For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2020 స్వాతంత్ర్య దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకునేందుకు 10 మార్గాలు

స్వాతంత్య్రం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయులందరూ ఆనాటి త్యాగమూర్తులను స్మరించుకుని, వారికి అంజలి ఘటించే రోజు. ఎందుకంటే సరిగ్గా ఆగస్టు 15వ తేదీ నుంచి ఆనాటి అమరవీరుల త్యాగఫలం వల్లనే మన దేశం స్వేచ్

|

బ్రిటీష్ వారి పాలన నుండి భారతదేశానికి 1947 ఆగస్టు 15న విముక్తి లభించింది. మన దేశ తొలి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ ప్రకటనతో భారతీయులకి సూర్యోదయం అయ్యింది. ఆనాటి నుండి నేటి వరకు ఎన్నో ఒడిదుడుకులను, సవాళ్లను, సంక్షోభాలను ఎదుర్కొంటూ వచ్చిన మనం ఈ సంవత్సరం 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము.

స్వాతంత్య్రం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయులందరూ ఆనాటి త్యాగమూర్తులను స్మరించుకుని, వారికి అంజలి ఘటించే రోజు. ఎందుకంటే సరిగ్గా ఆగస్టు 15వ తేదీ నుంచి ఆనాటి అమరవీరుల త్యాగఫలం వల్లనే మన దేశం స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంది. కాబట్టి స్వాతంత్య్ర దినోత్సవం ఎంత ముఖ్యమో భారతీయుల సంబరాలను బట్టి ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను కేవలం 10 రకాలుగా ఎలా జరుపుకోవచ్చో చెప్పడం తక్కువే.

Independence Day

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో శైలిలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు

మన దేశంలోని ఉండే రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో శైలిలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను జరుపుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి ఉపన్యాసంతో వేడుకలు జరుపుకుంటే దక్షిణాది రాష్ట్రాలు మాత్రం తమదైన శైలిలో వేడుకలు జరుపుకుంటాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, అధికారులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు సహా ఇతర రంగాలలో ఖ్యాతి పొందిన వారు సైతం వారి వారి శైలిలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఢిల్లీలో త్రివిధ దళాలు చేసే విన్యాసాలు ప్రతి ఏటా ప్రతి ఒక్క భారతీయుడిని ఆకట్టుకుంటాయి.

1) కనువిందు చేసే కవాతు

1) కనువిందు చేసే కవాతు

మీరు దేశ రాజధాని ఢిల్లీలో నివాసముంటారా? అక్కడుండే వారు మాత్రం 10 రకాలుగా ఎలా జరుపుకోవాలో అని చింతించే పనేలేదు.

ఎందుకంటే రాజధాని నగరంలో జరిగే అద్భుత వేడుక కవాతు. ఇది ఎంత కనులవిందుగా ఉంటుందంటే ఆ కవాతును చూస్తున్నంతసేపు మనలో రోమాలు మనకే తెలియకుండా నిక్కబొడుచుకుంటాయి. ఇలాంటి అద్భుతమైన కవాతు వేడుకలను మీరు ప్రత్యక్షంగా చూడాలనుకుంటే రాజధాని వెళ్లి ఒకసారి ప్రయత్నించండి.

2) స్కూళ్లలో ఫంక్షన్లు

2) స్కూళ్లలో ఫంక్షన్లు

అదే విద్యార్థులయితే గనుక స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల నిమిత్తం ఇప్పటికే రిహార్సల్ లో పూర్తిగా నిమగ్నమయ్యింటారు. ముందుగా జెండా వందనం, తర్వాత ఉపాధ్యాయుల ఉపన్యాసం ఉంటాయి. ఆ తరువాత అసలు సిసలైన సాంస్కృతిక కార్యక్రమాలు, నాటక ప్రదర్శనలు, దేశభక్తి పాటలతో పాటు ఇంకా మరెన్నో కార్యక్రమాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తుంటారు.

3) మీరే వేడుకలను జరపొచ్చు

3) మీరే వేడుకలను జరపొచ్చు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మీరే ఎలా జరుపుకోవచ్చంటే.. మీ ఇంటి దగ్గర్లో ఉండే మైదానంలో కాని, విశాలంగా ఉండే ప్రాంతంలో కాని చిన్నారులను ఆహ్వానించి జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను జరుపుకోవచ్చు. అనంతరం ఆ చిన్నారులకు మిఠాయిలు వంటివి పంచితే వారు మరింత సంతోష పడతారు.

