For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Yoga Day 2022 : యోగా ఎప్పుడు, ఎక్కడ పుట్టింది... యోగా వల్ల ఎన్ని లాభాలో తెలుసా...

యోగా ఎప్పుడు జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారు. అసలు ఇది ఎక్కడ పుట్టింది. దీని వల్ల కలిగే లాభాలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం

|

ఈ ప్రపంచానికి భారతదేశం ఎన్నో అద్భుతాలను అందించింది. అందులో ప్రముఖమైన వాటిలో యోగా ఒకటి. శారీరక, మానసిక ఆరోగ్యం అందించే యోగాకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది.

Who is the Father of Yoga

కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ యోగాకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2015లో జూన్ 21వ తేదీని 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'గా ప్రకటించారు.

Who is the Father of Yoga

భారతదేశం అందించిన అద్భుతాలలో ఒకటైన యోగాను పురస్కరించుకుని, జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలకు పైగా కోట్లాది మంది యోగా చేస్తుంటారు.

Who is the Father of Yoga

అయితే ఈ యోగా ఎప్పుడు మొదలైంది? ఎక్కడ ప్రారంభించారు? అసలు యోగాకు గాడ్ ఫాదర్ ఎవరు? యోగా వల్ల కలిగే లాభాలేంటి అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

<strong>సులువైన యోగాతో మలబద్ధకానికి బై బై చెప్పండి...</strong>సులువైన యోగాతో మలబద్ధకానికి బై బై చెప్పండి...

వివేకానందుడు

వివేకానందుడు

చరిత్రను పరిశీలిస్తే సుమారు 5 వేల ఏళ్ల క్రితమే మన దేశంలో యోగా అనేది ఉండేది. అయితే స్వామి వివేకానంద పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేసి, దీన్ని వ్యాప్తి లోకి తెచ్చారు.

యోగా అంటే..

యోగా అంటే..

యోగా అనేది 5 వేల సంవత్సరాల క్రితమే, అంటే వేద కాలంలోనే దీని గురించి మన దేశంలో చెప్పబడింది. దీనిలో ఉన్న జ్ణానం యొక్క అంతర్భాగం. చాలా మందికి యోగా అంటే శారీరక వ్యాయామం, కేవలం కొన్ని శారీరక కదలికలు(ఆసనాలు) వంటి ప్రక్రియ మాత్రమే అనుకుంటారు. కానీ యోగా అనేది మనిషి యొక్క అనంతమైన మేధాశక్తి, ఆత్మశక్తి కలయిక.

యోగాలలోని రకాలు..

యోగాలలోని రకాలు..

విజ్ణాన శాస్త్ర పరంగా యోగా అంటే పరిపూర్ణ జీవన విధానం. ఇందులో జ్ణాన యోగము (తత్వశాస్త్రం), భక్తి యోగం, రాజయోగం మరియు కర్మ యోగాలు ఉన్నాయి. యోగసాలు అంటే రాజయోగ ప్రక్రియలో పైన ఉన్న యోగాలన్నింటిలో సమతుల్యాన్ని ఏకత్వాన్ని తీసుకొస్తాయి.

కామసూత్రాల్లో లైంగిక విషయాల గురించి 20% మాత్రమే... మరి మిగిలిన విషయాలేంటో తెలుసా?కామసూత్రాల్లో లైంగిక విషయాల గురించి 20% మాత్రమే... మరి మిగిలిన విషయాలేంటో తెలుసా?

యోగాతో లాభాలెన్నో..

యోగాతో లాభాలెన్నో..

యోగా వల్ల మానవ శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. యోగసనాల వల్ల మన శరీరానికి మంచి ఆకారం, శక్తి లభిస్తాయి. అందుకే చిన్నప్పటి నుండే చాలా మంది ఆసనాలు వేయడం ప్రారంభించాలి.

మనలో అంతర్భాగం..

మనలో అంతర్భాగం..

యోగా అనేది మన జీవితంలో ఒక అంతర్భాగమే. ఇది పుట్టిన దగ్గర నుండి చేస్తున్న ప్రక్రియే. కాకపోతే దీన్ని మనం గమనించం. పసిపిల్లలు చిన్నతనంలోనే మకరాసనం, పవనముక్తసనం ఎన్నోసార్లు వేస్తూనే ఉంటారు. అయితే యోగా అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది.

యోగా చాలా పురాతనమైనది..

యోగా చాలా పురాతనమైనది..

యోగాను ఎక్కువగా సాధువులు సాధన చేసేవారని యూనివర్సిటీ ఆఫ్ లండన్ కు చెందిన పరిశోధనకుడు, సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ మల్లిన్ సన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన చరిత్ర మీద అధ్యయనం చేస్తున్నారు.

విదుర నీతి: మీరు ధనవంతులు కావాలంటే వెంటనే ఈ 6 అలవాట్లను వదిలేయండివిదుర నీతి: మీరు ధనవంతులు కావాలంటే వెంటనే ఈ 6 అలవాట్లను వదిలేయండి

అప్పట్లో స్థిరంగా..

అప్పట్లో స్థిరంగా..

అప్పట్లో స్థిరంగా యోగా చేసేవారని, ప్రస్తుతం యోగా శిక్షణా కేంద్రాల్లో మనం చూస్తున్న యోగసనాలు అప్పట్లో ఉండేవి కాదట.

19వ శతాబ్దం నుండే..

19వ శతాబ్దం నుండే..

ఒకప్పుడు యోగాసనాలలో ‘సూర్య నమస్కారం' అనేది లేదట. అయితే 1930 తర్వాత సూర్య నమస్కారం బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని, చరిత్ర పుస్తకాల ద్వారా ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పారు.

అనేక రూపాలలో యోగా..

అనేక రూపాలలో యోగా..

గత శతాబ్ద కాలంలో గ్లోబలైజేషన్ కారణంగా యోగాలో కూడా అనేక రూపాలు వచ్చాయట. అందులోనూ కొత్త కొత్త ఆసనాలు చాలానే వచ్చాయి. అంతేకాదు చాలా దేశాల్లో యోగాకు విపరీతమైన ప్రాధాన్యత పెరిగింది. అందులో అష్టాంగ యోగా, అయ్యంగార్, విన్యాస యోగా కూడా కొత్త కాలంలో పుట్టుకొచ్చినవే. ‘అష్టాంగ యోగ'ను పతంజలి మహర్షి గుర్తించినట్లు చెబుతుంటారు.

యోగా లక్ష్యం..

యోగా లక్ష్యం..

మనకు శారీరక, మానసిక పరమైన సమస్యల నుండి ఉపశమనం కలిగించడమే యోగా యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు.చాలా మందికి యోగా అనగానే ఇదొక ఒక కఠోరమైన సాధన అని భావిస్తూ ఉంటారు. కానీ ఇది ఎవరైనా సులభంగా చేసే ఆసనాలు. ప్రస్తుతం ఉన్న గజిబిజి లైఫ్ లో ప్రశాంతత కావాలంటే కచ్చితంగా యోగా చేయాలి. అయితే మీ వయసును బట్టి, మీరు ఏ ఆసనం వేయాలో అవగాహన ఉంటే చాలు. యోగాను ఎవరైనా.. ఎక్కడైనా.. ఎప్పుడైనా సాధన చేయవచ్చు.

English summary

international yoga day2022: Who is the Father of Yoga & Who Introduced It To The World?

Here we talking about who is the father of yoga & who introduced it to the world. Read on
Desktop Bottom Promotion