Just In
- 2 hrs ago
Today Rasi Palalu 31January 2023: ఈ రోజు కన్యా రాశి వారు మౌనంగా ఉండటం వల్ల మీ మధ్య అపార్థం పెరుగుతుంది
- 10 hrs ago
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- 11 hrs ago
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- 12 hrs ago
హీమోగ్లోబిన్ తక్కువైతే ప్రమాదమే..కార్డియాక్ అరెస్ట్ కు కారణం అవుతుంది. కాబట్టి, ఈ ఆహారాలు తినండి..
Viral Video : వైరల్ వీడియో: మీటింగ్ లో ఫుల్ బిజీ, క్రీమ్ కేక్ తింటూ ఎంజాయ్ చేసిన ఎలుక..!
ఈ ఫాస్ట్ ఫార్వాడింగ్ యుగంలో సోషల్ మీడియా చాలా బాగా ఉపయోగపడుతుంది, ప్రపంచంలోని నలుమూలల నుండి సమాచారం వీడియోల ద్వారా ప్రజలకు త్వరగా చేరతాయి. అవి కూడా చాలా త్వరగా ప్రజల ప్రశంసలు పొందుతారు. ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు విపరీతంగా స్పందిస్తుంటారు.
ఒక వైరల్ వీడియోలో, మీటింగ్ సమయంలో టేబుల్‌పై ఉంచిన కేక్‌ను ఎలుక తింటున్న వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో నలుగురైదుగురు సీరియస్‌గా మీటింగ్‌ను చూస్తున్నారు. ఈ సమయంలో, టేబుల్‌పై ఉంచిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బొకేలో దాక్కుని ఉన్న ఎలుక దాని పక్కన ప్లేట్‌లో ఉంచిన కేక్‌ను తింటూ వీడియోలకు దర్శనమిచ్చింది. ఈ దృశ్యం కెమెరాకు చిక్కడంతో వైరల్‌గా మారింది. కెమెరా జూమ్ చేసినప్పుడు, ఒక మౌస్ అతిథి కోసం టేబుల్‌పై ఉంచిన కేక్‌ను తింటూ కనిపిస్తుంది. "సమావేశంలో ఎలుక" అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేయబడింది.
Rat in the meeting... pic.twitter.com/I0cF6Lz8gZ
— Dr Arif Khawaja MDS (@DrArifKhawaja) December 5, 2022
వీడియోను ఇక్కడ చూడండి:
డిసెంబర్ 5న పోస్ట్ చేసిన ఈ వీడియో ట్విటర్‌లో 22,000 మందికి పైగా వీక్షణలను సంపాదించుకుంది. బోలెడంత మంది లైక్ కూడా చేశారు. దీనిపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించారు. ఎలుకను కూడా సభకు ఆహ్వానిస్తారంటూ ఓ నెటిజన్ చమత్కరించాడు. ఆ వీడియో చూసి విసిగిపోయిన మరొకరు "అయ్యో" అని రాశారు. మరో నెటిజన్, "ఎలుక సమానంగా పాల్గొంటోంది" అని వ్యాఖ్యానించారు. అయితే, ఈ వీడియో ఎక్కడిది అనే సమాచారం అందుబాటులో లేదు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.