Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Who Is Pradeep Mehra:రాత్రిపూట రన్నింగ్ చేస్తున్న ఓ కుర్రాడు.. ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు.. అదెలాగంటే...
ప్రదీప్ మెహ్రా ఎవరు? అతన్ని నోయిడా ప్రజలు ‘ప్యూర్ గోల్డ్’ అని ఎందుకు పిలుస్తారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో ప్రతి ఒక్కరూ తాము మంచి జాబ్ తెచ్చుకోవాలని.. ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటాం.. అయితే అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. ఎందుకంటే వారికి సంకల్పం, సాధించాలనే తపన, పట్టుదల చాలా ఎక్కువగా ఉంటాయి.

అందుకు నిదర్శనంగా ఈ కుర్రాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ యువకుడు కేవలం ఒక్క రాత్రిలోనే వైరల్ గా మారిపోయాడు. తను అర్థరాత్రి పూట రోడ్డుపై రన్నింగ్ చేస్తూ ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు.

తనతో రన్నింగులోనే మాట్లాడిన ఓ ఫిల్మ్ మేకర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో.. అది కాస్త వైరల్ అయిపోయింది. అంతే ఆ కుర్రాడు రాత్రికి రాత్రి హీరో అయిపోయాడు. తన లక్ష్యాన్ని కచ్చితంగా సాధిస్తాడని.. దేశవ్యాప్తంగా నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. విదేశీయులు సైతం తను కష్టపడుతున్న విధానాన్ని చూసి ముచ్చటేస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఇక నోయిడా ప్రజలైతే తనను 'మేలిమి బంగారం(Pure Gold)' అని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ వీడియోకు గంట గంటకు లైక్స్, వీవ్స్, షేర్లు వేగంగా పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వాడు? ఒక్క రాత్రిలోనే ఎలా ఫేమస్ అయ్యాడు. అతనితో అర్థరాత్రి కారులో వెళ్తూ ఎవరు మాట్లాడారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
నోయిడా రోడ్డుపై ఆదివారం అర్ధరాత్రి పూట ఓ యువకుడు భుజాలకు బ్యాగు తగిలించుకుని రోడ్డుపై రన్నింగ్ చేస్తుంటాడు. అప్పుడే పక్క నుండి కారు నడుపుకుంటూ వెళ్తున్న డైరెక్టర్ వినోద్ కాప్రీ కంట్లో పడ్డాడు. అదేంటి ఈ సమయంలో రన్నింగ్ చేస్తున్నావు.. కారు ఎక్కు.. ఎక్కడికి వెళ్లాలో చెప్పు.. లిఫ్ట్ ఇస్తా అని హిందీలో అడిగాడు. అయితే ఆ కుర్రాడు కారు ఎక్కడానికి నిరాకరించాడు. ఎందుకంటే తను ప్రతిరోజూ ఈ టైమ్ లోనే రన్నింగ్ చేస్తానని చెప్పాడు.
తను సెక్టార్ 16లోని మెక్ డొనాల్డ్స్ లో పని చేస్తున్నానని, అక్కడి నుండి తన ఇల్లు 10 కిలోమీటర్ల దూరంలో నోయిడాలో ఉందని చెబుతాడు. ప్రతిరోజూ ఇంటికి ఇలా రాత్రి వేళ రన్నింగ్ చేస్తానని చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోయిన డైరెక్టర్ ఎందుకని అడిగితే.. తాను ఆర్మీలో చేరేందుకు ప్రిపేర్ అవుతున్నానని, అందుకే ఇలా ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పాడు. అయితే మార్నింగ్ రన్నింగ్ చేయొచ్చు కదా.. అంటే ఉదయం పనులు, వంట చేసుకుని 8 గంటల లోపు రెస్టారెంట్ కి వెళ్లాలని, అందుకే అర్ధరాత్రి వేళ రన్నింగ్ చేస్తున్నానని చెప్పాడు.
ఇంతకీ ఆ కుర్రాడి పేరేంటంటే.. ప్రదీప్ మెహ్రా. తన సొంతూరు ఉత్తరాఖండ్ లోని అల్మోరా అని, తన వయసు 19 సంవత్సరాలని ఆ డైరెక్టర్ అడిగిన ప్రశ్నలన్నింటికీ రన్నింగ్ చేస్తూనే సమాధానం చెబుతాడు. తను ఒంటి చెమట చుక్కలు కారడం చూసిన డైరెక్టర్ తనతో వచ్చి డిన్నర్ చేయమన్నా.. కూడా ప్రదీప్ వద్దన్నాడు. ప్రస్తుతం తన సోదరుడితో కలిసి ఉంటున్నాననీ, తాను ఇంటికి వెళ్లి వంట చేసుకుని, తమ్ముడితో కలిసి తింటానని చెప్తాడు. మరోరోవైపు తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉందని చెబుతాడు.
మళ్లీ కారెక్కితే త్వరగా వెళ్లొచ్చు కదా, అంటే ప్రదీప్ మళ్లీ వద్దన్నాడు. ఎందుకంటే ఇప్పుడు కారెక్కితే, తన డైలీ ప్రాక్టీస్ దెబ్బతింటుందని రిప్లై ఇచ్చాడు. అతని పట్టుదల చూసిన డైరెక్టర్ వినోద్ షాకయ్యారు. తనకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతే కాదు చివర్లో నేను ఇదంతా వీడియో తీశాను. నువ్వు వైరల్ అవుతావంటే.. నేనేమీ తప్పు చేయలేదు కదా సార్.. అని అంటాడు. అనంతరం వినోద్ కాప్రీ తన ట్విట్టర్ అకౌంట్లో ఆదివారం అర్ధరాత్రి మార్చి 20న ఈ వీడియో పోస్ట్ చేస్తూ 'ప్యూర్ గోల్డ్' అంటే అతనే టైటిల్ పెట్టారు. అంతే ఈ వీడియోను ఒక్కరోజులోనే 47 లక్షల మందికి పైగా చూశారు. చూస్తున్నారు. 2 లక్షల మందికి పైగా లైక్ చేశారు.



Click it and Unblock the Notifications