For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'దేన్నైనా పుట్టించే శక్తి ఆడవారికే ఉంది'... మరి అలాంటోల్లే లేకపోతే...?

|

'దేన్నైనా పుట్టించగల శక్తి ఇద్దరికే ఉంది. ఒకటి నేలకు.. రెండోది వాళ్లకి.. అలాంటోళ్లతో మనకు గొడవేంటి.. జస్ట్ సరెండర్ అయిపోవాలంతే'' ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో మనందరికీ బాగా తెలిసే ఉంటుంది. అయితే ఆ నేలను కూడా భూదేవితో పోలుస్తారు. కాబట్టి అలాంటి శక్తి ఇద్దరికి కాదు..

ఒక్కరికే ఉంది. అది కేవలం ఆడవారికే.. కానీ 21వ దశాబ్దంలో కూడా ఆడవారికి కనీస భద్రత ఇప్పటికీ మనం కల్పించలేకపోతున్నాం. చాలా మంది మగవారు మహిళలు తమలో సగభాగం అని నీతులు చెప్పడమే తప్ప.. ఆచరణలో మాత్రం చేతులెత్తేస్తున్నారు. పైగా ఆడవారిపై నిత్యం అధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అసలు ఈ నేల మీద ఆడవారే లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఊహించుకోవడానికి పరిస్థితి భయంకరంగా ఉంది కదా.. అలాంటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి....

బెజవాడలోని లబ్బిపేటలో...

బెజవాడలోని లబ్బిపేటలో...

అది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన బెజవాడలోని లబ్బిపేట.. ఆ కాలనీలో ఉండే రాము, రాణి దంపతులు (పేర్లు మార్చాం). వారిద్దరూ ఓ రోజు గొడవ పడటం ప్రారంభించారు.

నేనేం చేయట్లేదంటే ఎలా...

నేనేం చేయట్లేదంటే ఎలా...

రాణి.. రాముతో ఇలా అంది. తెల్లవారకే ముందే నిద్ర లేచి పిల్లల్ని రెడీ చేస్తున్నా.. వంటను సిద్ధం చేస్తున్నా.. ఇంటి పని కూడా పూర్తి చేస్తున్నా.. అన్నీ చేసి ఆఫీస్ కి వెళ్లి మీ తర్వాతే నేను తిరిగొస్తున్నా.. మళ్లీ ఇంటి పనులన్నీ నేనే చేస్తున్నా.. పిల్లలకు బాగోగులు కూడా నేనే చూసుకుంటున్నా.. అయినా నేనేం చేయడం లేదంటే ఎలా? నాకు చాలా బాధేస్తోంది.

ఏం చేయలేవు..

ఏం చేయలేవు..

రాము ఆమె మాటలను చాలా తేలికగా తీసుకున్నాడు. పైగా ఆమె గురించి చులకనగా మాట్లాడాడు. నీకు కోపమొస్తే ఏం చేస్తావు.. మహా అయితే ఏడుస్తావ్.. అంతకంటే ఏమి చేయలేవు అని మరింత కించపరిచాడు.

దేవుడే శిక్షిస్తాడు..

దేవుడే శిక్షిస్తాడు..

అసలు నేను ఏ తప్పు చేయకపోయినా నన్నే తిడుతున్నారు మీరు. పైన ఉన్న దేవుడు మీకు తగిన శిక్ష వేస్తాడు. ఆ శిక్షతో ఒక్క నా విలువే కాదు.. మీకు ఆడవాళ్లంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు మీరు మమ్మల్ని బాగా చూస్తారు. దేవుడా.. దయేచసి మా ఆయనకు ఆడవారి విలువేంటో తెలిసేలా చేయి స్వామి అని వేడుకొంది.

అచ్చం సినిమాలాగా...

అచ్చం సినిమాలాగా...

అప్పుడు వైకుంఠంలో విష్ణువుకు సేవ చేసుకుంటున్న లక్ష్మీదేవి ఆ రాణి మాటలను విన్నది. ఆడవారి విలువ ఏంటో మగవారికి తెలియజేయాలని భావించింది. అందుకే తన భర్తకు ఓ ఆదేశం లాంటి సలహా ఇచ్చింది. ఈ భూమి మీద ఉన్న ఆడవారందరినీ ఒక రోజంతా కనిపించకుండా చేయాలి అని చెప్పడంతో.. ఆ మాటకు విష్ణువు ఒప్పుకొంటాడు.

అకస్మాత్తుగా ఆమె కనిపించలేదు..

అకస్మాత్తుగా ఆమె కనిపించలేదు..

ఆ రోజు రాణితో గొడవ పడి రాము అన్నం తినకుండా పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేసరికి తనకు చాలా ఆకలేసింది. తన రాణి త్వరగా ఏదో ఒకటి చేస్తే బాగుటుంది అనుకున్నాడు. త్వరగా టిఫన్ రెడీ చేయమని చెప్పేందుకు బయటకు వచ్చాడు. అయితే అకస్మాత్తుగా రాణి కనిపించలేదు.

అందరిదీ ఇదే పరిస్థితి...

అందరిదీ ఇదే పరిస్థితి...

