Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!
వైరల్ : టెక్నాలజీని ఇలా కూడా వాడతారా? వీడియో కాల్ లో ఎంగేజ్ మెంట్ పై మీరు ఓ లుక్కేయండి...
ఇలాంటి ఆన్ లైన్ నిశ్చితార్థం వేడుకలు వంటివి సినిమాల్లో కూడా రాలేదు. అంతేకాదు టెక్నాలజీలో ముందుండే విదేశీయులు కూడా ఇలాంటివి ప్రయత్నించలేదు.
ఇంతవరకు పెళ్లిళ్లు భూమి మీద లేదా గాల్లో జరగడం చూసే వింటారు. కనీసం అలాంటి పెళ్లిళ్ల గురించి కనీసం ఎక్కడైనా వింటారు. పెళ్లి అంటే బంధువులు.. కుటుంబసభ్యులు.. స్నేహితులు తెగ హడావుడిగా ఉంటుంది. అయితే పెళ్లికి ముందు జరిగే నిశ్చితార్థానికి కూడా దాదాపుగా అదే హడావుడి ఉంటుంది.

సాధారణంగా నిశ్చితార్థం అంటే కాబోయే వధూవరులిద్దరూ తమ చేతి వేలికి ఉంగరాలు మార్చుకుంటారు. వాటితో పాటు పూలమాలలను కూడా ఒకరి మెడలో ఒకరు వేసుకుంటారు. దీంతో వారిద్దరికీ దాదాపు సగం పెళ్లి అయినట్టే అని చాలా మంది హిందువులు భావిస్తారు.

మరి కొందరు నిశ్చితార్థం సమయంలోనే వధువుకు కాళ్ల పట్టీలు.. ఇతర బంగారాన్ని సమర్పించడం వంటివి చేస్తుంటారు. ఇక సినిమాల్లో అయితే అప్పుడప్పుడు కామెడీ కోసం ఫోన్ లోనే మంత్రాలు చదివి పెళ్లిళ్లు లేదా ఇతర కార్యక్రమాలు జరిపించిన సంఘటనలు అనేకం ఉన్నాయి.అయితే నిజ జీవితంలో కూడా అచ్చం అలాంటి తతంగమే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్మార్ట్ ఫోన్ లో వీడియో కాల్ ద్వారా నిశ్చితార్థ వేడుకలను జరుపుకున్నారు వధువు మరియు వరుడు కుటుంబ సభ్యులు.. దీంతో ఇది తెగ వైరల్ అయిపోతుంది. ఆ వేడుకల వీడియోపై మీరు ఓ లుక్కేయండి...
స్మార్ట్ ఫోన్లలో..
మన దేశంలో సాధారణంగా నిశ్చితార్థం వేడుకలను వధువు, వరుడు ఇద్దరు కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య జరుపుకుంటారు. కొంతమంది ఎంగేజ్ మెంట్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. మధ్యతరగతి ప్రజలు సింపుల్ గా జరుపుకుంటారు. అయితే స్మార్ట్ ఫోన్ల సహాయంతో పెళ్లికుమారుడు.. పెళ్లి కూతురు ఇద్దరినీ పక్కన పెట్టి ఎంగేజ్ మెంట్ జరపడం బహుశా ఇదే మొదటిసారి.

ఇప్పటివరకు సినిమాల్లో..
ఇలాంటి ఆన్ లైన్ నిశ్చితార్థం వేడుకలు వంటివి సినిమాల్లో కూడా రాలేదు. అంతేకాదు టెక్నాలజీలో ముందుండే విదేశీయులు కూడా ఇలాంటివి ప్రయత్నించలేదు. అయితే మన తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాల్లో ఫోన్లలో మంత్రాలు చదువుతూ పెళ్లి జరిపించిన.. జరిగిన సంఘటనలను మనం చూసే ఉంటాం.

స్మార్ట్ ఫోన్ కు చీర..
ఈ వేడుకలను చూస్తే కచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. పెళ్లికూతురు ఉండే ఫోన్ పైనే చీరను సైతం సమర్పించారు. మరి వారిద్దరికీ చేతికి ఉంగరాలు కూడా ఫోన్లతోనే మార్పించారేమో అని కొందరు నెటిజన్లు అంటున్నారు.

సోషల్ మీడియాలో..
ఈ నిశ్చితార్థ వేడుకల వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. నిశ్చితార్థమే ఆన్ లైన్ లో చేస్తే.. ఇంకా పెళ్లి.. ఆ తర్వాత ఘట్టాలన్నీ కూడా ఆన్ లైన్ లోనే చేస్తారేమో అని కామెంట్ చేస్తున్నారు.

భవిష్యత్తులో అన్నీ ఆన్ లైన్ లోనే..
ఇది చూసిన మరి కొందరు నెటిజన్లు.. భవిష్యత్తులో ఆన్ లైన్ లోనే అన్ని పనులు చేసేటట్టు ఉన్నారు అని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో మరికొన్ని పెళ్లిళ్లు.. నిశ్చితార్థాలు మిగిలిన కార్యక్రమాలన్నీ ఆన్ లైన్ లోనే జరుపుకుంటారని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications