For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pongal: సరదాల సంక్రాంతి ప్రత్యేకతలేంటి... పొంగల్ అంటే అసలైన అర్థమేంటో తెలుసా...

|

మన దేశంలో ఈ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. పండుగ ఒక్కటే అయినా పేర్లు చాలా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగగా పిలుచుకునే ఈ పండుగను కొన్ని రాష్ట్రాల్లో పొంగల్ అని, మట్టు పొంగల్ అని ఇతర పేర్లతో పిలుస్తూ ఉంటారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. సంక్రాంతి అంటేనే భోగి మంటలు.. రంగు రంగుల ముగ్గులు.. చేతికొచ్చిన పంటలు.. అందమైన రంగవల్లులు.. రతనాల గొబ్బిళ్లు.. పిండి వంటలు.. కోడి పందేలు.. గాల్లో పతంగులు కొత్త అల్లుళ్ల సందడి, అమ్మమ్మ, తాతయ్యలతో సరదాగా గడపడం..

కుటుంబసభ్యులు, బంధువులందరితో కలిసి ఆనందంగా గడిపే క్షణాలను సంక్రాంతి పండుగ అందరి ఇంటా తీసుకొస్తుంది. ఈ సందర్భంగా సంక్రాంతి అంటే ఏమిటి? పొంగల్ యొక్క అర్థమేంటి అనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Sankranthi Pandem Kollu:సంక్రాంతి సంబురాలు 'తగ్గేదే లే'..కోడి పందెలు ఆగేదేలే...

సంక్రాంతి అంటే..

సంక్రాంతి అంటే..

సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారడం అనే అర్థం వస్తుందట. సూర్యుడు మన లోకంలోని జీవరాశులందరికీ ఆధారం. అందరికీ వెలుగును పంచే అద్భుతమైన ప్రకాశించే రాశి. మకరరాశిలోకి సూర్యుని గమనం మకర సంక్రాంతి పర్వదిన ఆగమనం తెలుగువారి సంప్రదాయాలను తెలిపే పర్వదినం. చెడు నుండి మంచికి.. దానవత్వం నుండి మానవత్వం వైపునకు.. అశాంతి నుండి శాంతి వైపునకు.. ఇలా మనిషి యొక్క మనసు పరివర్తనతో మారే నాడు జీవన సంక్రమణం ఆరంభమవుతుంది.

పెద్దల వివరణ..

పెద్దల వివరణ..

సంక్రాంతిలో ‘సం' అంటే మిక్కిలి ‘క్రాంతి' అంటే అభ్యుదయం అని మన పెద్దలు చెబుతుంటారు. అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి కాబట్టే దీన్ని ‘సంక్రాంతి'గా మన పూర్వీకులు వివరించారు. ‘మకరం' అంటే మొసలి. అందుకే ఈ ‘మకర సంక్రమణం' పవిత్రమైన రోజులలో దీని బారి నుండి తప్పించుకునేందుకు ఒకటే మార్గం అది ఎవరికి వారు యథాశక్తి లేదు అనకుండా దానధర్మాలు చేయడమే మంచిదని, పెద్దలు చెబుతూ ఉంటారు.

Makar Sankranti 2022: 29 ఏళ్ల తర్వాత శని, సూర్యుడి సంయోగం... 12 రాశులపై పడే ప్రభావం...!

స్వర్గానికి వెళ్తారని..

స్వర్గానికి వెళ్తారని..

హిందూ క్యాలెండర్ ప్రకారం, సాధారణంగా డిసెంబర్ 22వ తేదీ నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారు స్వర్గానికి వెళ్తారని విశ్వసిస్తారు. అందుకే మహాభారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్ముడు ఈ పవిత్రమైన రోజు వరకు ఎదురుచూసి ఉత్తరాయణంలో రథసప్తమి ‘మాఘ శుద్ధ సప్తమి'నాడు మొదలుకుని తన పంచప్రాణాలను రోజునకు కొంచెం చొప్పున విడిచి.. చివరకు మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఏదో ప్రాణాన్ని వదిలి మోక్షం పొందాడు. ఇదే రోజున జగద్గురువు ఆది శంకరాచార్యుడు ఈరోజునే సన్యాసం స్వీకరించాడు.

సంక్రాంతి ప్రత్యేకతలు..

సంక్రాంతి ప్రత్యేకతలు..

పురాణాల ప్రకారం, పూర్వ కాలంలో గోదాదేవి పూర్వ ఫల్గుణ నక్షత్రంలో కర్కాటక లగ్నంలో తులసి వనంలో జన్మించింది. ఆమె గోపికలతో కలిసి శ్రీక్రిష్ణుడిని ఆరాధించింది. ధనుర్మాసం అంతా అంటే సుమారు నెలరోజుల పాటు నిష్టతో వ్రతం ఆచరించి చివరిరోజైన మకర సంక్రాంతి నాడు శ్రీ మహావిష్ణువును పెళ్లి చేసుకుంది. ఇలా మకర సంక్రాంతికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

గరుడ పురాణంలో..

గరుడ పురాణంలో..

సంక్రాంతి పండుగకు పితృ దేవతలకూ సంబంధం ఉంది. గరుడ పురాణం ప్రకారం.. పుష్టికారకమైన స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా చాలా మంచిదట. దేవతల చేత కూడా ఆరాధించబడే మహిమాన్వితులు, పితృదేవతలు. వారి ఆశీస్సులు వల్ల మీ కుటుంబ సంపద, శ్రేయస్సు పెరుగుతాయి. 2022 సంవత్సరంలో 15వ తేదీన ఫ్లవ నామ సంవత్సర పుష్య మాసంలో సూర్యుడు మకరంలోకి ప్రవేశించనున్నాడు.

2022 సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగ ఎప్పుడొచ్చింది?

ఈ ఏడాది సంక్రాంతి పండుగ జనవరి 15వ తేదీన శనివారం నాడు వచ్చింది. ఈ క్రమంలోనే 14వ తేదీన భోగి పండుగను జరుపుకుంటారు. 16వ తేదీన కనుమ పండుగను జరుపుకోనున్నారు. మకర సంక్రాంతి రోజున అంటే 15వ తేదీ మధ్యాహ్నం 2:43 గంటల నుండి సాయంత్రం 5:45 గంటల వరకు శుభ ముహుర్తం ఉంది. ఈ వేళలో పూజలు చేయడానికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

English summary

What is Pongal? Interesting facts about this harvest festival in telugu

Here we are talking about the what is pongal? Interesting facts about this harvest festival. Have a look