For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

weekly horoscope: ఈ వారం మీ రాశి ఫలాలు 13 నుండి 19వ తేదీ వరకు..

రాశులను బట్టి వారి దిన, వార ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారు సమస్యలతో ఇబ్బంది పడే బదులు, ప్రశాంతమైన మనస్సుతో పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నిస్తే, మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభిస్తాయి. మరికొన్ని రాశుల వారికి ఈ వారం మీ కష్టాలు కూడా తీరుతాయి.

Weekly Rashi Phalalu for March 13 to March 19

పని విషయంలో ఈ వారం చాలా ముఖ్యమైనది. ప్రత్యేకించి మీరు ఉద్యోగాలు మార్చాలనుకుంటే, ఈ వారం మీరు మంచి అవకాశాలను పొందొచ్చు. మీరు పెద్ద కంపెనీలో ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం ఉంది. ఇలా అన్ని రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది? ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.. ఏయే రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది.. అన్ని రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...

శని దేవుడు ఆవిర్భావంతో ఈ రాశులకు రాజయోగం రానుందట... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...శని దేవుడు ఆవిర్భావంతో ఈ రాశులకు రాజయోగం రానుందట... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా మంచిగా ఉంటుంది. ఈ కాలంలో మీ పనితీరు చాలా బాగుంటుంది. మీరు పై అధికారుల పూర్తి మద్దతును పొందుతారు. అయితే, మీరు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. అనవసరమైన కోపం మీ పని మరియు మీ ఇమేజ్ రెండింటినీ ప్రభావితం చేస్తుంది. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. వ్యాపారులకు ఈ సమయం చాలా అదృష్టంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆగిపోయిన డీల్స్ ఏవైనా పూర్తవుతాయి. మీరు కొందరు పెద్ద కస్టమర్లతో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. పనితో పాటు కుటుంబం కోసం కూడా సమయం కేటాయించాలి. ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉండొచ్చు. ఈ కాలంలో, మీరు మీ తెలివితేటలతో అదనపు డబ్బు సంపాదించగలుగుతారు. ఈ వారం ఆరోగ్య పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 5

లక్కీ డే : మంగళవారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు కొత్త సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఈ కాలంలో, మీ పనిలో ఏదైనా ఆకస్మిక క్షీణత కారణంగా మీ ఆందోళన పెరుగుతుంది. అయితే, మీరు చాలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ సమస్య త్వరలో ముగియొచ్చు. ఏదైనా ముఖ్యమైన వ్యాపార నిర్ణయాన్ని తొందరపడి తీసుకోకండి. ఉద్యోగులు తమ పని పట్ల మరింత సీరియస్‌గా ఉండాలి. మీకు ఏదైనా ముఖ్యమైన బాధ్యత అప్పగించబడితే, మీ ఉత్తమమైనదాన్ని అందించడానికి ప్రయత్నించండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు కష్టపడి పనిచేయాలి. మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖర్చవుతుంది. అయితే, మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయాలి. ఆరోగ్య పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలొస్తాయి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 10

లక్కీ డే : బుధవారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారిలో ఉద్యోగులు, వ్యాపారులు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. మీ మార్గంలో అడ్డంకులు సృష్టించొచ్చు. ఉద్యోగులు ఆఫీసులో సహోద్యోగులను గుడ్డిగా నమ్మడం మానుకోవాలి. బాస్ మీకు ఏదైనా పని అప్పగించినట్లయితే, మీరు దాని గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఉండాలి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్ద ఒప్పందం చేసుకుంటున్నట్లయితే, మీ మార్గంలో కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగానే ఉంటుంది. వారం చివరలో డబ్బు లేకపోవడం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఒడిదుడుకులైన పరిస్థితులు ఏర్పడతాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 2

లక్కీ డే : సోమవారం

Rahu-Ketu Transit in 2022:రాహు కేతుల రవాణాతో ఈ 5 రాశులకు నష్టాలు...పాటించాల్సిన పరిహారాలు..Rahu-Ketu Transit in 2022:రాహు కేతుల రవాణాతో ఈ 5 రాశులకు నష్టాలు...పాటించాల్సిన పరిహారాలు..

