Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
అమ్మాయిల అందమైన పెదాల వెనుక అన్ని రహస్యాలు దాగున్నాయా?
అమ్మాయిల అందమైన పెదాలను బట్టి వారి వ్యక్తిత్వం గురించి ఎలా తెలుసుకోవచ్చో చూడండి.
అమ్మాయిల అందాన్ని పెంచడంలో పెదవులు కీలకపాత్ర పోషిస్తాయి. వారు పెదాల రంగు ఎంత బాగుంటే వారి ఫేసులో అంత గ్లో పెరుగుతుంది. అందుకే చాలా అమ్మాయిలు తమ మేకప్ లో పెదాలకు వాడే లిప్ స్టిక్ కలర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.

అంతేకాదు పెదవులు ప్రతి వ్యక్తి యొక్క మొట్టమొదటి ఆకర్షణగా నిలుస్తాయి. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు చాలా మందికి ఎదుటి వ్యక్తిలోని పెదాలపైకే మొదటి చూపు వెళ్తుంది. మహిళల ఆకర్షణకు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పెదాలు ఉంటాయి.

అయితే మహిళలకు ఉండే అందమైన పెదాలను బట్టి వారి స్వభావానికి ప్రతిబింబంగా ఉంటుంది. అంతేకాదు ఈ పెదాలు వారి స్వభావాన్ని కూడా తెలియజేస్తాయని మీకు తెలుసా. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అమ్మాయిలకు ఉండే అందమైన పెదాలు వారి పర్సనాలిటీని తెలియజేస్తాయి. అదెలాగో తెలుసుకోవలానుకుంటే ఈ ఆర్టికల్ ను చూసి తెలుసుకుందాం రండి...

చిన్నగా ఉండే పెదాలు..
కొంతమంది అమ్మాయిలకు పెదాలు చాలా చిన్నగా ఉంటాయి. అయితే అవి వారికి చాలా అందంగా కనిపిస్తాయి. ఇలాంటి పెదాలకు లిప్ స్టిక్ వాడకపోయినా కూడా అందంగానే కనిపిస్తారు. ఇలా పెదవులు ఉండేవారు ఎక్కువగా మాట్లాడరు. చాలా మితంగా మాట్లాడతారు. అయితే వీరు చూడటానికి ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, వీరు కొన్ని పనులను చేయడంలో అసమర్థులుగా ఉంటారు.

పింక్ పెదాలు..
చాలా మంది అమ్మాయిలకు పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. అందుకే వారి పెదాలకు కూడా ఎక్కువగా ఆ రంగునే వేసుకుంటూ ఉంటారు. ఇక అసలు విషయానికొస్తే పింక్ పెదవులు ఉండే వారు చాలా వ్యూహాత్మకంగా మరియు చాలా తెలివైన వారు. వీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు వీరు ఎవరితోనై మంచి స్నేహాన్ని కొనసాగిస్తారు. ఈ రంగు పెదాలు ఉండే వారికి ఎలాంటి లోటు ఉండదు.

నల్లటి రంగు పెదవులు..
కొంతమంది మహిళలు అందరికంటే విభిన్నంగా ఉంటారు. వీరు బ్లాక్ కలర్ రంగును పెదాలకు వాడుతుంటారు. అయితే ఇలాంటి రంగులో ఉండే పెదాలు కలిగి ఉండేవారిని పోరాటానికి చిహ్నంగా చెబుతారు. అయితే వీరు తమ జీవితంలో ఎల్లప్పుడూ దుఃఖాన్ని ఎదుర్కొంటారు.

రెడ్ కలర్ పెదాలు..
అమ్మాయిలలో చాలా మందికి రెడ్ కలర్ లిప్ స్టిక్ అంటే చాలా ఇష్టం. ఏ పార్టీలకైనా.. ఫంక్షన్లకైనా.. బయట ఎక్కడికి వెళ్లినా తమ పెదాలకు రెడ్ కలర్ నే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి పెదాలు కలిగిన వారు ప్రతి పనిలోనూ చాలా శ్రద్ధగా ఉంటారు. అయితే వీరు స్వభావ రీత్యా చాలా కోపంగా.. అదే సమయంలో ఉత్సాహంగా, మొండిగా, ఆసక్తిగా, ధైర్యంగా ఉంటారు.

చిన్నగా ఉండే పెదాలు
రెండు పెదవులు చిన్నగా ఉండే వ్యక్తులకు చాలా అనుకూల ప్రయోజనాలు ఉంటార. వీరి స్వభావాన్ని తెలుసుకోవడం చాలా సులభం. ఈ వ్యక్తులు జీవితంలో గొప్ప పోరాటంతో పురోగమిస్తారు.

పెదాలు గట్టిపడితే..
అమ్మాయిలలో కొంతమందికి పెదవులు ఊరికే గట్టిపడుతుంటాయి. ఇలా ఉండే వారు చాలా నిర్లక్ష్యంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. కొందరు చంచలంగా ఉంటారు. అయితే వీరు ఏవైనా తినడానికి మరియు తాగడం వంటి విషయాల్లో చాలా ముందుంటారు.

మందంగా ఉండే పెదాలు..
కొంతమంది అమ్మాయిలకు పెదవులు చాలా బొద్దుగా ఉంటాయి. అయితే వారికి ఇవి మరింత అందాన్ని పెంచుతాయి. కానీ కొంతమందికి పెదాలు మరీ ఎక్కువగా ఉబ్బినట్టు అనిపిస్తుంది. ఇలాంటి వారు అంతగా అందంగా కనిపించరు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇలాంటి వ్యక్తులు కొంచెం కోపంగా ఉంటారు. కానీ కొన్నిసార్లు వారు చాలా త్వరగా ఉద్వేగానికి లోనవుతారు. అంతేకాదు వీరు చాలా మొండి స్వభావం కలవారు.

జ్యూసి పెదవులు..
ఈ రకమైన పెదవులు ఉండే వారికి, పెదాలు ఎరుపు రంగులో ఉంటాయి. ఇలా ఉండే వారి స్వభావం చాలా సున్నితంగా ఉంటుంది. అయితే వీరు చాలా కళాత్మకంగా కనిపిస్తారు.



Click it and Unblock the Notifications











