Latest Updates
-
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు!
Who is Praggnanandhaa:చెన్నై చిన్నోడి దూకుడు.. వరల్డ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ నే ఓడించేశాడు...
ఎవరీ ప్రజ్ణానంద? మాస్టర్ చెస్ ఛాంపియన్లో వరల్డ్ ఛాంపియన్ ను ఎలా ఓడించాడనే వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ ఓ లుక్కేయండి.
మనలో చాలా మందికి చెస్ పేరు చెప్పగానే విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల సన్ పేర్లే ఎక్కువగా గుర్తొస్తుంటాయి. ఎందుకంటే వారు ప్రపంచ చెస్ ఛాంపియన్లుగా నిలిచారు. వీరిని ఓడించడం ఎవ్వరి తరం కాదు అని చాలా మంది అనుకునేవారు.

వారు కూడా తమ స్థాయిని అలానే నిలుపుకుంటూ వచ్చేవారు. అయితే తాజాగా వరల్డ్ ఛాంపియన్ ను సైతం ఓ కుర్రాడు ఓడించాడు. అది కూడా మన దేశానికి చెందిన చెన్నై చిన్నోడు కావడం విశేషం. 'ఎయిర్ థింగ్స్ మాస్టర్స్ ఆన్ లైన్ చెస్ టోర్నమెంట్లో భాగంగా ఎనిమిదో రౌండ్లో అతడు కార్ల్ సన్ ని ఓడించాడు.

నల్లని పావులతో ఆడిన 16 సంవత్సరాల కుర్రాడు కేవలం 39 ఎత్తుల్లోనే మాగ్నస్ కార్ల్ సన్ ను ముప్పుతిప్పలు పెట్టి ఆటను ముగించేశాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు? ఇంత చిన్న వయసులోనే ప్రపంచ ఛాంపియన్ ను ఎలా ఓడించగలిగాడు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
చిన్నప్పటి నుంచే చెస్ లో ఛాంపియన్..
ప్రజ్ణానంద తమిళనాడులోని చెన్నై నగరంలో 10 ఆగస్టు 2005 సంవత్సరంలో నాగలక్ష్మీ, రమేష్ బాబు దంపతులకు జన్మించాడు. 2013 సంవత్సరంలోనే ఈ చెన్నై చిన్నోడు అండర్-8 వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచాడు. అనంతరం రెండు సంవత్సరాల తర్వాత 2016 సంవత్సరంలో అండర్-10 టైటిల్ సైతం తన ఖాతాలో వేసుకున్నాడు.2018(12 ఏళ్ల 10 నెలల 13 రోజుల వయసులో) సంవత్సరంలో తొలిసారిగా 'గ్రాండ్ మాస్టర్' టైటిల్ తన వశం చేసుకున్నాడు. మూడు సంవత్సరాల వయసులోనే అక్క వైశాలితో కలిసి చెస్ ఆడటం మొదలుపెట్టాడు ఈ చిచ్చరపిడుగు. తన సోదరి కూడా చెస్ క్రీడాకారిణి కావడం మరో విశేషం. తను 2018 సంవత్సరంలో విమెన్ గ్రాండ్ మాస్టర్, 2021లో ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిళ్లను సాధించారు.
మూడో భారతీయుడిగా..
మాగ్నస్ కార్ల్ సన్ ను ఓడించిన మూడో భారతీయుడిగా ప్రజ్ణానంద్ రికార్డుల్లోకెక్కాడు. తన కంటే ముందు విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరిక్రిష్ణ చెస్ ఛాంపియన్ మాగ్నస్ ను ఓడించారు. ఈ సందర్భంగా ప్రజ్ణా మాట్లాడుతూ 'వరల్డ్ ఛాంపియన్ కార్ల్ సన్ ని ఓడించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఫ్యూచర్లో ఇదే స్ఫూర్తితో రెట్టింపు స్థాయిలో రాణించేందుకు ప్రయత్నిస్తాను. మ్యాచ్ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని ఫ్యూచర్ టోర్నమెంట్లపై ఫోకస్ పెడతాను. మాగ్నస్ కార్ల్ సన్ తో మ్యాచ్ ఆడేందుకు ప్రత్యేక వ్యూహాలేమీ ప్లాన్ చేయలేదు. తనతో ఆడుతున్నంత సేపూ ఒత్తిడికి గురికాకుండా కేవలం గేమ్ ఎంజాయ్ చేశాను' అని ప్రజ్ణా చెప్పారు.
16 సంవత్సరాల వయసులోనే ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ పై విజయం సాధించిన ప్రజ్ణానంద్ పై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, చెస్ ఛాంపియన్లు విశ్వనాథన్ ఆనంద్, పి.హరిక్రిష్ణ, ఆలిండియా చెస్ ఫెడరేషన్ అధ్యక్షులు సంజయ్ కపూర్, తదితరులు ఈ కుర్రాడికి విషెస్ చెబుతూ ట్వీట్లు చేశారు.



Click it and Unblock the Notifications