For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Who is Gita Gopinath:గీతా గోపినాథ్ ఎవరు? IMFలో ఆ స్థాయికి ఎలా ఎదిగిందో తెలుసా...

గీతా గోపినాథ్ ఎవరు? ఐఎంఎఫ్ లో ఆ స్థాయికి ఎలా ఎదిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఇండియన్స్ టాలెంట్ ఇంటర్నేషనల్ లెవెల్ లో రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ లోని పలు కంపెనీలకు భారతీయులే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గూగుల్ కు సుందర్ పిచాయ్.. మైక్రోసాఫ్ట్ కు సత్య నాదెళ్ల.. ఇటీవలే ట్విట్టర్ సిఇఓగా భారతీయుడు పరాగ్ అగర్వాల్ కొత్త రికార్డు నెలకొల్పారు.

Who is Gita Gopinath? Know about IMFs First Deputy Managing Director in Telugu

ఇదిలా ఉండగా భారత మహిళలు సైతం అంతర్జాతీయంగా తమ సత్తా చాటుతున్నారు. వారి ప్రతిభతో భారతీయులందరూ గర్వపడేలా చేస్తున్నారు. తాజాగా International Monetary Fund(IMF)లో ఇండో-అమెరికన్ భారత సంతతి మహిళ ఓ కీలక పదవిని చేపట్టారు. ఇప్పటివరకు IMF ప్రధాన ఆర్థికవేత్తగా తన ప్రస్థానం కొనసాగించిన ఆమె.. అదే సంస్థలో ఇప్పుడు 'డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్'హోదాను సాధించారు.

Who is Gita Gopinath? Know about IMFs First Deputy Managing Director in Telugu

అంటే ఆ సంస్థలో తనదిప్పుడు రెండో స్థానం. ఈ విషయాన్ని IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియేవా గురువారం నాడు ప్రకటించారు. ఈ సందర్భంగా గీతా గోపినాథ్ ఎవరు? తను ఇంత ఉన్నతమైన స్థానానికి ఎలా చేరుకోగలిగిందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గీతా గోపినాథ్ స్పందన..

గీతా గోపినాథ్ స్పందన..

‘IMF ఫస్ట్ డిప్యూటీ మేనేజర్ గా ఎంపిక కావడం పట్ల ఆనందంగా ఉంది. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఫండ్ (IMF) పని చాలా కీలకమైనది. ఎంతోమంది నిపుణులపైన సహోద్యోగులతో కలిసి పని చేస్తూ.. ఈ సవాళ్లను అధిగమించేందుకు ఎదురుచూస్తున్నా' అని గీతా గోపినాథ్ ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశారు.

కోల్ కత్తాలో జననం..

కోల్ కత్తాలో జననం..

గీతా గోపినాథ్ 1971 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తాలో జన్మించారు. అయితే తన ప్రాథమిక విద్య అంతా మైసూరులోని నిర్మలా కాన్వెంట్ స్కూలులో పూర్తి చేశారు. ఉన్నత విద్యను మాత్రం ఢిల్లీలో పూర్తి చేశారు. లేడీ శ్రీరామ్ కాలేజీ ఫర్ ఉమెన్ లో బ్యాచ్ లర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. 1992 సంవత్సరంలో ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. గోతా గోపినాథ్ కు ఫ్యాషన్ రంగంలోనూ చాలా అనుభవం ఉంది. ఈమె ఢిల్లీ యూనివర్సిటీలో ఇక్భాల్ సింగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం 18 సంవత్సరాల రాహిల్ అనే అబ్బాయి ఉన్నాడు.

అమెరికాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా..

అమెరికాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా..

తనకు వాషింగ్టన్ యూనివర్సిటీలో ఇంకోసారి ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసే అవకాశం రావడంతో.. తన కలెక్టర్ ప్లాన్ ను పక్కనబెట్టారు. అనంతరం ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో స్కాలర్ షిప్ తో పిహెచ్ డి పూర్తిచేశారు. ఆ తర్వాత షికాగో యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరారు. 2010 సంవత్సరంలో హార్వర్డ్ యూనివర్సిటీలో ఫుల్ టైమ్ ప్రొఫెసర్ గా విధుల్లో చేరారు.

2018లో IMF ఛాన్స్..

2018లో IMF ఛాన్స్..

హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న సమయంలోనే.. తనకు 2018 సంవత్సరంలో IMFలో పని చేసేందుకు అవకాశం వచ్చింది. ఇక్కడ కూడా తన సత్తా చాటడంతో కేవలం మూడేళ్లలోపే ఈ సంస్థలో రెండో స్థానానికి ఎదిగింది. ఆమెకు అనూహ్యంగా ప్రమోషన్ రావడంతో తను ఇంకొంత కాలం IMFలో సేవలందించనుంది.

కరోనా సంక్షోభ సమయంలో..

కరోనా సంక్షోభ సమయంలో..

గీతా గోపినాథ్ అందించిన విశేష సేవలకు గుర్తింపుగా, ముఖ్యంగా కోవిద్-19 వంటి క్లిష్ట పరిస్థితుల్లో తను చూపిన ప్రతిభ కారణంగా ఆమెకు ఈ ప్రమోషన్ లభించింది. కోవిద్ కల్లోలంతో అల్లకల్లోలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ గాడిలో పడలేదు. ఇలాంటి కీలక సమయంలో తన సేవలు IMFకు చాలా అవసరమని భావించారు. అందుకే ఆమెకు కొత్త బాధ్యతలు అప్పగించారు.

FAQ's
  • IMF(అంతర్జాతీయ ద్రవ్య నిధి) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎంపికైన భారత మహిళ ఎవరు?

    భారతదేశంలోని కోల్ కతాకు చెందిన గీతా గోపినాథ్ అనే మహిళ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎంపికైంది.

English summary

Who is Gita Gopinath? Know about IMF's First Deputy Managing Director in Telugu

Here we are talking about the who is gita gopinath? know about IMF's deputy managing director in Telugu. Read on
Story first published:Friday, December 3, 2021, 14:34 [IST]
Desktop Bottom Promotion