For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Who Was Prithviraj Chauhan:పృథ్వీరాజ్ చౌహన్ ఎవరు? తను ఒట్టి చేతులతోనే పులిని చంపాడా?

పృథ్వీరాజ్ చౌహన్ ఎవరు? తన చరిత్ర ఏంటి? తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

చరిత్రను పరిశీలిస్తే ఎందరో మహారాజులు ఉన్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో యోధాను యోధులు ఉన్నట్లు చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. అందులో ముఖ్యమైన వారిలో పృథ్వీరాజ్ చౌహన్ ఒకరు.

Who Was Prithviraj Chauhan

ఉత్తర భారతదేశంలో చివరి భాగంలో ఈ రాజు పేరు చాలా ప్రసిద్ధి గాంచింది. అందుకే తన పేరు మీద బయోపిక్ సినిమా కూడా వచ్చేసింది. ఇటీవలే అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ చౌహన్ పాత్రలో నటించారు. ఈ సినిమా కూడా జూన్ 3వ తేదీన అంటే శుక్రవారం దేశ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ చౌహన్ ఎవరు? తన భార్య ఎవరు? చరిత్ర పృథ్వీరాజ్ చౌహన్ గురించి ఏం చెబుతోందనే విషయాలతో పాటు తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పృథ్వీరాజ్ చౌహన్ ఎవరు?
తను 12వ శతాబ్దం చివరి భాగంలో ఉత్తర భారతదేశంలోని అజ్మీర్ మరియు ఢిల్లీ రాజ్యాలను పాలించిన హిందూ చౌహాన్ రాజ వంశానికి చెందిన నిర్భయ రాజు. పృథ్వీరాజ్ చౌహన్ ధైర్యానికి మారు పేరు. ఈయన సుమారు 1177లో సింహాసనాన్ని అధిష్టించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

పృథ్వీరాజ్ చౌహన్
ఆస్థాన కవి చాంద్ బర్తై ప్రకారం, పృథ్వీరాజ్ చౌహన్ 1175 సంవత్సరంలో కన్నౌజ్ గహదవల రాజు జయచంద్ర రాథోడ్ కుమార్తె సంయుక్త(సంయోగిత)ను తనతో పాటు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెను వివాహం చేసుకుని, తనను రాణిగా ప్రకటించాడు. పృథ్వీరాజ్ చౌహన్ రొమాంటిక్ కథ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. తన రొమాన్స్ లో ఎంత ప్రాచుర్యం పొందాడో.. యుద్ధంలోనూ యోధుడిగా బాగా ప్రసిద్ధి చెందాడు.

ఘోరీతో భీకర యుద్ధం..
పృథ్వీరాజ్ చౌహన్ రెండు ప్రధాన యుద్ధాలు చేశాడు. మొదటిది తరైన్ యుద్ధం. ఇది 1191లో పృథ్వీరాజ్ చౌహన్ మరియు షహబుద్దీన్ మహమ్మద్ ఘోరీకి మధ్య జరిగింది. భీకరంగా జరిగిన యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహన్ ఘన విజయం సాధించాడు. అయితే ఓడిపోయిన ఘోరీని క్షమించి క్షేమంగా వదిలేశాడు.
అయితే రెండో ఏడాది ఘోరీ మళ్లీ దాడి చేశాడు. ఈ యుద్ధం 1192లో రెండో తరైన్ యుద్ధం జరిగింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య భీకరంగా జరిగిన యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహన్ దురద్రుష్టవశాత్తు పరాజయం పాలయ్యాడు.

Who Was Prithviraj Chauhan

పృథ్వీరాజ్ చౌహన్ పుట్టుక..
పృథ్వీరాజ్ చౌహన్ క్రీస్తు శకం 1168లో అజ్మీర్ రాజా సోమేశ్వర్ చౌహాన్ మరియు మహారాణి కర్పూరి దేవి రాజ కుటుంబంలో జన్మించారు. పృథ్వీరాజ్ చౌహన్ మధ్యయుగ జీవిత చరిత్రలు రాజు బాగా విద్యావంతుడని మరియు అతను ఆరు భాషలలో ప్రావీణ్యం కలిగి ఉన్నాడని చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు విలు విద్యలో సైతం తను చాలా ప్రావీణ్యం సంపాదించాడు.

పద్నాలుగు భాషల్లో..
పృథ్వీరాజ్ గురించి మరిన్ని విషయాలు..
పృథ్వీరాజ్ చౌహన్ తన చిన్న రోజుల్లో కేవలం తన రెండు చేతులతోనే పులిని చంపాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అతను పదమూడేళ్ల చిన్న వయసులోనే గుజరాత్ రాజును ఓడించాడు. అంతేకాదు తను ఏకంగా పద్నాలుగు భాషలు నేర్చుకోవడమే కాదు.. వాటిలో పట్టు కూడా సాధించడం విశేషం.

English summary

Who Was Prithviraj Chauhan? History, Unknown Facts, Death Year And Other Interesting Details in Telugu

Here we are talking about the who was prithviraj chauhan? History, unknown facts, death year and other interesting details in Telugu. Have a look
Desktop Bottom Promotion