4) అపార్ట్ మెంట్లలో జెండా వందనం

4) అపార్ట్ మెంట్లలో జెండా వందనం

మీరు నివాసముండే అపార్ట్ మెంట్లలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రతి ఏటా జరుపుతున్నారా? కనీసం జెండా వందనం అయినా చేస్తున్నారా? ఒకవేళ అలా ఎవ్వరూ చేయకపోతే మీరే చొరవ తీసుకుని ఆ సంబరాలను జరిపించండి. ఎవరినైనా పెద్దవారిని ఉపన్యాసం ఇవ్వమని కోరండి. చిన్నపిల్లలకు చాక్లెట్లు, స్వీట్లు పంచి సరాదాగా జరుపుకోండి.

5) అనాధ, వృద్ధాశ్రమాలను సందర్శించండి..

5) అనాధ, వృద్ధాశ్రమాలను సందర్శించండి..

అనాధలు, వృద్ధుల ఆశ్రమాలకు వెళ్లండి. వారితో కలిసి భోజనం చేయండి. వారికి కూడా స్వీట్లు పంచండి. అప్పుడు వారి కళ్లలో ఆనందం చూడండి. అప్పుడు మీకెంత హాయిగా అనిపిస్తుందో మీకే తెలుస్తుంది. అంతేకాదు మీకు తోచినంత సహాయం చేయండి. వారి నుండి ఆశీర్వాదాలు పొందండి.

6) మొక్కలు నాటడం..

6) మొక్కలు నాటడం..

మీరు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రకృతితో పంచుకోండి. మీ స్నేహితులతో, మీ చుట్టుపక్కల వారితోనో కలిసి మొక్కలు నాటండి..

వారితోను మొక్కలను నాటించండి. అలా పచ్చని ప్రకృతికి సైతం తోడ్పడండి.

7) చిన్నారులకు పలు రకాల పోటీలు..

7) చిన్నారులకు పలు రకాల పోటీలు..

మీ ఇంటి దగ్గర లేదా అపార్ట్ మెంట్లో ఉండే చిన్నారులకు ముగ్గులు, డ్రాయింగ్, ఆటల పోటీల కార్యక్రమాలను నిర్వహించండి. చిన్నపిల్లల్లలో చాలామందికి పెయింటింగ్, డ్రాయింగ్ పోటీలతో పాటు ఆటల పోటీలంటే చాలా ఇష్టం. కాబట్టి వారిలో ప్రతిభను వెలికి తీసి వారిని ఉత్సాహపరచండి. విజేతలకు బహుమతులు ఇవ్వండి.

8) సాంస్కృతిక కార్యక్రమాలు..

8) సాంస్కృతిక కార్యక్రమాలు..

స్వాతంత్య్ర దినోత్సవం రోజున పాఠశాలలు, కళాశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం సర్వసాధారణం. కాబట్టి ఈసారి మీరే మీ చుట్టుపక్కల వారితో నిర్వహించి చూడండి. అందులో బాగా ఆకట్టుకున్న వారికి బహుమతులు ఇవ్వండి. పాల్గొన్న వారికి కూడా చిన్న గిఫ్ట్ లు ఇస్తే వారంతా సంతోషంగా ఫీలవుతారు.

9) మీరు ఓ కవాతు నిర్వహించండి..

9) మీరు ఓ కవాతు నిర్వహించండి..

రాజధాని నగరం ఢిల్లీలో కవాతుని టీవీలో చూసి ప్రత్యక్షంగా చూడలేకపోతున్నామని బాధపడకండి. మీరు కూడా మీ చుట్టుపక్కల చిన్నారులతో ఓ కవాతు నిర్వహించండి. ఇందుకు భారతీయులైన ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి సహకరిస్తారు. ముందుగా ఉదయాన్నే అందరూ ఒకచోట చేరుకుని దేశభక్తి పాటలను పాడండి. ఈ విధంగా మీరే చొరవ చూపండి.

10) అందరితో కలిసి భోజనం చేయండి..

10) అందరితో కలిసి భోజనం చేయండి..

మీరు బిజీ లైఫ్ లో ఉండి మీ ఇంట్లోని వారితో సరదాగా గడిపేందుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే స్వాతంత్య్ర దినోత్సవం రోజున తప్పకుండా మీకు మీ వారితో కలిసే అవకాశం వస్తుంది. కాబట్టి లంచ్ లేదా డిన్నర్ కి ఏదైనా రెస్టారెంట్ లేదా హోటల్ కు తీసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరచండి.

English summary

10 Ways To Celebrate Independence Day 2020

The Independence Day is a day when all Indians commemorate the sacrifices of the day. Because right from the 15th of August, the martyrdom sacrifice of our country has consumed the gases of freedom. So Independence Day is as important as Indians can imagine. Against this backdrop, it is easy to tell how 10 Independence Day celebrations can be celebrated.Independence Day is celebrated in a different style in each of the states in our country. If the Prime Minister's address in the nation's capital, Delhi, is being celebrated, the southern states will have their own style.
Desktop Bottom Promotion