For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశిని బట్టి అత్యంత ఆకర్షణీయ లక్షణాలివే...!

|

ఆకర్షణ అనగానే మనకు అమ్మాయిలే గుర్తొస్తారు. ఎందుకంటే అలాంటి గుణం వారిలో అత్యంత ఎక్కువగా ఉందని చాలా మంది నమ్ముతారు. అందం, అభినయం, ఆకర్షణ వంటివి కలిస్తేనే అందమైన అమ్మాయిగా మారుతుంది.

అయితే ఆకర్షణ అనేది ప్రతి ఒక్క సంబంధంలోనూ అత్యంత ముఖ్యమైన మరియు కీలకమైన అంశం. మీరు ఎవరినైనా ఇష్టపడినప్పుడు వారి కోసం ఏదైనా చేయాలనకుంటారు. ముఖ్యంగా వారి పట్ల మీకున్న ప్రేమను వ్యక్తం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు.

ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి ఒక్కరిలోనూ ఆకర్షణీయమైన లక్షణాలు ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల మీరు తిరుగులేని శక్తిగా మారిపోతారట. ఇవి మిమ్మల్నీ మీ భాగస్వామి వద్ద మరింత ఆకర్షణీయంగా మారుస్తుందట. ఇంతకీ ఏయే రాశి వారిలో ఎలాంటి ఆకర్షణీయ లక్షణాలు ఉన్నాయి.. ఎవరెవరు ఎలా ప్రవరిస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వాస్తు ప్రకారం.. తాబేలు బొమ్మను ఇంట్లో అక్కడ పెడితే.. శుభ ఫలితాలొస్తాయంట...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారిలో అత్యంత ఆకర్షణీయమైన వాటిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు వీరు ఎక్కువగా లైంగిక జీవితం గురించి ఆలోచిస్తారట. అయితే ఇందుకు బదులుగా వీరిని ఆకర్షించే వాటి గురించి ఆలోచిస్తే మంచి ఫలితాలొస్తాయట. ‘స్వీయ ప్రారంభ, స్వీయ ఆధారిత మరియు నిర్భయంగా కనిపించేందుకు ఈ రాశి వారు సిద్ధంగా ఉంటారట. అంతేకాదు వీరికి ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుదట.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు భౌతిక వాదానికి ప్రసిద్ధి చెందినవారు. వీరు తమ వ్యక్తిగత జీవితంలో చక్కని విషయాలను గ్రహిస్తారు. వీరికి సంగీతం, ఆహారం, పానీయం, కలర్స్ మరియు దుస్తులు వంటివి ఆకర్షణీయంగా అనిపిస్తాయట. వీరు లైంగిక జీవితంలో అద్భుతమైన అనుభవాన్ని పొందుతారట. అలాగే స్వచ్ఛమైన స్నేహం కోసం ప్రయత్నిస్తారట.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారిలో అత్యంత ఆకర్షణీయమైన లక్షణం ఏంటంటే.. వీరు తరచుగా పార్టీల గురించి, ఉత్సాహం గురించి గాలిలో తేలుతున్నట్టు భావిస్తారట. వీరి పదజాలం, తెలివితేటలు, చిన్నపిల్లల మనస్తత్వం, ఆటపాటలు ఏదైనా అంశంపై సరదాగా ఉంటారట.

