ఈ వారం మీ రాశి ఫలాలు మార్చి 1 నుండి 7వ తేదీ వరకు

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

సమయం మన జీవిత పాఠాన్ని బోధిస్తుంది. మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు ఏర్పడుతాయి. మార్పు నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం అంగీకరించాలి.

Weekly Rashi Phalalu

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ వారం చాలా గ్రహల్లో మార్పులు జరుగుతాయి మరియు రాశిచక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా ఉంటుంది. మీ జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి...

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం వ్యక్తిగత జీవితంలో మరియు పని ప్రదేశాలలో మెరుగైన పరిస్థితులే ఉంటాయి. మీరు ఇంతవరకు ఎదుర్కొన్న సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మీరు కార్యాలయంలో సహోద్యోగుల నుండి పూర్తి మద్దతును పొందుతారు. మీ కుటుంబ జీవితంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యంగా ఉండేందుకు మీరు జీవనశైలిలో కొన్ని మార్పులు చేయవచ్చు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 34

లక్కీ డే : ఆదివారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. అయితే కొన్ని చిన్న సమస్యలు ఉండొచ్చు. పని విషయంలో ఈ వారం చాలా బిజీగా ఉంటారు. మీరు కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. ఈ వారం వ్యాపారులకు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఓ చిన్న భయం మిమ్మల్ని వెంటాడుతుంది. కాబట్టి మీ మనసును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ :14

లక్కీ డే : మంగళవారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఈ వారం అద్భుతమైన విజయాలను పొందవచ్చు. ఈ వారం నిరుద్యోగులు కూడా మంచి సంస్థ నుండి ఉద్యోగ ఆఫర్ పొందవచ్చు. ఈ వారం మీరు చాలా సహనం మరియు శాంతంగా ఉండాలి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ వారం చాలా ముఖ్యమైనది. వివాహితులకు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 5

లక్కీ డే : శుక్రవారం

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్నేహితులు లేదా కుటుంబం నుండి మీరు మంచి ప్రేమ మరియు మద్దతు పొందుతారు. పని విషయంలో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం బలంగా ఉంటుంది. దీని వల్ల మీరు అనేక ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 19

లక్కీ డే : బుధవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారిలో వివాహితులకు ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడే అవకాశం ఉంటుంది. మీ ఇద్దరి మధ్య సంబంధం క్షీణించవచ్చు. మరోవైపు వ్యాపారులకు ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఈ వారం ఒక సువర్ణావకాశాన్ని కూడా పొందవచ్చు. మీరు కొత్త ఆదాయ వనరులను కూడా పొందవచ్చు. స్నేహితులతో కూడా ఎక్కువ సమయం గడపండి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 29

లక్కీ డే : సోమవారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది. మీరు పెద్దల సలహాలను పాటిస్తారు. మీ జీవిత భాగస్వామితో సంబంధం విషయంలోనూ అనుకూలంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది. ఈ వారం ఆర్థిక పరమైన సమస్యలు ఏవీ ఉండవు. అన్ని పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :15

లక్కీ డే : ఆదివారం

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ రాశి వారు ఈ వారంలో చాలా కష్టపడాలి. మీరు ఊహించిన పరిస్థితులు మీకు ప్రతికూలంగా మారొచ్చు. అయితే ఉద్యోగులకు ఈ వారం మంచిగా ఉంటుంది. ఈ వారం వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధం సామరస్యంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :30

లక్కీ డే : మంగళవారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ రాశి వారు ఈ వారం ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే మీ ఆరోగ్యం చాలా బాగా ఉండేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తారు. ఉద్యోగులకు పని విషయంలో పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు మీ పనిని వేగంగా పూర్తి చేస్తారు. ఈ వారం మీరు మంచి మానసిక స్థితిలో ఉంటారు. మీరు ముందుకు సాగడానికి మంచి సువర్ణావకాశం పొందొచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో మీకు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :2

లక్కీ డే : ఆదివారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే వివాహితులకు ఈ వారం చాలా బాగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లొచ్చు. ఈ వారం మీకు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్‌లో పనిచేసే అవకాశం లభిస్తుంది. మీరు తరువాత ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా మీ ప్రణాళికలన్నింటినీ ముందుగానే తయారు చేసుకోవడం మంచిది. ఆర్థిక పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :9

లక్కీ డే : గురువారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ రాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారులు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీరు నిరాశకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యాపారులు కూడా ఆర్థిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈ వారం చాలా బిజీగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ :11

లక్కీ డే : సోమవారం

కుంభ రాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభ రాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం మీరు బిజీగా ఉంటారు. దీని వల్ల మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపలేరు. అయితే మీ ఇద్దరి మధ్య మంచి పరస్పర అవగాహన ఉంటుంది. ఉద్యోగులకు ఈ వారం చాలా ముఖ్యమైనది. ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. మరోవైపు వ్యక్తిగత జీవితంలో వారం చివరలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 9

లక్కీ డే : గురువారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి వారు ఈ వారం కొత్త శక్తితో నిండి ఉంటారు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు కొత్తదాన్ని నేర్చుకోవాలని అనుకుంటారు. మీరు జీవితంలో ప్రతి అంశంలోనూ విజయం సాధిస్తారు. ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఈ వారం కూడా పొందుతారు. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉపాధ్యాయుల మద్దతు కూడా పూర్తిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :22

లక్కీ డే : శనివారం

Story first published: Sunday, March 1, 2020, 7:00 [IST]
Desktop Bottom Promotion