For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ యోగాసనాల ద్వారా మీ జాతకంలో గ్రహాలను బలపర్చుకోవచ్చు...

మీ గ్రహం ప్రకారం మీరు ఎలాంటి యోగాసనం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. దీని ఆధారంగానే మన జీవితంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయని పండితులు చెబుతుంటారు.

Which Yog Will Be Auspicious For Which Planet in Telugu

మన జాతకంలోని గ్రహాలను బట్టి మనకు మంచి, చెడు ప్రభావాలను కలగజేస్తాయి. అయితే కొన్నిసార్లు జాతకంలో గ్రహాలు బలహీన పడటం వల్ల మన ఆరోగ్యం ప్రభావితం కావొచ్చు. అయితే గ్రహాల చెడు ప్రభావం మన మీద పడకుండా కొన్ని పరిహారాలు పాటిస్తుంటాం.

Which Yog Will Be Auspicious For Which Planet in Telugu

అయితే మనం యోగా చేయడం వల్ల గ్రహాల చెడు ప్రభావాలను కూడా తొలగించుకోవచ్చట. ఈ సందర్భంగా నవ గ్రహాలను బలోపేతం చేయడానికి ఏయే యోగాసనాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

International Yoga Day 2021 : యోగాలో కీలక ఆసనాలు.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు...!International Yoga Day 2021 : యోగాలో కీలక ఆసనాలు.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు...!

సూర్య నమస్కారం..

సూర్య నమస్కారం..

నవ గ్రహాలలో అధిపతిగా పరిగణించే సూర్యుడు మీ జాతకంలో బలంగా మారాలంటే ప్రతిరోజూ మీరు ఉదయాన్నే నిద్ర లేచి సూర్య నమస్కారం చేయాలి. ఇలా చేయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాదు మీరు ఒక లీడర్ అయ్యే లక్షణాలు కూడా పెరుగుతాయి. మీకు గుండెపోటు, రక్తహీనత, బలహీనమైన వ్యవస్థ వంటి వాటిని అధిగమించొచ్చు.

చంద్ర ప్రభావం..

చంద్ర ప్రభావం..

మీ జాతకంలో చంద్రుని ప్రభావం బలహీనంగా ఉంటే.. మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. దీని వల్ల మీ మానసిక స్థితి తరచుగా మారుతుంది. ఇలాంటి సమయంలో మీరు శ్వాసపై ఫోకస్ పెట్టాలి. ఉచ్ఛ్వాస, నిశ్వాసలను చేయాలి. ఇలాంటి యోగాసనం చేయడం వల్ల చంద్రుని చెడు ప్రభావాల నుండి దూరం తగ్గుతుంది. ఈ సమయంలో ఓం మంత్రాన్ని జపించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది.

పద్మాసనం..

పద్మాసనం..

మన జాతకంలో అంగారకుడు బలహీనంగా ఉంటే సోమరితనంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో అంగారకుని నుండి చెడు ప్రభావం తగ్గించుకోవడానికి మీరు పద్మాసనంలో కూర్చోని యోగా చేయాలి. దీంతో పాటు నెమలి ఆసనం వంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ శక్తి పెరుగుతుంది. అంగారకుని చెడు ప్రభావాలు తగ్గిపోతాయి.

International Yoga Day 2021: యోగాను ప్రపంచానికి పరిచయం చేసిందెవరో తెలుసా...International Yoga Day 2021: యోగాను ప్రపంచానికి పరిచయం చేసిందెవరో తెలుసా...

ప్రాణాయామం..

ప్రాణాయామం..

మీ జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే.. మీరు తీసుకునే నిర్ణయం సామర్థ్యాలపై ప్రభావం పడుతుంది. మీ మనసులో ఏవేవో చింతలు వస్తాయి. అంతేకాదు మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఇలాంటి వాటిని అధిగమించడానికి మీరు ప్రాణాయామం చేయాలి. దీని వల్ల మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. దీంతో పాటు ఉత్తరాసన, శీర్షాసనం వంటి వాటి వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది.

సర్వాంగాసనం..

సర్వాంగాసనం..

మీ జాతకంలో గురుడు బలహీనంగా ఉంటే.. మీరు కెరీర్ పరంగా మీరు విజయం సాధించలేరు. అంతేకాదు మీరు షుగర్, కొలస్ట్రాల్, కాలేయం, కడుపు సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు. వీటిని అధిగమించాలంటే.. మీరు సర్వాంగాసనంతో పాటు సూర్య నమస్కారానికి సంబంధించి 12 యోగాసనాలు చేయాలి.

భుజంగాసనం..

భుజంగాసనం..

మీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే మీ లైంగిక జీవితంపై ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. దీని వల్ల మీ దాంపత్య జీవితం ప్రభావితమవుతుంది. ఈ నేపథ్యంలో మీరు శుక్రుని చెడు ప్రభావాలను తగ్గించుకోవడానికి ధనురాసం, హలసానం, త్రిబంధ, మూల్భందం, ప్రాణాయామం వంటివి చేయాలి. మహిళలు రుతుస్రావం వంటి సమస్యలను తగ్గించుకోవడానికి భుజంగాసనం, సేతుబంధాసనం, గరుడాసనం లాంటివి చేయాలి.

మండూకాసనం..

మండూకాసనం..

మీ జాతకంలో శని బలహీనంగా ఉంటే.. మీరు కారణం లేకుండా సమస్యల్లో చిక్కుకుంటారు. వీటితో పాటు మీరు కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్య, నిద్రలేమి సమస్య, మానసిక నిరాశ కూడా ఉండొచ్చు. మీ వైవాహిక సంబంధాలు కూడా ప్రభావితం అవుతాయి. ఈ సమయంలో మీరు మండూకాసనం, అగ్రీసారా క్రియలు వంటివి చేయాలి.

శీర్షాసనం..

శీర్షాసనం..

మీ జాతకంలో కేతువు బలహీనంగా ఉంటే.. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో మీరు శీర్షాసనం, కపాల వంటి యోగాలు చేయాలి. రాహువు బలహీనంగా ఉంటే మీరు ఆ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు మీరు భ్రమరీ ప్రాణాయామం చేయాలి.

English summary

Which Yog Will Be Auspicious For Which Planet in Telugu

Here we are talking about which yog will be auspicious for which planet in Telugu. Read on
Desktop Bottom Promotion