Latest Updates
-
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!
Viral Video:పెళ్లికూతురు ‘బుల్లెట్టు బండి’ స్టెప్పులు అదరహో... అస్సలు మిస్సవొద్దు...
తెలంగాణ పెళ్లితూరు బరాత్ సందర్భంగా బుల్లెట్ బండి సాంగ్ కు వేసిన స్టెప్టులు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయాయి.
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనే వేడుక ఎంతో కీలకం. జీవితంలో ఒకేసారి జరిగే ఈ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తమ పెళ్లి వేడుక అందరికంటే ప్రత్యేకంగా ఉండాలని ఆశిస్తారు.

దీని కోసం ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అవి కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతూ ఉంటాయి. నిమిషాల వ్యవధిలోనే కోట్ల మంది వీక్షిస్తుంటారు. అలాంటి ఓ వీడియో మళ్లీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియో తాజాగా మస్తు వైరల్ అయ్యింది. ఇంతకీ అందులో ఏముందంటే.. పెళ్లికొడుక్కి స్వాగతం పలుకుతూ.. ఓ సాంగ్ వస్తుంది. ఆ పాటకు పెళ్లికూతురు డ్యాన్స్ అచ్చం నెమలి నాట్యంలా ఉంది. వాహనం ఎదుట పెళ్లికొడుక్కి స్వాగతం పలుకుతూ తనే పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ అందరిచేత ఔరా అనిపించుకుంది. ఆమె డ్యాన్స్ తో పెళ్లి కొడుకు రెండు స్టెప్పులు కలిపాడు. కానీ తనతో కలిసి మాత్రం డ్యాన్స్ చేయలేక ఆగిపోయాడు. ఎందుకంటే అందమైన మయూరి నాట్యాన్ని చూస్తూ అలా ఉండిపోయాడు. చివర్లో బంధువులు, స్నేహితులు వధువుతో కలిసి పదం, పాదం కలిపారు. అద్భుతంగా ఉంది ఈ వీడియో. తెలంగాణ పాటే.. కానీ ఎక్కడో తెలీదు.. సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తన డ్యాన్స్ ను మెచ్చుకుంటున్నారు. ఆ డ్యాన్స్ వీడియోను మీరు కూడా చూసెయ్యండి..
మార్మోగుతోంది..
అచ్చమైన తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఒక్క యూట్యూబ్ లోనే కాదు ఇతర సోషల్ మీడియా సైట్లలోనూ మార్మోగుతుంది. తెలంగాణల పెళ్లి బరాత్ అన్నా.. ఇతర ఏ కార్యక్రమాలైనా జానపద పాటల ధూం ధాం ఉంటది. దాని గురించి సపరేటుగా చెప్పే పనిలేదు. అయితే పెళ్లి ముచ్చట రాగానే అందరికీ గుర్తొచ్చేది ఊరేగింపు. ఆ సమయంలోనే డీజేలు, డ్రమ్స్ పెట్టి మాస్ పాటలతో జోరుగా హుషారుగా ఉర్రూతలూగించే డ్యాన్సులు వేస్తుంటారు. బంధువులు, కుటుంబసభ్యులు, స్నేహిలంతా కలిసి హంగామా చేస్తుంటారు.

వధూవరుల డ్యాన్స్..
అందులో భాగంగా కొత్త జంటతో డ్యాన్స్ చేయించడం వంటివి చేస్తుంటారు. తాజాగా ఓ తెలంగాణ జానపద పాటకు కొత్త పెళ్లికూతురు పెళ్లికొడుకును ఆహ్వానిస్తూ చేసిన డ్యాన్స్ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. ఈ డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది.

ఎవరు పాడారంటే..
'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా' అనే ఈ పాటకు యూ ట్యూబులో 3 కోట్లకు పైగా వీవ్స్ ఉన్నాయి. 3.5 లక్షల లైకులు, 14 వేల కామెంట్లు వచ్చాయంటే ఇది ఎంత సూపర్ హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాట రాసింది సాహిత్య రచయిత లక్ష్మణ్.. 'ఓ నా కాబోయే శ్రీవారూ, నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా' పద అంటూ సరదాగా మొదలుపెట్టి తన గురించి చెప్పుకునే ఈ పాటను ప్రముఖ గాయని మోహన్ భోగరాజు పాడారు. ఎస్ కే బాజి సంగీతం అందించారు. ఈ పాట ఇదే ఏడాది ఏప్రిల్ ఏడో తేదీన రిలీజైంది.



Click it and Unblock the Notifications