Latest Updates
-
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే!
Valentine's Day 2023: వాలెంటైన్స్ డే రోజు లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలనుకుంటున్నారా? ఇవే బెస్ట్ రూట్స్
లవర్ తో కలిసి అద్భుతమైన క్షణాలను ఆస్వాదించడానికి ఈ రూట్స్ లో రొమాంటిక్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేయండి. కపుల్స్ లేదా లవర్స్ వెళ్లడానికి దేశంలోని బెస్ట్ రొమాంటిక్ రూట్స్ గురించి తెలుసుకోండి.
లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టపడని అమ్మాయి ఉండదనే అనాలి. ఏ అమ్మాయిని కదిలించినా వారి లాంగ్ డ్రైవ్ కోరిక బయటపెడుతుంటారు. స్నేహితులతో లవర్స్ తో కలిసి లాంగ్ డ్రైవ్ చేయాలని చాలా మంది అమ్మాయిలు కలలుగంటారు. బాయ్ ఫ్రెండ్ ముందు కూర్చొని బైక్ నడుపుతుంటే వెనకే కూర్చొని గట్టిగా హత్తుకొని కూర్చుంటూ లేదంటే కారులో పక్కనే కూర్చొని మేఘాలలో తేలిపోమ్మన్నది అనే సాంగ్ బ్యాగ్రౌండ్ లో ప్లే అవుతుంటే అలా అలా లాంగ్ డ్రైవ్ చేయడం ఏ అమ్మాయైనా చాలా ఇష్టపడుతుంది.

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజు మీ ప్రియమైన వారికి అలాంటి ఓ మధురానుభూతి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లైతే వీటిని ఒకసారి పరిశీలించండి. మీరు, మీ లవర్ తో కలిసి అద్భుతమైన క్షణాలను ఆస్వాదించడానికి ఈ రూట్స్ లో రొమాంటిక్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేయండి. కపుల్స్ లేదా లవర్స్ వెళ్లడానికి దేశంలోని బెస్ట్ రొమాంటిక్ రూట్స్ గురించి తెలుసుకోండి.
వైజాగ్ - అరకులోయ:
విశాఖపట్నం నుండి అరకు వ్యాలీకి వెళ్లే రోడ్డు ఆంధ్రప్రదేశ్ లోని చాలా పాపులర్ లాంగ్ డ్రైవ్ రూటు. దాదాపు 120 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఘాట్ రోడ్డు ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. కొండలు, లోయలు గుండా ప్రయాణం చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ప్రకృతి రమణీయత విశేషంగా ఆకట్టుకుంటుంది. నేచర్ ను ఆస్వాదించాలనుకుంటే అక్కడక్కడ ఆగి వీక్షించవచ్చు. సెల్ ఫోన్లో ఫుల్ ఛార్జ్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఆగి ఫోటోలు తీసుకోవాలనిపిస్తుంది.
విజయవాడ-మచిలీపట్నం:
విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్లే రహదారి ఆంధ్రప్రదేశ్ లోని మోస్ట్ సీనిక్ డ్రైవ్ లలో ఒకటి. ఈ డ్రైవ్ దాదాపు 60 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. మధ్యమధ్యలో ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. సుందరమైన గ్రామాలు, పచ్చని పొలాలు, నిర్మలమైన చెరువులు, కాల్వలు కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల అందాలను చూడటానికి, అక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి ఈ రోడ్డులో మీ లైఫ్ పార్ట్‌నర్‌తో లేదా లవర్‌తో రొమాంటిక్ లాంగ్ డ్రైవ్ కు వెళ్లండి.
మహబూబ్‌నగర్ - కర్నూలు:
కర్నూలు - మహబూబ్‌నగర్ వెళ్లే రహదారి లాంగ్ డ్రైవే ఏం కాదు. కానీ ఈ రూట్‌లో మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ దారిలో వెళ్తుంటే రొమాంటిక్ ఫీల్ వచ్చేస్తుంది. అద్భుతమైన ప్రకృతి ఆకట్టుకుంటుంది. నల్లమల అటవీ శ్రేణి గుండా ఈ రోడ్డు ఉంటుంది. కొండల్లో, లోయల్లో ప్రయాణం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. నేచర్ ను చూసి ఎంజాయ్ చేయడానికి ఈ దారిలో తప్పకుండా వెళ్లాల్సిందే. మార్గ మధ్యంలో కడెం డ్యామ్ కూడా ఉంటుంది. ఇది రొమాంటిక్ విహార యాత్రకు గొప్ప ప్రదేశం. మీ లవర్ తో ఇక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయండి.
హైదరాబాద్ - వరంగల్:
హైదరాబాద్ నుండి వరంగల్ కు వెళ్లే దారి నాలుగు లేన్ల రోడ్డు. ఇది లాంగ్ డ్రైవ్ కు చాలా అనుకూలంగా ఉంటుంది. చారిత్రాత్మకమైన వరంగల్ నగరం గుండా వెళ్లొచ్చి. తెలంగాణలోని ఆకర్షణీయమైన స్మారక చిహ్నాలు, దేవాలయాలు దారి పొడవునా కనిపిస్తాయి. ఇక్కడ దొరికే స్థానిక వంటకాలను రుచి చూడొచ్చు. దారిలో అనేక దాబాలు, రెస్టారెంట్లు ఉంటాయి.
నల్గొండ - హైదరాబాద్:
హైదరాబాద్ - నల్గొండ రహదారి చాలా రొమాంటిక్ గా ఉంటుంది. దాదాపు 100 కిలోమీటర్ల ఈ రోడ్డు మీకు, మీ లవర్ కు మంచి అనుభూతిని అందిస్తుంది. మధ్యమధ్యలో వచ్చే గ్రామీణ ప్రాంతాలు ఆకట్టుకుంటాయి. గ్రామాలు, ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. మార్గ మధ్యంలో నాగార్జున సాగర్ డ్యామ్ కు కూడా వెళ్లొచ్చు. ఇది దేశంలోని అతిపెద్ద డ్యామ్‌లలో ఒకటి.



Click it and Unblock the Notifications
