఖ్య పండుగలివే...Bhadrapada Masam 2020 : భాద్రపద మాసంలో వినాయక చవితితో పాటు మరికొన్ని ముఖ్య పండుగలివే...

ఏకైక ముస్లిం దేశం..

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ తనుజ్ గార్గ్ ఇటీవల ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 'ఈ ప్రపంచంలో విఘ్నేశ్వరుడి చిత్రాన్ని కరెన్సీ నోటుపై ముద్రించిన ఏకైక ముస్లిం దేశం.. ఇండోనేషియా' అని ట్వీట్ చేశారు. ఈయన ట్వీట్ చేసే వరకు చాలా మందికి ఈ విషయం గురించి పెద్దగా తెలియదు.

వినాయకుడి ఫొటో..

వినాయకుడి ఫొటో..

ఇండోనేషియా దేశంలోని 20 వేలు రూపాయలు విలువ చేసే కరెన్సీ నోటు రుపయా నోటులో ఆ దేశ స్వాతంత్య్ర సమరయోధుడు కి హజార్ దేవంతరా చిత్రానికి పక్కనే వినాయకుడి చిత్రాన్ని ముద్రించారు.

హిందువులే 2 శాతంలోపే..

హిందువులే 2 శాతంలోపే..

ఇండోనేషియా దేశంలో 87.2 శాతం మంది ముస్లింలు జీవనం కొనసాగిస్తున్నారు. అయితే, అక్కడ హిందువులు కేవలం 1.7 శాతం మంది మాత్రమే నివసిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ వినాయకుడి బొమ్మ కరెన్సీ నోటుపై ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, ఈ దేశం యొక్క ద్వీప సమూహంలో 15వ శతాబ్దం నుండి హిందువుల ప్రభావం ఎక్కువగా ఉంది.

ఎన్నో ఆలయాలు, విగ్రహాలు..

ఎన్నో ఆలయాలు, విగ్రహాలు..

ఆ దేశంలో హిందువులకు సంబంధించిన ఎన్నో ఆలయాలు, విగ్రహాలు ఎన్నో కనిపిస్తుంటాయి. అంతేకాదు రామాయణం, మహాభారతాల ప్రభావం కూడా అక్కడ ఎక్కువగా కనిపిస్తుంటుంది. జకార్తాలో క్రిష్ణార్జునుల విగ్రహాలు కనిపిస్తాయి. ఇండోనేషియా సైన్యం మస్కట్ లో కూడా హనుమంతుడి బొమ్మ ఉంటుంది.

పరమత సహనానికి ప్రతీక..

పరమత సహనానికి ప్రతీక..

ఆ దేశంలోని బాలీ పర్యాటక లోగో కూడా పురాణాలను ప్రతిబింబించేలా రూపొందించడం గమనార్హం. అందుకే.. ఇండోనేషియాను అంతా పరమత సహనానికి ప్రతీకగా భావిస్తారు.

English summary

Viral : Lord ganesha on Rs.20000 note of indonesian currency

Here we talking about Lord Ganesha on Rs.20000 note of indonesian currency. Read on
Story first published:Monday, August 24, 2020, 14:10 [IST]
Desktop Bottom Promotion