సంక్రాంతి రోజు రథం ముగ్గు ఎందుకు వేస్తారో తెలుసా? ఇప్పుడు తెలుసుకోండి

ఇంటి ముందు వేసే ముగ్గుల వెనక సాంప్రదాయ, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. సంక్రాంతి రోజున ముగ్గులు ఎందుకు వేస్తారు. సంక్రాంతి రథం ముగ్గులు వేయడం వెనక కారణాలు ఏంటి, రథం ముగ్గు ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చేవి రంగురంగుల ముగ్గులు. ప్రతి ఇంటి ముందు రంగవల్లులు కనిపిస్తాయి. రకరకాల డిజైన్లు, రంగులతో చూడముచ్చటగా ఉంటాయి. ఇంటి ముందు వేసే ముగ్గుల వెనక సాంప్రదాయ, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. సంక్రాంతి రోజున ముగ్గులు ఎందుకు వేస్తారు. సంక్రాంతి రథం ముగ్గులు వేయడం వెనక కారణాలు ఏంటి, రథం ముగ్గు ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Why do we draw ratham muggu rangoli on sankranthi?

అందమైన ముగ్గు ఆ ఇంట్లోని సంతోషానికి అద్దం పడుతుంది. అందమైన ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీ వస్తుందని అంటారు. అదృష్టం వరిస్తుందని, వివిధ రంగులతో వేసే అందమైన ముగ్గులను దేవతలకు ఆహ్వానం పలుకుతాయని చెబుతారు. సనాతన కాలం నుండి ముగ్గు ఇంటి అలంకరణలో భాగం అయింది.

ముగ్గుల వెనక పురాణ కథ:

ముగ్గుల వెనక పురాణ కథ:

పూర్వం ఒక రాజు తన కుమారుడిని కోల్పోతాడు. తన కుమారుడిని బతికించాలని, తన వారసత్వాన్ని, తన వంశాన్ని ఆగిపోకుండా చూడాలని ఆ రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థస్తాడు. ఘోర తపస్సు చేస్తాడు. తన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై బియ్యపు పిండితో నేలపై తన కుమారిడి గీయాలని చెబుతాడు. అప్పుడు తాను ప్రాణ ప్రతిష్ట చేస్తానని చెబుతాడు. బ్రహ్మదేవుడు చెప్పినట్లుగానే ఆ రాజు బియ్యపు పిండితో తన కుమారుడిని గీస్తాడు. తర్వాత బ్రహ్మదేవుడు ప్రాణ ప్రతిష్ట చేయడంతో రాజు కుమారుడు బతికొస్తాడు.

అప్పటి నుండి రంగోళి అనేది జీవితం, అదృష్టం, సంతోషం, శ్రేయస్సుకు ప్రతీకగా మారిందని పెద్దలు చెబుతారు.

సంక్రాంతికి ముగ్గు ప్రాముఖ్యత:

సంక్రాంతికి ముగ్గు ప్రాముఖ్యత:

సంక్రాంతి రోజు వేసే ముగ్గులకు సంస్కృతిక, ఆధ్యాత్మిక, తాత్విక, శాస్త్రీయ దృక్పథాలు ఉన్నాయి. రాళ్లు, రప్పలు తొలగించి చక్కగా అలికిన నేల మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. పద్ధతి ప్రకారం పెట్టే చుక్కలు ఆకాశంలోని నక్షత్రాలను సూచిస్తాయి. ఆ చుక్కలను కలుపుతూ అందంగా తీర్చిదిద్దే ముగ్గు ఖగోళంలో ఎప్పటికప్పుడు జరిగే మార్పులకు సంకేతం. ముగ్గు మధ్యలో పెట్టే చుక్క సూర్య స్థానానికి సంకేతం. ముగ్గులో పెట్టే గీతలు స్థితి శక్తికి, చుక్కలు గతి శక్తికి సంకేతాలుగా చూస్తారు.

ఏ ముగ్గు దేనికి సంకేతం:

ఏ ముగ్గు దేనికి సంకేతం:

విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికి సంకేతం. పుష్పం ఆకారం పుష్యమి నక్షత్రానికి, పాము ఆకారం అశ్లేష నక్షత్రానికి సంకేతం. సింహం, మేక, చేప, కర్కాటకం ఆకారాలు ఆయా రాశులకు, నవగ్రహాలకు సంకేతాలుగా పేర్కొంటారు.

రథం ముగ్గు ప్రాముఖ్యత:

రథం ముగ్గు ప్రాముఖ్యత:

పండగ చివరి రోజు వేసే రథం ముగ్గు సామాజిక ఐక్యతను సూచిస్తుంది. మూడ్రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే సంక్రాతిని ఘనంగా సాగనంపడానికి పుట్టిందే రథం ముగ్గు.

అందరూ ఒకరికొకరు కలిసి సహజీవనం సాగించాలనే సంకేతాలతో ఒక ఇంటి ముందు వేసే రథం ముగ్గు తాడును మరొక ఇంటి ముందు వేసిన రథం ముగ్గుతో కలుపుతారు.

పండగ రోజుల్లో వేసే ముగ్గులు, ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలు లక్ష్మీ దేవికి ప్రీతికరం, మంగళకరం. అందుకే సంక్రాంతికి ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. భోగి పండ్లు, నవధాన్యాలు, గడ్డి పెడతారు.

ముగ్గు మధ్యలో పెట్టిన గొబ్బెమ్మలను పీడకలుగా మారుస్తారు. సంక్రాంతికి దాదాపు నెల రోజుల ముందు నుండి గొబ్బెమ్మలు పెట్టడం, వాటిని పిడకలుగా మార్చడం ఆనవాయితీగా వస్తుంది. భోగి రోజు ఆ పీడకలు, కర్రలు, ఆవు నెయ్యి వేసి ఆ మంటకు నీళ్లు వేడి చేసి వాటితో స్నానం చేస్తారు.

Desktop Bottom Promotion