For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Weekly Horoscope : ఈ వారం మీ రాశి ఫలాలు ఏప్రిల్ 3 నుండి 9వ తేదీ వరకు..

రాశులను బట్టి వారి దిన, వార ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల ఉద్యోగులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే లేదా మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ వారం మీకు చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో మీ శ్రమ విజయవంతం అవుతుంది.

Weekly Rashi Phalalu for April 3 to April 9

ఇంకా కొన్ని రాశుల ఉద్యోగాలు మారే వ్యక్తులు పెద్ద కంపెనీలో ఉన్నత స్థానం పొందొచ్చు. ఈ కాలంలో రిటైల్ వ్యాపారులు తమ నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఇలా అన్ని రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది? ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.. ఏయే రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది.. అన్ని రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...

April Horoscope 2022: ఏప్రిల్ నెలలో ఈ రాశుల వారికి కష్టాలు.. తస్మాత్ జాగ్రత్త..!April Horoscope 2022: ఏప్రిల్ నెలలో ఈ రాశుల వారికి కష్టాలు.. తస్మాత్ జాగ్రత్త..!

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

ఈ రాశి వారిలో ఈ వారం వ్యాపారులకు చాలా మంచి ఫలితాలొస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను అందిస్తాయి. ఈ కాలంలో మీ వ్యాపారం రెండింతలు వేగంగా వృద్ధి చెందుతుంది. మరోవైపు, ఉద్యోగుల ప్రగతికి కొత్త మార్గాలు తెరవబడతాయి. మీ పనితీరులో పెద్ద మెరుగుదల ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం మీకు చాలా ఖరీదైనది. ఈ కాలంలో మీరు పాత బిల్లును చెల్లించాల్సి రావచ్చు. అంతే కాకుండా వారం మధ్యలో ఆర్థిక పరంగా నష్టాలు రావొచ్చు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఆరోగ్య పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలొస్తాయి.

లక్కీ కలర్ :ఎల్లో

లక్కీ నంబర్ : 30

లక్కీ డే : మంగళవారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ రాశి వారిలో ఉద్యోగులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే లేదా మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ వారం మీకు చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో మీ శ్రమ విజయవంతం అవుతుంది. ఉద్యోగాలు మారే వ్యక్తులు పెద్ద కంపెనీలో ఉన్నత స్థానం పొందొచ్చు. ఈ కాలంలో రిటైల్ వ్యాపారులు తమ నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ :బ్రౌన్

లక్కీ నంబర్ : 2

లక్కీ డే :శనివారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారిలో గుండె జబ్బులు ఉన్నవారు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మీ ఆరోగ్యం క్షీణించొచ్చు. కోపం మరియు ఒత్తిడికి దూరంగా ఉండండి. మరోవైపు ఈ వారం పని చేసే వ్యక్తులకు చాలా బిజీగా ఉంటుంది. ఈ కాలంలో పెండింగ్ పనుల భారం పెరగొచ్చు. బాస్ దృష్టి కూడా మీపైనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలి. బంగారం మరియు వెండి వ్యాపారం చేసే వారికి ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ డే :ఆదివారం

ఈ 7 వాస్తు దశలతో మీ విశ్వాసాన్ని పెంచుకోండి మరియు జీవితంలో విజయం సాధించండి...ఈ 7 వాస్తు దశలతో మీ విశ్వాసాన్ని పెంచుకోండి మరియు జీవితంలో విజయం సాధించండి...

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ వారం వస్త్ర వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీ వ్యాపారం అకస్మాత్తుగా వృద్ధి చెందుతుంది. మీరు ఆన్‌లైన్‌లో వ్యాపారం చేస్తే, మీరు పెద్ద లాభాలను ఆశించొచ్చు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారికి ఈ సమయం చాలా అదృష్టంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఈ కాలంలో పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ విశ్వాసం తగ్గొచ్చు. అయితే ఇలాంటి సమస్యల గురించి ఆందోళన చెందకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు ఉత్సాహాన్ని కొనసాగించడానికి, మీరు మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇవ్వాలి. మీరు వారి భావాలను గౌరవించాలి. ఆరోగ్య పరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 16

లక్కీ డే : సోమవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ వారం సేల్స్ మరియు మార్కెటింగ్‌కు సంబంధించిన పని చేసే వారికి ఈ వారం చాలా కష్టంగా ఉంటుంది. ఈ కాలంలో మీ మార్గంలో చాలా అడ్డంకులు ఉండొచ్చు. మీకు చాలా అలసిపోయినట్లు మరియు భారంగా అనిపించొచ్చు. మీరు కొత్తగా ప్రారంభించాలి. సానుకూలంగా ఉండండి మరియు కష్టపడి పని చేయండి. మీరు కచ్చితంగా ఆశించిన ఫలితాన్ని పొందుతారు. మరోవైపు వ్యాపారస్తులు కోర్టు కేసుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో చిన్నపాటి అజాగ్రత్త వల్ల ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ కాలంలో పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయం మళ్లీ తలెత్తొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో గొడవలు పెట్టుకోకుండా శాంతియుతంగా పనిచేయాలి. ఆర్థిక పరంగా ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలొస్తాయి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 26

