Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
మీకు అలాంటి కలలొస్తే.. త్వరగా కోటీశ్వరులవుతారట...!
ఎలాంటి కలలొస్తే మీరు ధనవంతులవుతారో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.
మనలో నిద్రలోకి జారుకున్న ప్రతి ఒక్కరికీ కలలు రావడం అనేది అత్యంత సహజం. అయితే యవ్వనంలో ఉన్న వారికి ఎక్కువగా రొమాన్స్ కు సంబంధించిన కలలు వస్తుంటాయి. అయితే కొందరికి భయంకరమైన పీడకలలు వస్తుంటాయి.

దీంతో నిద్రలో నుండి హఠాత్తుగా లేస్తారు. అయితే వెంటనే ఒక గ్లాసు మంచి నీళ్లు తాగి మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. అలాంటి సమయంలో దేవుడిని నమ్మేవారు... తమ ఇష్టదైవాన్ని తలచుకుంటూ మెల్లగా నిద్రపోతారు. అయితే కలలు అనేవి మన చుట్టూ ఉండే వాతావరణం, మన ఆలోచనలు, ఆశలు, ఆశయాలన్నింటికీ ప్రతిరూపమని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, సైకాలజీ నిపుణులు కలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. మీకు కలలో కొన్నిసార్లు కనిపించే విషయాలు నిజమవుతాయని.. అవి మీ భవిష్యత్తును కళ్లకు కట్టినట్టు చూపుతాయట. అంతేకాదు.. ఇలాంటి కలలు వస్తే మీరు అత్యంత త్వరగా ధనవంతులుగా మారిపోతారట. ఈ సందర్భంగా ఎలాంటి కలలు వస్తే మీరు రిచ్ గా మారతారు.. మీకు వచ్చే కలలో ఇవి కనిపిస్తే.. వాటి అర్థాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సాగరం కనిపిస్తే..
మీరు గాఢనిద్రలో ఉన్నప్పుడు.. కలలోకి జారుకోవడం అనేది సర్వసాధారణం. మనలో మానసిక ప్రశాంతత లోపించినప్పుడు జరిగే సంఘటనల సమయంలో కడలికి సంబంధించిన కలలు వస్తుంటాయట. అయితే మీరు బాగా నిద్రపోతున్నప్పుడు.. మీకు వచ్చే కలలో సాగరం కనిపించినా.. కెరటాలు కనిపించినా.. అది చాలా శుభప్రదమైన విషయానికి సంకేతమట. ఎందుకంటే సాగరంలో ప్రవహించే నీరు లక్ష్మీదేవికి ప్రతిరూపమని చెబుతున్నారు. సాగరంలో చంద్రుడు, ఇతర గ్రహాలు సంకర్షణ చెందుతాయి. అందుకే మీకు వచ్చే కలలో సాగరం కనిపిస్తే.. మీ సంపద అమాంతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ప్రాయిడ్ ప్రకారం.. కలలో సముద్రం దూరంగా కనిపిస్తుంటే.. మీకు విశ్రాంతి లేని విషయాన్ని సూచిస్తుందట.

జోరు వర్షం..
ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల జోరు వర్షం కురిసింది. ఇదిలా ఉండగా.. మీరు బాగా నిద్రపోతున్నప్పుడు జోరుగా వర్షం కురుస్తున్నట్లు కల కంటే.. మీ రిలేషన్ షిప్ లో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలుంటాయట. అయితే మీరు దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కల వచ్చినప్పుడు మరో శుభవార్త కూడా వినిపిస్తుంది. అదేంటంటే.. మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించినా.. ఇప్పటికే ఏదైనా వ్యాపారంలో ఉంటే అందులో తప్పక విజయం సాధిస్తారు.

ఇలా జరిగితే..
కొందరికి నిద్రలోకి జారుకున్న వెంటనే ప్రతికూల విషయాలకు సంబంధించిన కలలు ఎక్కువగా వస్తుంటాయట. దీంతో చాలా కంగారు పడతారు. అయితే అలాంటి సమయంలో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పని లేదట. ఉదాహరణకు ఎవరైనా బాడీలో నుండి బ్లడ్ కారుతున్నట్లు కలలొస్తే.. అది శుభ పరిణామానికి సూచికగా ఉంటుందట. అదే విధంగా తమను ఎవరైనా చంపేందుకు ప్రయత్నించినట్టు కల గంటే.. మీ రియల్ లైఫ్ లో విపరీతంగా ఆస్తులు పెరుగుతాయట.

ఫుడ్ గురించి కలలొస్తే..
మీరు కలలో ఏవైనా ఫ్రూట్స్ తీసుకుంటున్నట్టు అనిపిస్తే.. మీకు అతి త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. ముఖ్యంగా మామిడికాయ, వాల్ నట్ వంటి వాటి వల్ల చాలా లాభాలు పొందుతారట. వీటితో పాటు సీఫుడ్, ఉల్లిపాయ, మీగడ, చక్కెర, పెరుగు, దానిమ్మ, పుచ్చకాయ వంటి పదార్థాలను తింటున్నట్టు కల కంటే.. మీకు అనుకోకుండా ఆదాయం పెరిగిపోతుందట.

చేపల గురించి..
మీకు వచ్చే కలల్లో చేపలు కనిపిస్తే.. అది శుభ ఫలితాలకు సంకేతమట. ముఖ్యంగా చేపలు అమ్మేవారిని చూస్తే.. మీ ఆదాయం అత్యంత వేగంగా పెరిగిపోతుందట.

అరుదుగా వస్తుంటాయి..
ఇలాంటి కలలు చాలా మందికి అరుదుగా వస్తుంటాయి. అయితే మీకు వచ్చే కలలో ఎప్పుడైనా తెల్ల ఎద్దు కనిపిస్తే.. మీరు భూమికి సంబంధించిన విషయాల్లో అనేక లాభాలు పొందుతారట. అంతేకాదు మీకు ఎంత ఖర్చు చేసినా.. తరగని సంపద లేదా భూమి పెరుగుతుందట. అంతేకాదు.. మీరు అదే తెల్ల ఎద్దుతో కలిసి ఆడుకుంటున్నట్లు కలలు గంటే.. రాబోయే 5 రోజుల్లో ఆదాయ పరంగా అద్భుత ఫలితాలొస్తాయట.

కలలో డబ్బులు..
చాలా మందికి ఇలాంటి కలలు ఎక్కువగా వస్తుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మీకు కూడా డబ్బులకు సంబంధించిన కలలు వస్తే.. మీ ఆదాయం పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయట. ఒకవేళ మీరు కలలో ఎవరికైనా డబ్బు ఇస్తున్నట్లు చూస్తే.. మీరు నిజ జీవితంలో కచ్చితంగా ధనవంతులవుతారట.

కోటీశ్వరుడి కలలు..
మనలో చాలా మంది కోటీశ్వరులు కావాలని కలలు కంటుంటారు. అయితే ఇలాంటి నిజ జీవితంలో నిజమవ్వడానికి ఇలాంటి కలలు వస్తే అవకాశం ఉందట. మీరు నదిలో స్నానం చేస్తున్నట్లు కల గంటే.. మీరు కచ్చితంగా కోటీశ్వరులవుతారట. అలాగే మీ తలపై మీరే కీరిటం పెట్టుకుంటున్నట్లు కలలు గంటే కూడా మీరు త్వరగా మీ కలను నిజం చేసుకుంటారట.



Click it and Unblock the Notifications
