For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 2 నుండి 8వ తేదీ వరకు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

సమయం మన జీవిత పాఠాన్ని బోధిస్తుంది. మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు ఏర్పడుతాయి. మార్పు నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం అంగీకరించాలి.

Weekly Rashi Phalalu

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం చాలా గ్రహల్లో మార్పులు జరుగుతాయి మరియు రాశిచక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా ఉంటుంది. మీ జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి...

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో మంచిగా ఉంటుంది. మీరు నిరంతరం కష్టపడి పని చేయడం వల్ల మీరు సరైన ఫలితాలను పొందవచ్చు. వ్యాపారులు ఏదైనా కొత్త పనిని ఈ వారం ప్రారంభించవచ్చు. అయితే పని ప్రారంభించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు ఈ వారం ఉద్యోగావకాశాలు రావచ్చు. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీరు ఈ వారం ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఈ వారం కొన్ని విషయాల్లో రాజీ పడాల్సిందే. ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. అయితే ఎక్కువ ఖర్చులు కూడా చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్: వైట్

లక్కీ నంబర్ :29

లక్కీ డే : ఆదివారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ వారం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ భాగస్వామితో కొన్ని విషయాల్లో గొడవ పడొచ్చు. దీని వల్ల మీ ఇద్దరి మధ్య దూరం పెరగొచ్చు. పెళ్లి కాని వారు వివాహ నిర్ణయం తీసుకోవడానికి ఈ వారం సమయం అనుకూలంగా లేదు. కాబట్టి తొందరపడకండి. మీ జీవిత భాగస్వామితో మీకు విభేదాలు ఉన్నప్పటికీ, మీరు దానిని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. పని విషయంలో మంచిగా ఉంటుంది. ఈ వారం ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ :11

లక్కీ డే : శుక్రవారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం కొన్ని విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. అయితే కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. పెళ్లి కాని వారు, మీరు వివాహం గురించి ఆలోచిస్తుంటే మీ కుటుంబంతో మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు. ఈ వారం మీకు మంచిగా ఉండొచ్చు. మీరు ఊహించిన విధంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీరు ఈ సమయంలో పెద్ద లాభాలను పొందే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 6

లక్కీ డే : గురువారం

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ రాశి వారు ఈ వారం ఆరోగ్యంగా ఉంటారు. మీరు పూర్తి ఉత్సాహంతో పనులన్నీ వేగంగా పూర్తి చేస్తారు. ప్రేమ విషయంలో సహనంతో ఉండటం ఎంత ముఖ్యమో మీరు గ్రహిస్తారు. మీ భాగస్వామిని అనవసరంగా అనుమానించడం ద్వారా మీరు వారి భావాలను గాయపరచవచ్చు. ఇది మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచవచ్చు. వైవాహిక జీవితం ఈ వారం బాగానే ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉంటుంది. మీరు ఈ కాలంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :18

లక్కీ డే : మంగళవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది. ఈ వారం మీరు సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ వారం మీరు చాలా కష్టపడి పని చేస్తారు. ఆర్థిక పరంగా ఈ వారం ఎలాంటి సమస్యలు ఉండవు. అనుకున్న సమయానికే ఆదాయం అందుతుంది. అంతేకాదు డబ్బుకు సంబంధించిన కొన్ని శుభవార్తలను వినొచ్చు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :20

లక్కీ డే : శనివారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. అయితే మీరు ప్రణాళిక ప్రకారం పని చేయాలి. పనికి సంబంధించి మీరు ఏదైనా రుణం తీసుకోవాలనుకుంటే, ఎవరైనా మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. ఈ వారం ఎలాంటి పరిస్థితిలో అయినా మీరు ఉత్సాహంతో ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. రొమాన్స్ పరంగా ఈ వారం బాగానే ఉంటుంది. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఈ వారం మీరు చాలా కష్టపడి పని చేయాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :14

లక్కీ డే : బుధవారం

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ రాశి వారు ఈ వారం వ్యక్తిగత జీవితంపై శ్రద్ధ వహించాలి. ఈ వారం ఇంట్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటారు. బ్యాంకు, మీడియా లేదా ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు ఈ వారం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అయితే వ్యాపారస్తులకు మాత్రం ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వీరు చాలా బిజీగా ఉంటారు. ప్రేమ విషయంలో మీ సంబంధం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అయితే అనవసర ఖర్చులు చేయకుండా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ :5