లక్కీ డే : శుక్రవారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారిలో ఈ వారం ప్రభుత్వ శాఖలో పనిచేసే వారికి చాలా అదృష్టకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ప్రమోషన్ పొందొచ్చు లేదా మీరు కోరుకున్న బదిలీని పొందవచ్చు. వారంలో ప్రారంభ రోజులు చిరు వ్యాపారులకు చాలా లాభదాయకంగా మారనున్నాయి. అయితే వారం చివరి రెండు రోజుల్లో మీరు ఆశించిన ఫలితాలు అందుకోలేరు. వ్యాపారంలో ఈ విధమైన ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. మీ ఆర్థిక ప్రయత్నాలు సఫలం కావొచ్చు. మీరు మంచి ఆదాయ వనరులను పొందే అవకాశం ఉంది. అయితే, మీరు ఆలోచించకుండా మీ ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ :రోజ్

లక్కీ నంబర్ : 30

లక్కీ డే :బుధవారం

ఈ 5 రాశుల వారు పైకి తియ్యగా మాట్లాడుతారు..! కానీ పర్యవసనం వేరుగా ఉంటుంది...ఈ 5 రాశుల వారు పైకి తియ్యగా మాట్లాడుతారు..! కానీ పర్యవసనం వేరుగా ఉంటుంది...

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు చర్చకు దూరంగా ఉండాలి. లేకపోతే మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ వారం పని విషయంలో మీకు చాలా బిజీగా ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తే, ఈ కాలంలో పెండింగ్ పని భారం పెరిగే అవకాశం ఉంది. ఇది కాకుండా, ఉన్నతాధికారులతో మీ సాన్నిహిత్యం క్షీణించొచ్చు. మీరు మీ ప్రవర్తనలో మృదువుగా ఉండాలి లేకుంటే మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోవచ్చు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు తమ భాగస్వామిపై బలమైన విశ్వాసాన్ని ఉంచుకోవాలి. అనవసర సందేహాలు వ్యాపారంలో నష్టాన్ని కలిగిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్య పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ డే : గురువారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని పెద్ద ఒప్పందాలు చేసుకోవచ్చు. ఈ కాలంలో ఉద్యోగస్తులు అదనపు బాధ్యతల భారాన్ని మోయాల్సి రావచ్చు. మీ సామర్థ్యాన్ని పరీక్షించడానికి బాస్ మీకు కొన్ని ముఖ్యమైన పనులను అప్పగించొచ్చు. మీరు శ్రద్ధగా పని చేయడం మంచిది. ఎంత కష్టపడి పని చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో తొందరపడి ఏ పని చేయకండి. ఈ కాలంలో రుణాలు ఇవ్వడం మానుకోవాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 42

లక్కీ డే : ఆదివారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ రాశి వారు ఈ వారం కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, ఖచ్చితంగా పెద్దల సలహా తీసుకోండి. ఈ సమయంలో, జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తనలో కొన్ని మార్పులు చూడొచ్చు. మీ ప్రియమైన వారు మిమ్మల్ని విస్మరిస్తున్నారని మీరు భావిస్తారు. అటువంటి పరిస్థితిలో, సంభాషణ ద్వారా మీ మధ్య పులుపును తగ్గించడానికి ప్రయత్నించండి. ఆర్థికంగా, ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో, ఇప్పుడు మీరు పొదుపుపై ​​ఎక్కువ దృష్టి పెట్టగలరు. ఈ సమయంలో మీరు మీ పురోగతికి సంబంధించిన సంకేతాలను కూడా పొందుతారు. ఆరోగ్య పరంగా, ఈ వారం అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 25

లక్కీ డే : శనివారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ఉద్యోగం లేదా వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశీ కంపెనీలలో పనిచేసే వారికి ఈ వారం సవాలుగా ఉంటుంది. మరోవైపు, మీ వ్యాపారం విదేశాలలో విస్తరించి ఉంటే, ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇంటి సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత నెలకొంటాయి. మీరు మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇవ్వగలరు. ఈ కాలంలో మీరు మీ ప్రియమైనవారితో కలిసి ప్రయాణించే అవకాశాన్ని కూడా పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తారు. అలాగే వారం చివరిలో మీరు కొన్ని విలువైన వస్తువులు పొందవచ్చు. ఈ కాలంలో ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 2

లక్కీ డే : బుధవారం

కుంభ రాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభ రాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి పురోభివృద్ధి కాలం కొనసాగుతోంది. ఈ కాలంలో మీరు ఉన్నత స్థానాన్ని పొందొచ్చు. అలాగే మీ ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో ప్రయివేటు ఉద్యోగాలు చేసే వారి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. వైద్య సంబంధిత పనులు చేసే స్థానికులు ఈ కాలంలో విపరీతమైన లాభాలను పొందొచ్చు. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటే, ఇది సరైన సమయం. ఈ కాలంలో జీవిత భాగస్వామి కొన్ని గొప్ప విజయాలు సాధించగలరు. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని సానుకూల మార్పులు కూడా రావచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ :క్రీమ్

లక్కీ నంబర్ : 19

లక్కీ డే :మంగళవారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈ కాలంలో తమ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లొచ్చు. వారం చివరిలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం చాలా కీలకం కానుంది. మీరు గొప్ప పురోగతిని సాధించగలరు. మీరు ఉద్యోగంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే, తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి, మీరు ఆలోచించకుండా ఖర్చు చేయకుండా ఉండాలి. వారం చివరిలో మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 14

లక్కీ డే : ఆదివారం

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... వీటి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అన్న విషయాలను పాఠకులు గమనించగలరు.

English summary

Weekly Rashi Phalalu for April 3 to April 9

In the year 2022, First Week of April will be special. Read your weekly horoscope to know what lies ahead for all the 12 zodiac signs.
Story first published:Sunday, April 3, 2022, 8:16 [IST]
Desktop Bottom Promotion