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం కొంత మేలు జరుగుతుంది. ఈ కాలంలో మీ ఆగిపోయిన కొన్ని పనులు పూర్తవుతాయి. ఇది మీ పెద్ద చింతలను తొలగిస్తుంది. మానసికంగా మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. ఉద్యోగులు ఈ వారం కొంచెం బిజీగా ఉండొచ్చు. వ్యాపారులు ఈ వారం మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. వారంలోని ప్రారంభ రోజులు మీకు చాలా ఖరీదైనవి. ఈ సమయం మీ జీవిత భాగస్వామితో చాలా శృంగారభరితంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో పెద్ద సానుకూల మార్పు కూడా ఉండొచ్చు. ఆరోగ్య పరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి మీరు ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, మీ గురించి మరింత శ్రద్ధ వహించండి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 16

లక్కీ డే : గురువారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈ వారం చాలా బాగుంటుంది. ఈ కాలంలో ఆఫీసు వాతావరణం చాలా బాగుంటుంది. మీరు మీ పనిని శ్రద్ధగా చేస్తారు. అలాగే మీరు పై అధికారుల మద్దతు పొందుతారు. ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన సమావేశాలు కూడా జరుగుతాయి. మీరు బాస్ నుండి మంచి సలహాలను కూడా పొందొచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు గతంలో తీసుకున్న కొన్ని సరైన నిర్ణయాల వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు. మీరు మీ తండ్రి వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే, మీరు అతని సహకారంతో మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణం కంటే మెరుగ్గా ఉంటాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం బలంగా ఉంటుంది. అయితే, మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. ఆవేశానికి లోనవ్వడం ద్వారా మీ ఆదాయానికి మించి ఖర్చు చేయడం తప్పుకాదు. ఈ సమయంలో మీరు గాయపడే అవకాశం ఉంది. ఏ పనీ తొందరపడి చేయకపోవడమే మంచిది.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ : 28

లక్కీ డే : శుక్రవారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో చాలా మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ప్రియమైన వారితో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. మీరు మతపరమైన స్థలాన్ని సందర్శించడానికి కూడా ప్లాన్ చేయొచ్చు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. వారితో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు ఉత్సాహం అలాగే ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో సమన్వయం మెరుగ్గా ఉంటుంది. మీరు వ్యాపారస్తులైతే, ఈ కాలంలో డబ్బు లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని కొత్త బాధ్యతలను పొందొచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు కొద్దిగా ఒత్తిడికి గురవుతారు. అయితే సానుకూలంగా ఉండండి. మీ ఉత్తమమైనదాన్ని అందించడానికి ప్రయత్నించండి. ఆరోగ్య పరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 5

లక్కీ డే : శనివారం

Jupiter Transit 2022:గురుడి రవాణా వల్ల ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందేమో చూసెయ్యండి...!Jupiter Transit 2022:గురుడి రవాణా వల్ల ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందేమో చూసెయ్యండి...!

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ రాశి వారు ఈ వారం స్వార్థపరుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో ఘర్షణ మరియు అహంకారానికి దూరంగా ఉండాలి. మీరు మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. వ్యాపారస్తులు వారం మధ్యలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. డబ్బు లేకపోవడం వల్ల మీరు చాలా ఆందోళన చెందుతారు. ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీకు వివాదం ఉండొచ్చు. మీ ప్రియమైనవారి అజాగ్రత్త వైఖరి మీకు సమస్యలను సృష్టిస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఈ కాలంలో మీరు విజయం సాధించకపోవచ్చు. అయినా నిరుత్సాహపడకండి మరియు ప్రయత్నిస్తూ ఉండండి. సరైన సమయం వచ్చినప్పుడు మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 11

లక్కీ డే : ఆదివారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం మానసిక ప్రశాంతతకు భంగం కలుగుతుంది. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ ప్రియమైన వారు నిర్లక్ష్యంగా భావించొచ్చు. ఈ వారం మీకు డబ్బు పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి. మీరు మీ పాత ఆస్తిలో దేనినైనా విక్రయించాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తొందరపడకుండా ఉండాలి. ఆస్తి సంబంధిత పనులు చేసే వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో మీ పని సజావుగా పూర్తవుతుంది. మీరు ఆశించిన ఫలితాన్ని పొందొచ్చు. ఉద్యోగులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. మీరు ఆఫీసులో చాలా యాక్టివ్‌గా ఉండాలి. వారం చివర్లో మీకు కొన్ని చర్మ సంబంధిత సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 4