లక్కీ డే : ఆదివారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ వారం ఈ రాశి వారు ప్రేమతో పాటు వ్యాపారం వంటి విషయాలపై శ్రద్ధ పెడతారు. వ్యాపారంలో ఈ సమయంలో మీకు ఎక్కువ లాభాలు రావచ్చు. అయితే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీ ప్రత్యర్థులు చాలా చురుకుగా ఉంటారు. మీరు వ్యాపారం విషయంలో ఎవ్వరినీ ఎక్కువగా నమ్మకండి. పని విషయంలో ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. అయితే రోజువారీ ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :25

లక్కీ డే : గురువారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పని విషయంలో మీరు ఈ వారం కష్టపడాలి. ఉద్యోగం చేసే వారు ఈ కాలంలో మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు ఉద్యోగం మార్చాలని అనుకుంటున్నా.. లేదా కొత్త వాటి కోసం ప్రయత్నిస్తున్నా మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు శాంతియుతంగా పని చేయాలి. ఆర్థికపరంగా కొంత నష్టం రావచ్చు. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఆరోగ్యం విషయంలోనూ కొన్ని ఇబ్బందులు రావచ్చు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :10

లక్కీ డే : ఆదివారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ రాశి వారికి ఈ వారం కెరీర్ పరంగా ఎలాంటి ఆందోళన ఉన్నా కూడా పెద్దల నుండి లేదా దగ్గరి వారి నుండి సలహా తీసుకోవాలి. వ్యాపారస్తులకు ఈ వారం కొంత నిరాశ ఉండొచ్చు. అయితే మీరు నిరుత్సాహాపడాల్సిన అవసరం లేదు. ఈ వారం మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బందులు తప్పవు. ఆర్థిక పరంగా మీకు లక్ కలసి వస్తుంది. అయితే మీరు ఆదాయం కోసం చాలా కష్టపడతారు. కాబట్టి ఫలితం మీరు ఆశించిన విధంగానే ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో మీ సంబంధాలు బలపడతాయి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 28

లక్కీ డే : బుధవారం

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది. ఈ వారం మీ ప్రేమ జీవితంలో ఒక అందమైన మలుపు ఉంటుంది. మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారని మీరు అర్థం చేసుకుంటారు. మీరు వివాహం చేసుకుంటే మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో గొప్ప సమయాన్ని గడుపుతారు. మీరు మీ ప్రియమైనవారికి దగ్గరగా ఉంటారు. కుటుంబంతో సంబంధాలు కూడా బాగుంటాయి. మీరు ప్రతి ఒక్కరి ప్రేమ మరియు మద్దతును పొందుతారు. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ చదువులపై పూర్తి శ్రద్ధ చూపుతారు. మరోవైపు ఈ వారం ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉండదు. ఆరోగ్యం విషయంలో మీకు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :7

లక్కీ డే : మంగళవారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉంటుంది. ఇంటి వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడితే, మీ కుటుంబసభ్యుల సహాయం తీసుకోవటానికి సంకోచించకండి. ఈ వారం మీకు విజయం మరియు ఉల్లాసంతో నిండి ఉంటుంది. ఈ కాలంలో మీ మానసిక స్థితి బాగుంటుంది. మీరు ఎక్కువ సమయం సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సంబంధంలో అద్భుతమైన సంబంధం ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ ప్రియమైన వారితో ప్రయాణించవచ్చు. ప్రేమికులు, భార్యభర్తలు ఈ వారం ఒకరితో ఒకరు మంచి సమయం గడుపుతారు. ఆర్థిక పరంగా ఈ వారం అద్భుతంగా ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ :12

లక్కీ డే : సోమవారం

English summary

Weekly Rashi Phalalu for February 2 to February 8

In the year 2020, this first week of February will be special. Read your weekly horoscope to know what lies ahead for all the 12 zodiac signs.
Story first published:Sunday, February 2, 2020, 1:57 [IST]
Desktop Bottom Promotion