Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మీ బాడీలోని పుట్టుమచ్చలు మీ గురించి ఏం చెబుతున్నాయంటే...
మీ బాడీలోని పుట్టుమచ్చలు మీ గత జన్మ గురించి ఎలాంటి రహస్యాలు చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో ప్రతి ఒక్కరికీ పుట్టినప్పటి నుండే పుట్టుమచ్చలు అనేవి మన చర్మంపై సహజంగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ పుట్టుమచ్చలు చాలా మందిలో ఒకటి లేదా రెండు మాత్రమే ఉంటాయి.

మరికొందరికి అంతకన్నా ఎక్కువగా కూడా ఉంటాయి. ఇవి మన బాడీలో అంత ముఖ్యమైనవి కాదు. అందుకే కొందరు వీటిని తొలగిస్తుంటారు. ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పుట్టుమచ్చలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మరియు తన భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

మీ బాడీలో ఉండే పుట్టుమచ్చల స్థానాన్ని బట్టి మీ భవిష్యత్తును అంచనా వేయొచ్చట. అయితే మచ్చలతో మీ గత జన్మ గురించి కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి మీకు ఎక్కడెక్కడ ఎలాంటి పుట్టుమచ్చలున్నాయి.. దాన్ని బట్టి మీరు గత జన్మలో ఎలా జీవించారు.. ఏయే పనులు చేశారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నుదుటిపై ఉంటే..
మీ నుదుటిపై ఎర్రని లేదా గోధుమ రంగులో పుట్టుమచ్చ ఉందా? అయితే మీరు గత జన్మలో విషపూరితమైన బాణం వల్ల కలిగిన గాయంతో చనిపోయినట్లు అర్థమట. అంతే కాదు ఇప్పుడున్న వారిలో మీ నుదుటి భాగంలో ఎడమ వైపు భాగంలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు ఎల్లప్పుడూ నిరాశ కలుగుతుందట. మీ జీవితంలో మీరు చాలా నష్టపోతారని అర్థమట. అదే నుదుటి మధ్యలో ఉంటే మీరు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు పొందుతారట. మీకు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుందట.

అలాంటి మచ్చలు..
మీ శరీరంలోని ఒకే ప్రాంతంలో ఏదైనా మందు స్ప్రే చేసినట్లు మచ్చలు మచ్చలుగా పుట్టుమచ్చలు ఉంటే అర్థమేంటో తెలుసా.. మీరు గత జన్మలో ఏదో తీవ్ర గాయంతో మరణించినట్లు దాని అర్థమట.

గొలుసు మాదిరిగా..
మీ శరీరంలో ఏదైనా బ్రాండెడ్ మచ్చ ఉంటే.. మీరు గత జన్మలో ఏదైనా నేరం చేయడం వల్ల.. అలాంటి మచ్చలతో శిక్ష వేశారని అర్థమట. లేదా ఏదైనా గొలుసు మాదిరిగా ఉంటే పుట్టుమచ్చ ఉంటే... మిమ్మల్ని గత జన్మలో గొలుసులతో లాక్కెళ్లి బంధించారని అర్థమట.

గాయం మాదిరిగా..
మీ బాడీలో కాలిపోయిన మాదిరిగా లేదా కత్తితో గాయం చేసినట్టు పుట్టుమచ్చ ఉంటే.. గతంలో మిమ్మల్ని ఎవరో కత్తితో గాయం చేయడం వల్ల మీరు మరణించినట్లు అర్థమట. దానికి సంబంధించిన మచ్చ ఈ జన్మలో మీకు పుట్టుమచ్చగా కనిపిస్తుందట.

బుల్లెట్ సైజులో..
మీ బాడీలో ఎక్కడైనా బుల్లెట్ మార్క్ వంటి పెద్ద పుట్టు మచ్చ ఉంటే.. మీరు గత జన్మలో బుల్లెట్ గాయంతో మరణించినట్లు అర్థమట. ఆ గాయం తాలూకు గుర్తు మీ బాడీపై మచ్చలా కనిపిస్తుందట.

ముక్కు మీద ఉంటే..
మీకు ముక్కుమీద పుట్టుమచ్చ ఉంటే.. మీరు ఇంటిలిజెన్స్ కు సంబంధించిన విభాగాల్లో నైపుణ్యం సంపాదిస్తారు. మీకు సమాజంలో కీర్తి మరియు జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన ప్రతిభను కలిగి ఉంటారు. అయితే మీరు రిస్క్ తీసుకుని ప్రమాదకరమైన మార్గాలలో వెళ్తే మీకు మరణం తప్పకపోవచ్చు.



Click it and Unblock the Notifications