For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Women's Day 2021:రోహిణి సింధూరి ఎవరు? డైనమిక్ కలెక్టర్ గా ఎలా గుర్తింపు తెచ్చుకున్నారు?

|

సాధారణంగా ఒక జిల్లా కలెక్టర్ అంటే సకల సదుపాయాలు, ఎంతో మంది భద్రతా సిబ్బంది, చాలా మంది గుమాస్తాలు, ఇతర సిబ్బంది ఎంతమంది ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే రోడ్ల మీద వాహనాలలో వెళ్లేటప్పుడు, ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ కు వెళ్లినప్పుడు టైర్లు పంక్చర్లు అవ్వడం కామన్. అలా జరిగినప్పుడు ఆ టైరు మార్చుకుని స్టెఫ్నీ వేసుకుని ప్రయాణం సాగించడం చాలా కామన్. కానీ, అలా టైర్లు మార్చే వారిలో ఓ అమ్మాయి అయితే.. అది ప్రత్యేకమే కదా.. అంతేకాదు.. ఆమె ఓ జిల్లాకు కలెక్టర్ అయితే.. అందరికీ ఆదర్శమే కదా.. అందులోనూ ఆ కలెక్టర్ మన తెలుగుమ్మాయి అయితే మనందరికీ గర్వకారణమే. అలా కారు టైరు మారుస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ రోహిణి సింధూరి. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

International women's day 2021:ప్రతి ఒక్క అమ్మాయికీ ప్రేరణనిచ్చే మహిళలు వీరే...

ఎంతో నిజాయితీగా..

ఎంతో నిజాయితీగా..

కర్నాటక రాష్ట్రంలో కలెక్టర్ గా పని చేసే మన తెలుగమ్మాయి రోహిణి సింధూరి తన హోదాను పక్కనబెట్టి తన పనులు తానే చేసుకుంటుంది. ఎల్లప్పుడూ నిరాడంబరతను చాటుకుంటారు. అయితే రోహిణి సింధూరి డ్యూటీలో కూడా ఎంతో నిజాయితీగా ఉంటారు.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లోని రుద్రాక్షపల్లిలో పుట్టిన దాసరి రోహిణి.. హైదరాబాదులో పెరిగారు. ఇంజనీరింగ్ చదివిన ఆమె దేశ రాజధాని ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. 2009లో సివిల్స్ సాధించి కర్నాటక క్యాడర్ నుండి ఐఏఎస్ గా ఎంపికయ్యారు.

తెలుగు రాష్ట్రాలతో అనుబంధం..

తెలుగు రాష్ట్రాలతో అనుబంధం..

అనంతరం కలెక్టర్ రోహిణి సింధూరి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుధీర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. అలా ఆమెకు రెండు తెలుగు రాష్ట్రాలతో అనుబంధం ఉంది. ప్రస్తుతం ఆమె మైసూరు జిల్లా కలెక్టర్ గా కొనసాగుతున్నారు. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె తెలుగు, కన్నడ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.

#HimaDas: హిమదాస్ ఎవరు? ఇంత చిన్న వయసులో డిఎస్పీ ఎలా అయ్యిందో తెలుసా...

డైనమిక్ కలెక్టర్ గా..

డైనమిక్ కలెక్టర్ గా..

రోహిణి సింధూరికి కర్నాటకలో డైనమిక్ కలెక్టర్ గా మంచి గుర్తింపు ఉంది. ఈమెకు చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. డ్యూటీలో ఉన్నప్పుడు ఎంతటి వారినైనా అస్సలు లెక్కచేయరు. నిజాయితీగా, నిక్కచ్చిగా, ముక్కుసూటితనంగా మాట్లాడతారనే పేరుంది.

ఎన్నికల కోడ్ సమయంలో..

ఎన్నికల కోడ్ సమయంలో..

ఆమె హాసన్ జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో.. ఓసారి ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. అధికార పార్టీ మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీనిపై కలెక్టర్ రోహిణి సీరియస్ అయ్యారు. అంతేకాదు యాక్షన్ కూడా తీసుకున్నారు. అయితే దీన్ని అవమానంగా భావించిన తను ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి ఆమెను ట్రాన్స్ ఫర్ చేయించారు.

కోర్టులో విజయం సాధించి..

కోర్టులో విజయం సాధించి..

అయితే తన ట్రాన్స్ ఫర్ ను సవాల్ చేస్తూ తను తిరిగి అదే జిల్లాకు కలెక్టర్ గా కొనసాగారు. అయితే ఆమెకు ఆ ధైర్యం అంత తేలిగ్గా వచ్చిందేమీ కాదు. తను సివిల్స్ పరీక్షకు ముందు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇబ్బందులు పడుతూనే సివిల్స్ పరీక్ష రాశారు. అయినా కూడా మంచి ర్యాంక్ సాధించారు. కర్నాటకలో పలు జిల్లాల్లో సమర్థవంతమైన కలెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

నిరుపేదలకు ప్రాధాన్యం..

నిరుపేదలకు ప్రాధాన్యం..

స్వచ్ఛమైన పాలన.. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మండ్య జిల్లాలో ఒక్క ఏడాదిలోనే లక్ష వరకు మరుగుదొడ్లు కట్టించి అందరికీ అవగాహన కల్పించడంలో ఎంతో కీలకపాత్ర వహించారు. రైతులకు కరువు సహాయం వచ్చేలా చూడటంతో పాటు కల్పామ్రుత ప్రాజెక్టు ద్వారా కొబ్బరి నీళ్లను ఎలా మార్కెంటింగ్ చేయొచ్చో చేసి చూపించారు.

ఎవరి సాయం లేకుండా..

ఎవరి సాయం లేకుండా..

ఇదిలా ఉండగా ఇటీవల రోహిణి సింధూరి తన కారు టైరు తానే స్వయంగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.. ఫ్యామిలీతో కలిసి కారును డ్రైవ్ చేసుకుంటు వెళ్తున్న సమయంలో, సడన్ గా పంక్చర్ అయిన సమయంలో.. తను ఎవరి సాయం కోరకుండా తానే అందుబాటులో ఉన్న పనిముట్లతో చకచకా టైరును మార్చేశారు. ఈ సంఘటనను చూసిన కొందరు ఈ ద్రుశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఈ వీడియో బాగా వైరల్ అయిపోయింది.

English summary

Who is Rohini Sindhuri? All you need to know about the IAS Officer

Here we are talking about the who is rohini sindhuri? All you need to know about the IAS officer. Read on
Story first published: Saturday, March 6, 2021, 11:23 [IST]