లక్కీ డే : సోమవారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ వారం ఉద్యోగులకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమయంలో, మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే సహోద్యోగులతో సమన్వయం దెబ్బతింటుంది. ఆఫీస్‌లో రాజకీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొందరు బాస్ ముందు మీ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నించొచ్చు. పని చేసే వారికి ఈ వారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటే, ఇది సరైన సమయం. ఆర్థిక పరంగా ఈ వారం గత వారం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు పొదుపుపై ​​ఎక్కువ దృష్టి పెట్టగలరు. అంతే కాకుండా చాలా కాలంగా పెండింగులో ఉన్న డబ్బును కూడా తిరిగి పొందొచ్చు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ కుటుంబ సభ్యులతో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. తల్లి ఆరోగ్యం మెరుగుపడటంతో మీ పెద్ద చింతలు తొలగిపోతాయి. ఆరోగ్య పరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 17

లక్కీ డే : మంగళవారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. అవసరానికి మించి ఖర్చు చేయడం వల్ల మీకు సమస్యలు వస్తాయి. మీరు వీలైనంత వరకు పొదుపు చేయడంపై దృష్టి పెట్టడం మంచిది. ఈ సమయంలో, పాత అప్పు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. మీరు వీలైనంత త్వరగా దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ సమయం వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు కొంత కష్టంగా ఉంటుంది. ఈ కాలంలో, మీరు మీ చిన్న పనిని కూడా పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మరోవైపు, గ్రహాల ప్రతికూల ప్రభావాల కారణంగా, మీ పనిలో ఏదైనా ప్రభుత్వ అడ్డంకి కూడా ఉండొచ్చు. ఉద్యోగస్తులకు ఈ వారం చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కోరుకున్న బదిలీని పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 20

లక్కీ డే : గురువారం

కుంభ రాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభ రాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి వారిలో ఉద్యోగులు మీ ఉద్యోగాన్ని వదిలి మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీ ప్రణాళికను కొనసాగించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు విజయం పొందొచ్చు. మరోవైపు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఈ కాలంలో ఉన్నత స్థానాన్ని పొందొచ్చు. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ వారం వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో తండ్రితో మీ సాన్నిహిత్యం చెడిపోవచ్చు. మీరు వారి నిర్ణయాలలో దేనితోనూ ఏకీభవించనట్లయితే, మీ పక్షాన్ని ప్రశాంతంగా ప్రదర్శించడానికి ప్రయత్నించండి. గొడవలకు దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. మీ ప్రియమైన వ్యక్తి యొక్క మారిన మానసిక స్థితి మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సౌకర్యాలు పెరుగుతాయి. మీకు ఏదైనా కిడ్నీ సంబంధిత వ్యాధి ఉంటే, అజాగ్రత్తగా ఉండకండి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 5

లక్కీ డే : శుక్రవారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈ వారం పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడం వల్ల, ఉపశమనం పొందుతారు. మీరు ఉన్నతాధికారుల నుండి కూడా ప్రశంసలు పొందవచ్చు. ఈ కాలంలో మీరు సానుకూల శక్తితో చుట్టుముడతారు. మీ విశ్వాసం కూడా పెరుగుతుంది. వ్యాపారులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీకు కొన్ని అనవసరమైన ఖర్చులు ఉండొచ్చు. మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశాన్ని పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వారం చివర్లో, మీరు ఏదైనా పాత మరియు చిన్న రుణాన్ని తిరిగి చెల్లించగలరు. ఆరోగ్య పరంగా ఈ వారం మీకు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 22

లక్కీ డే : ఆదివారం

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... వీటి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అన్న విషయాలను పాఠకులు గమనించగలరు.

English summary

Weekly Rashi Phalalu for March 13 to March 19 in Telugu

In the year 2022, Third Week of March will be special. Read your weekly horoscope to know what lies ahead for all the 12 zodiac signs.
Desktop Bottom Promotion