Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
తన ప్రేయసికి తానే స్వయంగా గుండు గీసిన ప్రియుడు... ఎందుకో తెలిస్తే కళ్లలో నీరు తిరుగుతాయి...!
ఓ వ్యక్తి తన ప్రియురాలికి గుండు చేసి, ఆ తర్వాత తాను స్వయంగా అదే పని చేశాడు. అలా ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ లోకంలో ఎవరైనా సరే తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే పార్కులు, సినిమాలు, షికార్లు, లాంగ్ డ్రైవ్, ఇంకా ఏవేవో టూర్లకు వెళ్తుంటారు. ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు.

ఇంకా ఎవరైనా మీ ప్రేయసి అంటే మీకెంత ప్రేమ ఉందని ప్రశ్నిస్తే, 'మాకు విమానమంతా విశాలమైన మనసు ఉందని, మా ప్రేమ చరిత్రలో నిలిచిపోతుంది' అని చెబుతూ ఉంటారు.

అయితే ఈ వ్యక్తి మాత్రం తన ప్రియురాలిపై తనకు ఎంత ప్రేమ ఉందో మాటల్లో చెప్పడమే కాదు.. చేతల్లో కూడా చూపించాడు. 'నీ బాధ నా బాధ కాదా అంటూ నీ బాధ ఎల్లప్పుడూ నా బాధే కావాలి.. అయితే నా వల్ల నీకు ఎప్పటికీ బాధ కలగకూడదు. నీవు కష్టపడితే నేను చూడలేను. నీ సమస్యను నా సమస్యగా భావిస్తా..
His girlfriend was struggling with her hair loss from alopecia.
— Rex Chapman🏇🏼 (@RexChapman) July 29, 2020
Get out the tissues.
Humanity.🌎❤️ pic.twitter.com/EikwKnlACo
నీ జీవితంలో ఎలాంటి లోపాలున్నా పర్వాలేదు. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే నీ లోకమే.. నా లోకం అంతా కావాలి.. నువ్వే నా మనసులో ఎప్పటికీ రాకుమారిలా నిలిచిపోవాలి' అంటూ ఆ ప్రియుడు చేసిన పని చూస్తే ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరుగుతాయి..

ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడు.. తన ప్రియురాలికి అంత కష్టం ఏమొచ్చింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రియురాలికి గుండు..
మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ రెక్స్ చాంప్ మ్యాన్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశాడు. అందులో ఓ వ్యక్తి తన ప్రేయసికి తానే స్వయంగా ట్రిమ్మర్ తో గుండు చేశాడు. అనంతరం అతడు కూడా గుండు చేసుకున్నాడు.

ఆత్మవిశ్వాసం నింపేందుకు..
అయితే దీని వెనుక గుండెలను పిండేసే బలమైన కారణం ఉంది. నిజానికి అతడు.. ఆమెపై పగతోనో.. సరదాకో గుండు చేయలేదు. ఆమె ఎదుర్కొంటున్న సమస్యను అర్థం చేసుకుని.. ఆమెకు దాని నుండి కొంతైనా ఉపశమనం కలగాలని ఆమెకు ట్రిమ్మర్ తో గుండు గీశాడు. ఆ తర్వాత ఆమెలో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని నింపేందుకు తాను కూడా స్వయంగా అదే పని చేశాడు.

ఆమె బాధను చూడలేక..
ఆ వీడియోలో ఉన్న యువతి ‘అలోపేసియా' అనే సమస్యతో బాధపడుతోంది. దీని వల్ల ఆమె జుట్టు విపరీతంగా ఊడిపోతోంది. ఆమె బాధను చూడలేక.. అతను గుండు గీసేశాడు.

ఊహించని నిర్ణయం..
‘ఇక నీ జుట్టు రాలదు, నాదీ భరోసా' అంటూ ట్రిమ్మర్ తీసుకున్నాడు. ఆమెకు పూర్తిగా గుండు కొట్టేశాడు. ఆ తర్వాత ఆమె ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అదే ట్రిమ్మర్ తో తాను కూడా గుండు గీసుకున్నాడు. దీంతో అప్పటివరకు కన్నీళ్లు ఆపుకున్న ఆ యువతి కంటి నుండి సాగరంలో కెరటల్లా ఎగిసిపడ్డాయి.

వైరల్ అయిన వీడియో..
ఈ వీడియోను ఫుట్ బాల్ ప్లేయర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయిపోయ్యింది. ఆ ప్రియుడు తీసుకున్న నిర్ణయానికి అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇంతగా ప్రేమించే ప్రియుడు దొరకడం ఆమె లక్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో చూసి మీ ఓపినీయన్ కూడా చెప్పేయండి...



Click it and Unblock the Notifications