For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Parakram Diwas:పరాక్రమ్ దివాస్ అంటే ఏమిటి? ఈ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే...

|

Netaji Birthday To Be Celebrated As "Parakram Diwas": స్వాతంత్య్రసమర యోధుల్లో ఒకరైన సుభాష్ చంద్రబోస్ మన దేశానికి ప్రాణాలర్పించారు. ఆంగ్లేయులను మన దేశం నుండి తరిమికొట్టేందుకు 'ఆజాద్ హింద్ ఫౌజ్' అనే సంస్థను స్థాపించి భారత స్వాతంత్య్ర పోరును మలుపు తిప్పిన నేతల్లో సుభాష్ చంద్ర బోస్ పాత్ర కీలకం.

ఇదిలా ఉండగా గత ఏడాది 2021 సంవత్సరంలో జనవరి 23వ తేదీన సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుండి ప్రతి ఏటా నేతాజీ జయంతిని 'పరాక్రమ్ దివాస్'గా జరుపుకోవాలని నిర్ణయించింది.

ప్రతి సంవత్సరం సుభాష్ చంద్ర బోస్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని వివరించింది. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Netaji Birth Anniversary:'పరాక్రమ్ దివాస్'ఎవరి జ్ణాపకార్థం జరుపుకుంటారంటే...!

కాంగ్రెస్ నాయకుడిగా..

కాంగ్రెస్ నాయకుడిగా..

ఒడిశాలోని కటక్ లో జానకీనాథ్ బోస్, ప్రభావతి దంపతులకు 1897, జనవరి 23వ తేదీన జన్మించిన ఈయన అతి తక్కువ కాలంలో అత్యంత ఉన్నత శిఖరాలకు ఎదిగారు. 'మీరు నాకు రక్తం ఇస్తే.. నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను' అనే నినాదం భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన నినాదాల్లో ఒక ప్రముఖమైన దానిని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు అందించారు. ఈయన ఆలిండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండుసార్లు మరియు భారత జాతీయ సైన్యం నాయకుడిగా కూడా పని చేశారు.

ఆంగ్లేయులకు వ్యతిరేకంగా..

ఆంగ్లేయులకు వ్యతిరేకంగా..

అంతేకాదు ఈయన 'ఆజాద్ హిందూ ఫౌజ్' అనే సంస్థను ఏర్పాటు చేసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అదే సమయంలో గాంధీజీతో విభేదించారు. బ్రిటీష్ వారి నుండి భారతదేశానికి విముక్తి కలగాలంటే శాంతి, అహింస మార్గాలే కాదు.. సాయుధ పోరాటం కూడా చేయాలన్నారు. అప్పుడే మనకు స్వాతంత్య్రం వస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి.

Netaji Birth Anniversary : మనలో పోరాట పటిమను పెంచే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సందేశాలివే...

సన్యాసం తీసుకుని..

సన్యాసం తీసుకుని..

రామక్రిష్ణ పరమహంస, స్వామి వివేకానందుల మార్గంలో పయనించి సన్యాసం తీసుకోవడానికి తీర్మానించారు. 'మానవసేవే మాధవసేవ' అనే నినాదం, రామక్రిష్ణ ఉపదేశించిన దేశాభిమానంతో ముందుకు సాగారు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత భారతదేశ స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొన్నారు. శ్రీ ఆర్యా పత్రికలో ఆయన సంపాదకులుగా రాసిన వ్యాసాలు స్వాతంత్య్ర సమరంలో పాల్గొనే వీరుల్లో మంచి ఉత్సాహాన్ని నింపాయి.

జాతీయ భావాన్ని..

జాతీయ భావాన్ని..

తను డిగ్రీ పూర్తి చేసి ఇంగ్లండ్ కు వెళ్లిన సమయంలోనే జలియన్ వాలా బాగ్ ఉదంతం చోటు చేసుకుంది. అదే సందర్భంలో యువతలో ఉత్సాహాన్ని రేకెత్తించే మరియు మనకు స్ఫూర్తినిచ్చే సందేశాలు. నినాదాలను ఎన్నో ఇచ్చారు. దేశవ్యాప్తంగా యువతలో జాతీయ భావాన్ని నింపడంలో సఫలమయ్యారు.

Subhas Chandra Bose Jayanti 2022 : భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నేతాజీదే...

మిస్టరీగానే నేతాజీ మరణం..

మిస్టరీగానే నేతాజీ మరణం..

రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం సమయంలో బోస్ నాజీ జర్మనీ, సోవియట్ మరియు ఇంపీరియల్ జర్మీనికి వెళ్లి భారతదేశాన్ని బ్రిటీష్ పాలన నుండి విడిపించేందుకు మార్గాన్ని కనుగొనేందుకు వెళ్లాడు. అయితే 1945 ఆగస్టు 18వ తేదీన తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు చెబుతారు. కానీ తన మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. తను విమాన ప్రమాదంలో కాలిన గాయాల కారణంగా మరణించడానికి కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే నేతాజీ రహస్యంగా పని చేసేందుకు తన మరణంపై అసత్య ప్రచారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఏది నిజం అనేది ఇప్పటికీ తేలలేదు.

English summary

What is Parakram Diwas and why is it celebrated on January 23rd in Telugu

Here we are talking about what is parakram diwas and why is it celebrated on january 23rd in Telugu. Read on
Story first published: Thursday, January 20, 2022, 15:22 [IST]