మకరరాశితో ఈ రాశుల వారు ఆనందంగా గడిపేస్తారట... మీ రాశి ఉందేమో చూసెయ్యండి...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. వీరు ఎవరినైనా ప్రేమిస్తే.. జీవితాంతం వారిని హ్యాపీగా చూసుకుంటారట. అయితే వీరు ఎదుటి వ్యక్తులను నమ్మినప్పుడు మాత్రమే ఇది జరుగుతుందట. ఒకసారి వీరు ఎవరినైనా ఇష్టపడితే వారి కోసం ఏదైనా చేయడానికి వెనుకాడరట.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎవ్వరికీ అంత సులువుగా అర్థం కారు. వీరు ప్రపంచాన్ని ఒక క్రీడా మైదానంగా పరిగణిస్తారట. వీరికి ఏదైతే ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందో అలాంటి క్రీడలోకి ప్రవేశిస్తారట. అంతేకాదు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయట. అయితే వీరు ఎవరినైనా కళ్లలోకి కళ్లు పెట్టి చూసినప్పుడు పూర్తిగా ఉద్వేగానికి లోనవుతారట.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు పరిపూర్ణవాదులకు ప్రసిద్ధిగా చెప్పబడుతున్నారు. ఇది వీరి అద్భుతమైన తెలివితేటల లక్షనం. వీరికి ఎదుటి వ్యక్తి ఎలా కనిపించాలి.. వారిని ఎలా అర్థం చేసుకోవాలనే విషయాలు బాగా తెలుసట. వీరు ఎవరితోనైనా సులభంగా కలిసిపోతారట. వీరు తమను తాము ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే కాకుండా, ఇతరులను కూడా మంచిగా తయారు చేసేందుకు ప్రయత్నిస్తారట. వీరి సందేశాత్మక మాటలు మన కలలు నిజమయ్యేలా చేస్తాయి.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరట. ఈ కారణంగా వీరు చాలా తక్కువ సమయంలోనే భాగస్వామిని వెతుక్కుంటారట. ప్రత్యేకించి అన్ని సమయాల్లో సన్నిహితంగా ఉండాలని కోరుకునే వారికి, ఈ రాశి వారిని ఇష్టపడే వారి కోసం ఏదైనా చేస్తారట. ఈ రాశి వారిని ఎవరైనా విశ్వసిస్తారట. అయితే కొన్ని రొమాంటిక్ ఫీలింగ్స్ కారణంగా వీరి నుండి కొందరు దూరమవుతారట.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారి శక్తి తరచుగా లైంగికంగా మూసగా ఉంటుందట. వీరు సాన్నిహిత్యం కోసం తమ సామర్థ్యాన్ని మించి ప్రయత్నాలు చేస్తారట. అందుకే వీరినిప పడకగదిలో డైనమైట్ అని పిలుస్తారట. అయితే వ్యక్తిగత విషయంలో ఇది భిన్నంగా ఉంటుందట. వీరు కొందరిని భయపెడతారట.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి చిరునవ్వే సక్సెస్ సీక్రెట్. వీరి చిరునవ్వుతో అందరి హ్రుదయాలను సులభంగా గెలుచుకుంటారట. వీరికి హ్యుమర్ సెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే సాహసం చేయడం, జర్నీ చేయడం, పూర్తి స్వేచ్ఛను పొందడం అంటే వీరికి బాగా ఇష్టమట.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి ఏ సమయం కూడా బోరింగ్ గా అనిపించదట. వీరు ఎవరైనా సులువుగా నమ్ముతారట. అందుకే వీరికి అద్భుతమైన జీవిత భాగస్వామి దొరుకుతారట. అయితే వీరు ఇతరులపై ఎక్కువ ఆధారపడుతూ ఉంటారట. అయితే వీరి బంధాలు చాలా బలంగా ఉంటాయట.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు చాలా సందర్భాల్లో తెలివిగా వ్యవహరిస్తారట. వీరు తమ కాళ్లపై తాము నిలబడతారట. వీరి వద్ద ఉన్న అద్భుతమైన సామర్థ్యంతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారట. వీరు నియమ నిబంధనల గురించి పెద్దగా పట్టించుకోరట. వీరు ఏ విషయాల్లోనూ విసుగు చెందరట.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారికి రొమాన్స్ అంటే చాలా ఇష్టమట. వీరికి ఎవరితో ఎలా రొమాన్స్ చేయాలో బాగా తెలుసట. వీరు విభిన్నమైన కలలను నెరవేర్చుకునేందుకు ఆసక్తిగా ఉంటారట. అయితే వీరు చాలా విషయాల్లో సున్నితంగా ఉంటారట.

English summary

What Is Your Most Attractive Trait, According to Your Zodiac Sign

Here we are talking about the what is your most attractive trait, according to your zodiac sign. Read on
Story first published: Thursday, October 14, 2021, 10:00 [IST]