For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ రోజున ఏ రాశి వారు ఏమి దానం చేయాలంటే...!

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈరోజును చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున ఏ పని చేపట్టినా కచ్చితంగా విజయం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

dd

అంతటి గొప్ప రోజైన అక్షయ తృతీయ 2023 ఏడాదిలో అది కూడా ఏప్రిల్ నెలలో 22వ తేదీన వచ్చింది. ఈ సమయంలో చాలా మంది బంగారంతో పాటు విలువైన వస్తువులు, కొత్త ఇంట్లోకి ప్రవేశం, కొత్త వాహనాలు కొనుగోలు చేయడం వంటివి ఈరోజే చేస్తారు.

What people of each zodiac sign should donate on Akshaya Tritiya for good luck

అదే సమయంలో ఈరోజు విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం, ఇతర వస్తువులు కొనడమే కాదు.. ఈ పవిత్రమైన రోజున విరాళం ఇవ్వడం ద్వారా అనేక ప్రయోజనాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్యశాస్త్రం రాశిచక్రాలను ప్రతి ఒక్కరూ ఈ వస్తువులను కచ్చితంగా దానం చేయాలట. ఇలా చేస్తే ఏడాది పొడవునా మీకు శుభ ఫలితాలొస్తాయట. ఇంతకీ ఏ రాశి వారు ఏమేమి దానం చేయాలో చూసెయ్యండి మరి.

Akshaya Tritiya 2022:అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ఆ పనులు చేయకండి...!Akshaya Tritiya 2022:అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ఆ పనులు చేయకండి...!

మేష రాశి..

మేష రాశి..

అక్షయ తృతీయ రోజున ఈ రాశి వారు పప్పు దాన్యాలు, గోధుమలు, ఎర్రటి పువ్వులు, ఎర్రని రంగులో ఉండే వస్త్రాలు, రాగి వంటి వాటిని దానం ఇవ్వడం వల్ల మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మీ ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున ఆవులు, దూడలు, వజ్రాలు, బియ్యం, పర్ఫ్యూమ్ మరియు నీలి రంగు బట్టలను దానం ఇవ్వడం వల్ల మీ జీవితంలో ఏవైనా అడ్డంకులుంటే, వైవాహిక జీవితంలో ఇబ్బందులుంటే తొలగిపోతాయి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున పప్పు దాన్యాలు, బంగారం, పచ్చని రంగులో ఉండే వస్త్రాలు, కూరగాయలు, మనీ ప్లాంట్ వంటి వాటిని విరాళంగా ఇవ్వడం వల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు అధ్యయనాలు మరియు కమ్యూనికేషన్ పై ఏకాగ్రత పెరుగుతుంది.

Akshay Tritiya 2021: మీ రాశిని బట్టి అక్షయ తృతీయ రోజున కొనాల్సినవి ఇవే...!Akshay Tritiya 2021: మీ రాశిని బట్టి అక్షయ తృతీయ రోజున కొనాల్సినవి ఇవే...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున చక్కెర, బియ్యం, నెయ్యి, పాలు, పెరుగు, నీరు, వెండి, తెలుపు రంగులో ఉండే బట్టలను మరియు ముత్యాల వంటి వాటిని దానం ఇస్తే శుభ ఫలితాలొస్తాయి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున సింధూరం, కొవ్వొత్తులు, కర్పూరం, రాగి, ఎరుపు రంగులో ఉండే వస్త్రాలను దానంగా ఇవ్వాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున కూరగాయలు, మొక్కలు, ఆకుపచ్చ రంగులో ఉండే బట్టలు, గ్రీన్ కలర్లో ఉండే గాజులు, పుస్తకాలు, స్టేషనరీ వంటి వాటిని విరాళంగా ఇవ్వడం వల్ల మీకు ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజు పాల ఉత్పత్తులు, నీలి రంగులో ఉండే వస్త్రాలు, నీలి రంగులో ఉండే గాజులు, పర్ఫ్యూమ్ తో పాటు సౌందర్య సాధనాల వంటి వాటిని విరాళంగా ఇస్తే మంచి ప్రయోజనాలు దక్కుతాయి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజు సింధూరం, రెడ్ కలర్ గాజులు, లిప్ స్టిక్, నెయిల్ పాలిష్, గంధపు చెక్క, ఎరుపు రంగులో ఉండే వస్త్రాలను విరాళంగా ఇస్తే.. మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ అధిగమిస్తారు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున మతపరమైన పుస్తకాలు, స్టేషనరీ, పసుపు రంగులో ఉండే బట్టలు, పాత్రలు, పుష్పరాగం, తీపి అన్నం వంటి వాటిని దానంగా ఇస్తే మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మరియు ఉద్యోగులకు ప్రమోషన్ లభించి, కెరీర్లో మరింత ముందుకు వెళ్లొచ్చు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున నల్లని వస్త్రాలు, పెన్ను, ఇనుప పాత్రలను దానం చేస్తే మీరు ఆధ్యాత్మికంగా మరియు రాజకీయ జీవితంలో మంచి విజయం సాధిస్తారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున ఆవాల నూనె, కొబ్బరి నీళ్లు, గొడుగు, దుప్పటి, బూట్లు మరియు ఏడు రకాల ధాన్యాలను విరాళంగా ఇవ్వడం వల్ల మీకు చాలా సందర్భాలలో విజయం లభిస్తుంది.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున బంగారం, పుస్తకాలు, యూనిఫామ్, పసుపు వంటి వాటిని విరాళంగా ఇవ్వడం ద్వారా మంచి ప్రయోజనాలు దక్కుతాయి.

FAQ's
  • 2022లో అక్షయ తృతీయ ఎప్పుడొచ్చింది?

    సనాతన ధర్మం ప్రకారం, అక్షయ తృతీయ రోజును చాలా పవిత్రంగా భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అంటే 2022లో మే 03వ తేదీ మంగళవారం నాడు ఈ పవిత్రమైన పండుగ వచ్చింది. ఈరోజున శుభకార్యాలు చేయడానికి చాలా పవిత్రమైనదని నమ్ముతారు. ఈరోజున కచ్చితంగా బంగారం, వెండిని కొనాలని చాలా మంది ఆశపడతారు.

English summary

What people of each zodiac sign should donate on Akshaya Tritiya for good luck

Here we are talking about the what people of each zodiac sign should donate on Akshaya Tritiya for good luck. Have a look
Desktop Bottom Promotion