Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మీ రాశిని బట్టి, మీ నిజమైన మిత్రులు మరియు శత్రువులు ఎవరో తెలుసుకోండి...!
మీ రాశి చక్రం ప్రకారం మీ మిత్రువులు మరియు శత్రువులు ఎవరో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు నమ్మినా.. నమ్మకపోయినా జ్యోతిష్యశాస్త్రం ప్రతి ఒక్కరికీ రాశిచక్రం అనేది కచ్చితంగా ఉంటుంది.

ప్రతి ఒక్క రాశిచక్రానికి సొంత స్వభావం అనేది కచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి రాశిచక్రం యొక్క కొంతమంది స్నేహితులు మరియు శత్రువులను కలిగి ఉంటారు.

వీరిలో మన మంచి కోరుకునే వారిని మిత్రులని.. మన హాని కోరుకునే వారిని శత్రువులని పిలుస్తారు.

కాబట్టి రాశి చక్రం ప్రకారం, మీరు ఇతర రాశిచక్రాలతో మంచి స్నేహాన్ని కలిగి ఉండటం, అదే సమయంలో ఎవరితో శత్రుత్వం ఉంటుంది అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. అందువల్ల వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి కర్కాటక, తుల, ధనస్సు రాశి చక్రాలు మిత్రువులుగా ఉంటే.. మిధున, సింహ, కన్య రాశుల వారు శత్రువులుగా ఉండే అవకాశం ఉంది.

వృషభరాశి..
ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇది సంపద, ఐశ్వర్యం, అందం వంటి విషయాలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యక్తులు పుట్టుకతోనే మొండి పట్టుదల గలవారు. వీరికి కన్య, మకరం మరియు కుంభ రాశులు స్నేహితులుగా ఉంటే, వృశ్చికం మరియు ధనస్సు రాశి వారు శత్రువులుగా ఉంటారు.

మిధున రాశి..
ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశి వారు చాలా సందర్భాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఈ రాశి వారికి కన్య, తుల మరియు కుంభ రాశి బెస్ట్ ఫ్రెండ్స్ కాగా, మేషం, కర్కాటక, వృశ్చిక రాశుల వారు శత్రువులుగా ఉంటారు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ వ్యక్తులు వారి అద్భుతమైన ఆలోచనలను కలిగి ఉంటారు. వీరికి తుల, వృశ్చికం, మీనం మరియు కుంభం వారికి స్నేహితులు కాగా, సింహ, మిధున మరియు కన్య రాశి వారు శత్రువులుగా ఉంటారు.

సింహ రాశి..
ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. మీరు సానుకూల ఆలోచనలతో నిండి ఉంటారు. మీరు ఏదైనా పని చేయాలనుకుంటే, దానిని పూర్తి చేసేందుకు వెనుకడుగే వేయరు. అంతేకాదు మీ భిన్నమైన మరియు ప్రత్యేకమైన ప్రదర్శన కారణంగా మీకు శత్రువులు తక్కువగా ఉంటారు. వృశ్చికం, మేష, మీనం రాశుల వారు మిత్రులు కాగా. తుల, ధనస్సు, కర్కాటకం మరియు మకర రాశి వారు శత్రువులుగా ఉండే అవకాశం ఉంది.

కన్య రాశి..
ఈ రాశి వారికి అధిపతి బుధుడు. వీరికి ప్రపంచంపై మంచి అవగాహన ఉంటుంది. వీరి వ్యక్తిత్వం కూడా చాలా ఆలోచనాత్మకంగా ఉంటుంది. వీరికి వృషభం, కుంభం మరియు మకర రాశిచక్ర గుర్తులతో స్నేహం ఉండగా.. మేషం మరియు కర్కాటక రాశుల వారితో శత్రుత్వం ఉంటుంది.

తుల రాశి..
ఈ రాశి చక్రానికి అధిపతి శుక్రుడు. వీరు కోపాన్ని నియంత్రించడం అనేది చాలా కష్టం. వీరికి మిధునం, కర్కాటకం మరియు కుంభం మంచి స్నేహితులు కాగా, ధనస్సు మరియు మీన రాశి వారు శత్రువులుగా ఉంటారు.

వృశ్చికరాశి..
ఈ రాశి వారికి అధిపతి మార్స్. ఈ కారణంగా వీరు చాలా స్మార్ట్ గా ఉంటారు. వీరు ప్రతి పనిని ఉత్తమమైన మార్గంలో చేస్తారు. వీరు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. మీరు సింహ, కర్కాటకం, మీన రాశి వారితో స్నేహం చేస్తారు. అయితే మకరం, మిధున,కన్య రాశుల వారు వీరికి నచ్చరు. ఈ కారణంగా వారితో దూరంగా ఉంటారు.

ధనస్సు రాశి..
ఈ రాశి చక్రం వారికి అధిపతి గురువు. ఈ వ్యక్తులు చాలా నిరాడంబరమైన జీవన ఉన్నత ఆలోచనను నమ్ముతారు. వీరు అదే మార్గాన్ని అనుసరిస్తారు. వీరు తెలివైన మరియు స్థిరమైన వ్యక్తులను ఇష్టపడతారు. ఈ కారణంగా వృశ్చికం, కర్కాటకం మరియు మీన రాశి వారితో ఎక్కువగా స్నేహం చేస్తారు. అదే సమయంలో వృషభం, మేషం మరియు తుల రాశి వారితో శత్రుత్వం పెంచుకుంటారు.

మకర రాశి..
ఈ రాశి వారికి అధిపతి శని ప్రభువు. వీరు ఏ పని చేసినా చాలా ప్రతిష్టాత్మకంగా చేపడతారు. వీరు ప్రతి పనిని పూర్తి అంకితభావంతో, కష్టంతో పూర్తి చేస్తారు. వీరు వృషభం, కన్య మరియు కుంభ రాశులతో స్నేహం చేయగా.. సింహ, వృశ్చికం మరియు మీన రాశి వారితో దూరంగా ఉంటారు.

కుంభ రాశి..
ఈ రాశి చక్రానికి కూడా అధిపతి శని గ్రహమే. వీరు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అయితే వీరు తప్పులను ఎప్పటికీ సహించరు. వీరికి వృషభం, కన్య, కుంభ రాశులతో స్నేహితులుగా ఉండగా.. సింహ, వృశ్చికం, మీన రాశివారితో శత్రుత్వం పెంచుకుంటారు.

మీన రాశి..
ఈ రాశి చక్రానికి అధిపతి గురువు. ఈ వ్యక్తులు చాలా శ్రద్ధగా పని చేస్తారు. వీరు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు. కానీ చాలా మంది ఈ లక్షణాన్ని తప్పుగా ఉపయోగించుకుంటారు. కర్కాటకం, ధనస్సు మరియు వృశ్చికం వీటికి స్నేహితులు కాగా, వృషభం, తుల మరియు కుంభ రాశుల వారు శత్రువులుగా ఉంటారు.



Click it and Unblock the Notifications











