Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Diwali 2021:దీపావళి వేళ రాశిచక్రాన్ని బట్టి ఇచ్చే గిఫ్టులతో జీవితాల్లో వెలుగులు నింపొచ్చు...!
మీ రాశిని బట్టి దీపావళి వేళ మీరు ఎలాంటి గిఫ్టులు ఇవ్వాలో తెలుసుకోండి.
మరి కొద్ది రోజుల్లో దీపావళి పండుగ రాబోతోంది. టపాసులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, రాకెట్లు, ఇంకా ఎన్నో క్రాకర్లు.. థౌజండ్ వాలా వంటి బాణసంచాతో ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.

అందుకే ఈ పండుగను చిన్నపిల్లాడి నుండి పండు ముసలి వారి వరకు అందరూ ఇష్టపడతారు. ఈ కాలంలో ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవిని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం దీపాలతో ఇంటిని అందంగా అలంకరిస్తారు.

ఈ పండుగ సందర్భంగా ఉద్యోగులకు తమ కంపెనీలు అద్భుతమైన బహుమతులు ఇచ్చి ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇప్పటికే చాలా మంది ఇంటి నుండి ఉద్యోగం చేస్తున్నప్పటికీ.. తమ కంపెనీ నుండి అద్భుతమైన గిఫ్టులను పొందారు. అదే విధంగా ఈ పండుగ సందర్భంగా చాలా మంది తమ స్నేహితులకు, బంధువులకు బహుమతులు ఇస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏ రాశి వారికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలి.. ద్వాదశ రాశుల వ్యక్తులకు ఎలాంటి బహుమతులు ఇష్టమనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి దీపావళి పండుగ సందర్భంగా క్రిస్టల్ లేదా ఏదైనా గాజు వంటి వస్తువులను బహుమతులుగా ఇవ్వొచ్చు. ఇలాంటి వస్తువులను ఇవ్వడం వల్ల వారితో మీ బంధం మరింత బలంగా మారుతుంది. ఇలాంటి వాటిని మేషరాశి వారు ఎక్కువగా ఇష్టపడతారట.

వృషభ రాశి..
ఈ రాశి వారికి దీపావళి సమయంలో మిఠాయిలు, తియ్యని చాక్లెట్లు, కొవ్వొత్తుల వంటి వాటిని గిఫ్టుగా ఇవ్వొచ్చు. దీని వల్ల మీ రిలేషన్ బలంగా మారుతుందట.

మిధున రాశి..
ఈ రాశి వారికి మంచి డ్రస్సును గిఫ్టుగా ఇస్తే వీరు చాలా సంతోషిస్తారట. అయితే మీరు గిఫ్టుగా ఇచ్చే డ్రస్ ఎల్లో కలర్లో ఉంటే, వీరికి చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. అంతేకాదు వీరి జీవితంలోనూ ఉన్నత స్థితిని సాధిస్తారట.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి దీపావళి సందర్భంగా వారి ఇంటికి అవసరమైన వస్తువులను బహుమతిగా ఇస్తే చాలా సంతోషిస్తారట. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇస్తే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తారట.

సింహ రాశి..
ఈ రాశి వారికి దీపావళి సమయంలో మంచి సువాసన గల కొవ్వొత్తులను లేదా చిన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను బహుమతిగా అందజేస్తే.. వీరు చాలా సంతోషిస్తారట.

కన్య రాశి..
ఈ రాశి వారికి దీపావళి తాజా మిఠాయిలు, పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని బహుమతిగా ఇవ్వొచ్చు. ఇలాంటి వాటిని ఇవ్వడం వల్ల మీకు వారితో ఉండే అపార్థాలన్నీ తగ్గిపోతాయట.

తుల రాశి..
ఈ రాశి వారికి దీపావళి సందర్భంగా కొత్త డ్రస్సు లేదా వారికి ఇష్టమైన పువ్వులను బహుమతిగా ఇవ్వాలట. ఇలాంటి వాటిని ఇవ్వడం వల్ల మీ బంధం బలంగా మారుతుందట. అంతేకాదు ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుందట.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి దీపావళి సందర్భంగా మేకప్ కిట్ వంటి వాటిని లేదా బ్యూటీ సంబంధించిన ఉత్పత్తులను బహుమతిగా ఇవ్వాలట. ఇలాంటి వాటిని ఇవ్వడం వల్ల భవిష్యత్తులో గొడవలు రాకుండా ఉంటాయట.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి దీపావళి సమయంలో డెకరేషన్ కు సంబంధించిన వస్తువులను బహుమతిగా ఇస్తే వారు బాగా సంతోషిస్తారట.

మకర రాశి..
ఈ రాశి వారికి దీపావళి వేళ వంటింటికి సంబంధించిన వస్తువులను బహుమతిగా ఇస్తే చాలా సంతోషిస్తారట. ఇలాంటి వాటిని ఇవ్వడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతుందట. దీని వల్ల వీరి కెరీర్ కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుదట.

కుంభ రాశి..
ఈ రాశి వారికి దీపావళి వంటి పవిత్రమైన సమయంలో మిఠాయిలు వంటి వాటిని బహుమతిగా ఇస్తే.. వారు చాలా సంతోషిస్తారట. దీని వల్ల మీ బంధం మరింత బలపడుతుంది.

మీన రాశి..
ఈ రాశి వారికి దీపావళి సమయంలో ఇంట్లో మంచి వాసన వచ్చే పర్ఫ్యూమ్ లేదా అగర్ బత్తీలు(ఉదికడ్లు) వంటి వాటిని బహుమతిగా ఇవ్వాలట. ఇలాంటి వాటిని ఇస్తే వారి కుటుంబంలో సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందట.
దీపావళి పండుగ సందర్భంగా చాలా మంది తమ బంధుమిత్రులకు తాజా పండ్లు, మిఠాయిలు, కొత్త డ్రస్సులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను బహుమతులుగా ఇస్తారు. ఇలాంటి వాటిని ఇవ్వడం వల్ల తమ బంధం మరింత బలపడుతుందని నమ్ముతారు.



Click it and Unblock the Notifications