తన ఇంట్లో ఎక్కడి సామాన్లు అక్కడే పడి ఉన్నాయి. రాణి ఏమో కనబడలేదు. ఇల్లంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు రాణి. ఇంతకుముందు గొడవ పడినందుకు అలిగి పుట్టింటికి వెళ్లిందేమో అనుకున్నాడు. అయితే తన పిల్లల్లో మగపిల్లలు మాత్రమే మరో గదిలో ఉన్నారు. అయితే వీధిలో వెళ్లి చూస్తే అందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఆడవారంతా ఎక్కడికి వెళ్లారోనని బుర్ర గోక్కున్నారు.

టిఫిన్ తో ప్రారంభమైన కష్టాలు..

టిఫిన్ తో ప్రారంభమైన కష్టాలు..

తన ఆకలి పెరిగిపోవడంతో దగ్గర్లోని హోటల్ కు వెళ్లాడు. ఆ హోటల్ లో టిఫిన్ చాలా రుచికరంగా ఉంటుంది. అయితే అదీ కూడా ఆంటీ చేయి పడితేనే. కానీ ఆరోజు ఆంటీ లేకపోవడంతో అంకుల్ చేసిందే పట్టుకెళ్లాడు. తన పిల్లాడికి కొంచెం తినిపించి.. తను కొంచెం తిన్నాడు.

ఎక్కడ చూసినా మగవారే...

ఎక్కడ చూసినా మగవారే...

తన పిల్లాడిని రెఢీ చేసి స్కూలుకు పంపినా.. ఆఫీసుకెళ్లినా అంతా మగవారే దర్శనమిస్తున్నారు. ఏ ఒక్క అమ్మాయి కనిపించలేదు. ఏమి చేయాలో పాలుపోక సినిమాకు వెళ్లాడు రాము. అయితే సినిమా ప్రారంభమై ఇంటర్వెల్ వరకు వచ్చినా హీరోయిన్ అనేదే కనిపించదు. దీంతో చిరాకొచ్చి బయటికొచ్చేస్తాడు.

ఇంట్లో టీవలోనూ..

ఇంట్లో టీవలోనూ..

బయట అంతా ఎంత తిరిగినా ఏమి తోచకపోవడంతో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో టివి ఆన్ చేస్తే అందులోనూ మగవాళ్లే వార్తలు చదువుతున్నారు. మహిళలందరూ అకస్మాత్తుగా మాయమైపోవడం గురించే వార్తలన్నీ వస్తున్నాయి. అన్ని చోట్ల అమ్మాయిలందరూ అదృశ్యమైనట్లు వస్తున్నాయి. ఇదంతా వింటుంటే తన రాణి చెప్పిన.. నేను లేకపోతే నా విలువ మీకు తెలుస్తుంది అన్న మాట గుర్తొచ్చింది.

ఆడవారి విలువ తెలిసొచ్చింది...

ఆడవారి విలువ తెలిసొచ్చింది...

ఆ వెంటనే స్కూల్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. స్కూల్లో ఎక్కువ మంది లేడీ టీచర్లు లేకపోవడం వల్ల పిల్లలందరినీ చూసుకోవడం కష్టంగా ఉందని, వచ్చి తీసుకెళ్లమని ఫోన్ వచ్చింది. దీంతో నిజంగానే ఆడవాళ్ల విలువ తెలిసొచ్చిందనుకుంటూ బాబుని తీసుకురావడానికి స్కూలుకు వెళ్లాడు రాము.

తత్వం బోధపడింది..

తత్వం బోధపడింది..

తన భార్య లేకపోయేసరికి తనకు ఒక్కసారిగా చాలా ఒంటరిగా అనిపించింది. ఏదో కోల్పోయినట్లు అనిపించింది. దీంతో దేవుడిని వేడుకున్నాడు. ఒకసారి నా భార్యను తిరిగి నా దగ్గరకు పంపామని కోరుకున్నాడు. నేను మళ్ల జీవితంలో ఎప్పుడూ తనని చిన్న చూపు చూడను. తనకు అన్నింట్లో సాయం చేస్తాను. అంటూ నిద్రలోకి జారుకున్నాడు.

కోరిక నేరింది..

కోరిక నేరింది..

ఉదయం రాము నిద్ర లేచిన వెంటనే తన భార్య రాణి తన నట్టింట్లో పని చేస్తూ కనిపించింది. వెంటనే దేవుడా నా కోరిక నెరవేర్చావు.. అంటూ భార్య దగ్గరికి వెళ్లి తనని కౌగించుకుని తన తప్పును ఒప్పుకొన్నాడు.

ప్రతి పని మనిద్దరిదీ...

ప్రతి పని మనిద్దరిదీ...

రాణి నీ విలువ నాకు తెలిసింది. ఈరోజు నుంచి ప్రతి పని మనం ఇద్దరం కలిసి చేసుకుందాం అన్నాడు రాము. ఇదంతా చూసి రాణికి ఆశ్చర్యమేసింది. తనకు ఏమి అర్థం కాలేదు..

English summary

What a day without women would really look like

Here we talking about what a day without women would really look like. Read on